newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారతీయులకు వైరస్ తట్టుకునే శక్తి ఎక్కువ అనడం భ్రమే.. మూడోదశ ఇంకా రాలేదు

09-04-202009-04-2020 18:03:16 IST
Updated On 09-04-2020 18:11:14 ISTUpdated On 09-04-20202020-04-09T12:33:16.371Z09-04-2020 2020-04-09T12:33:14.168Z - 2020-04-09T12:41:14.970Z - 09-04-2020

భారతీయులకు వైరస్ తట్టుకునే శక్తి ఎక్కువ అనడం భ్రమే.. మూడోదశ ఇంకా రాలేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయులతో పాటు ఆఫ్రికా దేశాల ప్రజలు కరోనా వైరస్‌ను తట్టుకోగలిగే శక్తి, నిరోధకత ఎక్కువగా ఉంటుందన్న భావన ఊహాజనితమైనదే తప్ప శాస్త్రీయంగా, ప్రయోగాత్మకంగా నిరూపితం కాలేదని వైద్యనిపుణులు  తేల్చి చెప్పారు. మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరుకుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి చీఫ్‌ ఇంటర్‌వెన్షనల్‌ పల్మనాలజిస్ట్‌ డా.హరికిషన్‌ తెలిపారు. మన దేశంలో మధ్య వయస్కులు, యువత శాతం ఎక్కువగా ఉండటం, ఇటలీ ఇతర పశ్చిమ దేశాల్లో వయసు మీరిన వారి శాతం ఎక్కువగా ఉండటమనేది ఈ వైరస్‌ బారిన పడుతున్న సంఖ్యతో పాటు అక్కడ మరణాలు ఎక్కువ కావడానికి కారణమవుతోందన్నారు.

లాక్‌డౌన్‌ సందర్భంగా రోడ్లపైకి ఎక్కువగా వచ్చి కలియ తిరుగుతున్న మధ్య వయస్కులు, ముఖ్యంగా యువకులకు ఈ వైరస్‌ సోకితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బయటపడినా, వారి ఇళ్లలోని పెద్దవాళ్లు, డయాబెటిస్, ఇతరత్రా బలహీనంగా ఉన్న వారికి వీరి నుంచి వైరస్‌ వ్యాపిస్తే పెను సమస్యగా మారుతుందని హెచ్చరించారు. అందువల్ల ఇళ్లలోని పెద్దవారి ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని గురించి ఆలోచించి బయట తిరగడం తగ్గించాలని సూచించారు. 

ఇంకా కొన్ని రోజులు అందరూ ఇళ్లకే పరిమితమై, ఇళ్లు, సమూహాల్లో వ్యక్తుల మధ్య ఆరడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించడం,, షేక్‌హ్యాండ్‌లు ఇవ్వకపోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా మాత్రమే ఈ వైరస్‌ మరింత విస్తరించకుండా బలహీనపరిచేందుకు అవకాశముందని స్పష్టం చేశారు. 

దేశవ్యాప్తంగా సరైన టైమ్‌కే లాక్‌డౌన్‌ ప్రకటించారు. మిగతా దేశాలతో పోల్చితే పాజిటివ్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుదల ఎక్కువగా లేకపోవడం, పాజిటివ్‌ కేసుల్లోనూ తీవ్రంగా ప్రభావితమై, మరణాలు సంభవిస్తున్న కేసులు కూడా తక్కువగా ఉండడం మనకు కలిసొచ్చే అంశం. పైగా భారత్ ఇంకా కరోనా వైరస్ వ్యాప్తి మూడో స్టేజీలో అడుగుపెట్టలేదు. ముందుగా విదేశాల నుంచి వచ్చిన వారికి, వారి నుంచి సన్నిహితులు, అక్కడి నుంచి కమ్యూనిటీ ఇన్ఫెక్షన్లకు దారి తీయడాన్ని థర్డ్‌ స్టేజ్‌గా పరిగణిస్తారు. ఇప్పటికీ మనకా పరిస్థితి రాలేదు. అమెరికా, ఇటలీ, స్పెయిన్, తదితర దేశాల కంటే మనం ఇంకా భిన్నమైన స్థితిలో ఉన్నామని డాక్టర్ హరికిషన్ తెలిపారు.

కచ్చితమైన క్వారంటైన్, ఐసోలేషన్‌ను పాటించడంతో పాటు వైరస్‌ ప్రభావాన్ని తగ్గిచేందుకు ట్రీట్‌మెంట్‌ ఇస్తే కరౌనా వైరస్ రోగులు కోలుకుంటారని, ఇవి పాటించనప్పుడే పరిస్థితి విషమిస్తుందని చెప్పారు. కరోనా కేసులతో డీల్‌ చేస్తున్న సింగపూర్, హాంకాంగ్‌లోని వైద్యులతో టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాం. వాళ్లు అనుసరిస్తున్న చికిత్స పద్ధతులు, వాడుతున్న మందులు, ఇతర అనుభవాల గురించి తెలుసుకున్నాం. సింగపూర్‌లో లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించడంతో పాటు పాజిటివ్‌ కేసుల గుర్తింపు, వారు ఎవరెవరిని కలిశారో, వారు ఎక్కడెక్కడున్నారో ట్రాక్‌ చేసి నియంత్రించి విజయం సాధించారని డాక్టర్ హరికిషన్ తెలిపారు.

చైనాలో కరోనా సోకిన వారి కోసం విడిగా ఆసుపత్రులు పెట్టి, రోగులను వివిధ బృందాల కింద విడగొట్టి చికిత్స అందించడంతో పాటు వైరస్‌ నివారణకు లేదా అదుపులోకి తెచ్చేందుకు ఉపయోగించే మందులపై స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. పేషెంట్లపై నిర్వహించిన పరీక్షలతో పాటు ఈ వ్యాధి లక్షణాలు, వైరస్‌ వ్యాప్తికి కారణాలు ఇతరత్రా అంశాలపై నిర్వహించిన పరిశోధనలతో చైనా వైద్యులు అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురించిన వ్యాసాలు ప్రస్తుతం మనతో పాటు వివిధ దేశాల్లో చికిత్సకు, అవగాహనకు, సమాచారానికి ఉపయోగపడుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కునేందుకు క్లినికల్‌ టెస్ట్‌లు నిర్వహించి వివిధ దశలు దాటి వ్యాక్సిన్‌ తయారయ్యేందుకు మరో ఏడాది, ఏడాదిన్నర సమయం పడుతుంది. వ్యాక్సిన్‌ కాకుండా కంట్రోల్‌ ట్రయల్స్‌కు ఆరేడు నెలల సమయం పడుతుంది. లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ అమలవు తున్న తీరు గ్రేట్‌. చాలా వరకు మంచి ఫలితాలనే సాధించాం. ఈ వ్యాధికి ట్రీట్‌మెంట్‌ లేదు. నివారణ ఒక్కటే మార్గం అన్నది అందరూ తెలుసుకోవాలి.

ఉష్ణోగ్రతలు పెరగడం తప్పకుండా సానుకూల ప్రభావం చూపనుంది. వేసవితాపం పెరగడం, 20 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలుంటే వైరస్‌ తీవ్రత తగ్గేందుకు అవకాశం ఉంది. చైనాలోనూ టెంపరేచర్‌ పెరగడం వల్ల దీని తీవ్రత తగ్గిందనే వాదనా ఉంది. మిగతా దేశాలతో పోల్చితే ఇక్కడ తీవ్రత బలహీనంగా ఉందనేది నిరూపితం కాలేదు. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ఒకరిద్దరికి సోకితే, వైరస్‌ వ్యాప్తి చెందే వేరియబుల్‌ (ఆర్‌ జీరో) ముందు ఒకరి నుంచి 2, 2.5 మందికి వ్యాప్తి చెందుతుందని తొలుత భావించినా, ఇప్పుడు ఇది 4 నుంచి 4.5 మందికి వ్యాప్తి చెందేదిగా మారింది. దీన్నే ఆర్‌–నాట్‌గా పరిగణిస్తున్నాం. ఇది నలుగురి నుంచి ఐదుగురికి, వారి నుంచి మరికొందరికి వ్యాపించే అవకాశాలున్నాయని డాక్టర్ హరికిషన్ తెలిపారు.

అయితే కరోనా వైరస్ మే మధ్యనాటికి భారత్‌లో తీవ్రస్థాయికి చేరుకునే అవకాశం ఉందని హార్వర్డ్ గ్లోబల్ ఇనిస్టిట్యూషన్ ఫ్యాకల్టీ డైరెక్టర్ అశిష్ జా హెచ్చరించారు. కరోనా వైరస్ చికిత్స చేయడానికి నిర్దష్టమైన ఆసుపత్రులు ఏర్పాటు కాకుండా కరోనా వైరస్ ప్రభావం లేదని, భారత్‌లో అది పెద్ద నష్టాలు కలిగించకుండా త్వరలోనే నిష్క్రమిస్తుందని  భావించడం మతిలేనితనమే అవుతుంది జా తెలిపారు. భారత్‌లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలకంటే ఎక్కువగానే మనిషి నుంచి మనిషికి వైరస్ ట్రాన్స్‌మిషన్ జరుగుతున్నట్లు కనిపిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే మే నెల చివరి నాటికి మరో ఆరువారాల లాక్ డౌన్ దేశంలో విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కాక తప్పవని అశిష్ జా హెచ్చరించారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle