newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

భారతీయులకు ట్రంప్ బ్యాడ్ న్యూస్..... ఇమ్మిగ్రేషన్లపై బ్యాన్

21-04-202021-04-2020 11:34:03 IST
Updated On 21-04-2020 13:00:26 ISTUpdated On 21-04-20202020-04-21T06:04:03.678Z21-04-2020 2020-04-21T06:02:13.763Z - 2020-04-21T07:30:26.687Z - 21-04-2020

భారతీయులకు ట్రంప్ బ్యాడ్ న్యూస్..... ఇమ్మిగ్రేషన్లపై బ్యాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికా దేశ పౌరుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశీయులకు నో ఎంట్రీ. ఇమ్మిగ్రేషన్ రద్దు చేస్తున్నామంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికన్ పౌరుల ఉద్యోగాలు రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కరోనాతో అమెరికాలో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా తయారవుతున్నాయి. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఆయన కార్యనిర్వహక ఉత్తర్వులు జారీచేశారు. కనబడని శత్రువు దాడి నుంచి తప్పించుకునేందుకు, అలాగే అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడుకునేందుకు తమ దేశంలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు  ట్రంప్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో  పోస్ట్‌ చేశారు.

మరోవైపు కరోనా వైరస్‌కు సంబంధించి చైనాపై ట్రంప్‌ ఎప్పటినుంచో నిప్పులు చెరుగుతున్నారు. మహమ్మారి కరోనా పుట్టుక, చైనా నివారణ చర్యలను కనుగొనేందుకు చైనాకు నిపుణుల బృందం పంపనుంది అమెరికా.  కరోనా వైరస్ పై  చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని, తప్పుడు లెక్కలు విడుదల చేసిందని ఆగ్రహంతో వున్న సంగతి తెలిసిందే.

కరోనా విపత్కర పరిస్థితుల్లో తమకు సాయం చేసేందుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. కరోనావైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ప్రభావం చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. అందుకే భారత్ నుంచి ఈ మందుని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది.  అయితే ఈమందు వల్ల కరోనా రోగులకు అంతగా ప్రయోజనం ఉండదంటున్నారు. మలేరియా రోగులపై హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని, ఆహారంతో పాటుగా తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్‌ను నివారించవచ్చని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) చెబుతోంది. 

కరోనా కారణంగా అమెరికాలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. పరిస్థితి అదుపులోనే వుందని చెబుతున్నా ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 7.75 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 42 వేలకు పైగా మృతిచెందారు. మరే దేశంలోనూ కరోనా ఈవిధంగా విధ్వంసం కలిగించలేదు. నాలుగైదు రోజుల నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల్లోనే ఏకంగా 3,856 మరణాలు నమోదయ్యాయి. ఉత్తర న్యూజెర్సీలో కోవిడ్‌ కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నర్సింగ్‌హోమ్‌లో శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మార్చికి ఏప్రిల్ మూడవ వారానికి మరణాల సంఖ్యలో భారీగా పెరుగుదల నమోదైంది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   10 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle