newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?

20-01-202020-01-2020 07:39:49 IST
Updated On 20-01-2020 11:50:35 ISTUpdated On 20-01-20202020-01-20T02:09:49.603Z19-01-2020 2020-01-19T15:14:00.034Z - 2020-01-20T06:20:35.885Z - 20-01-2020

బ‌డ్జెట్‌కు ముందు హ‌ల్వా వేడుక‌.. ఈ క‌థ మీకు తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏడాదికోసారి పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టే బ‌డ్జెట్ దేశంలో ఆర్థిక విధానాల‌ను నిర్ణ‌యిస్తుంది. దేశంలోని ప్ర‌తీ పౌరుడి జీవితంపై బ‌డ్జెట్ ప్ర‌త్య‌క్ష్యంగానో, ప‌రోక్షంగానో ప్ర‌భావం చూపుతుంది. ఇంత‌టి ముఖ్య‌మైన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌డంలోనూ కొన్ని సంప్ర‌దాయాలు కొనసాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్న ఈ సంప్ర‌దాయాల‌ను పాటిస్తున్నారు. ఇందు ముఖ్య‌మైన‌ది హ‌ల్వా వేడుక‌. ఈ సంవ‌త్స‌రం హ‌ల్వా వేడుక జ‌న‌వ‌రి 20వ తేదీన జ‌ర‌గ‌నుంది.

మ‌నం ఏదైనా ముఖ్య‌మైన ప‌ని ప్రారంభించే ముందు తీపి తిన‌డం ఒక అన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సంప్ర‌దాయం బ‌డ్జెట్ విష‌యంలోనూ ఉంది. అదే హ‌ల్వా వేడుక‌. కేంద్ర ఆర్థిక మంత్రి ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక జ‌రుగుతుంది.

ఇందులో బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌లో పాల్గొనే ఆర్థిక శాఖ ఉద్యోగులు, అధికారులు పాల్గొంటారు. వీరికి కేంద్ర ఆర్థిక మంత్రి స్వ‌యంగా హ‌ల్వా వ‌డ్డిస్తారు. ఎప్పుడూ విధుల్లో నిమ‌గ్న‌మ‌య్యే అధికారులు ఈ వేడుక‌లో ఆహ్లాదంగా గ‌డుపుతారు.

బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న అనేది అత్యంత గోప్య‌త‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. బ‌డ్జెట్‌లో ఉండే అంశాలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపిస్తాయి. కాబ‌ట్టి బ‌డ్జెట్‌లోని అంశాల‌ను ఎక్క‌డా బ‌య‌ట‌కు తెలియ‌కుండా ఆర్థిక శాఖ జాగ్ర‌త్త ప‌డుతుంది. పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే వర‌కు బ‌డ్జెట్ ఎలా ఉండ‌బోతోంది ? కేటాయింపులు ఎలా ఉంటాయి ? ప‌న్ను స్లాబుల్లో ఏవైనా మార్పులు ఉంటాయా ? వ‌ంటి అంశాలు బ‌య‌ట‌కు రావు.

ఇందుకోసం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇందులో భాగంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న స‌మ‌యంలో ప‌ది రోజుల పాటు అధికారులు, క్ల‌ర్క్‌లు వారి ఇళ్ల‌కు కూడా వెళ్లరు. నార్త్ బ్లాక్‌లోనే వారంతా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ‌స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడ‌టం మిన‌హా ఎవ‌రితోనూ మాట్లాడే అవ‌కాశం కూడా ఉండ‌దు. ఆ ఫోన్లు కూడా ఆర్థిక శాఖ ఇచ్చే ప్ర‌త్యేక ఫోన్ల నుంచే మాట్లాడాల్సి ఉంటుంది. ఇంత గోప్యంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంది. ఈ ప్ర‌క్రియ‌లో మొత్తం సుమారు వంద మంది పాల్గొంటారు.

ఇంత క‌ష్ట‌ప‌డే వారికి గుర్తింపుగా, ఏదైనా ప‌ని చేసే ముందు తీపి తినాల‌నే సంప్ర‌దాయంలో భాగంగా ఈ హ‌ల్వా వేడుక జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రి 1న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నుండ‌టంతో జ‌న‌వ‌రి 20వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆధ్వ‌ర్యంలో హ‌ల్వా వేడుక జ‌ర‌గ‌బోతోంది. ఒక పెద్ద పాత్ర‌లో త‌యారు చేసిన హ‌ల్వాను ఆమె ఉద్యోగుల‌కు వ‌డ్డించ‌బోతున్నారు.

ఈ వేడుక త‌ర్వాత ఆ ఉద్యోగులు పూర్తిగా బ‌డ్జెట్ ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌వుతారు. ఈ హ‌ల్వా వేడుక సంప్ర‌దాయం ఎప్ప‌టి నుంచి వ‌స్తుంద‌నే దానికి స‌రైన ఆధారాలు లేవు కానీ ద‌శాబ్దాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆర్థిక మంత్రి ఎవ‌రు ఉన్నా కొన‌సాగిస్తున్నారు.

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle