newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

బ్రేకింగ్: 19న ప్రధాని అఖిలపక్ష భేటీ.. చైనా అంశంపై చర్చ

17-06-202017-06-2020 14:03:54 IST
Updated On 17-06-2020 14:48:46 ISTUpdated On 17-06-20202020-06-17T08:33:54.587Z17-06-2020 2020-06-17T08:33:44.881Z - 2020-06-17T09:18:46.801Z - 17-06-2020

బ్రేకింగ్:  19న ప్రధాని అఖిలపక్ష భేటీ.. చైనా అంశంపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లఢక్ సరిహద్దులో చైనాతో వివాదం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 19న అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయపార్టీలతో చర్చించి సంచలన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.

శుక్రవారం (జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఈ అంశంపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో కోరింది.

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భారత్ -చైనా దళాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 35 మంది చైనా చైనికులు మరణించినట్టు అమెరికాకు చెందిన నిఘావర్గాలు తెలిపాయి.

ప్రీప్రెస్ జర్నల్ తో పాటు భారతీయ వార్తా సంస్థ పీటీఐలోనూ ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. భారత్ -చైనా సరిహద్దుల్లో జరిగే ఘర్షణల్లో ప్రాణనష్టాన్ని బీజింగ్ దాచిపెడుతోందని ఆ వార్తా సంస్థ కథనం తెలిపింది. 1962లో యుద్ధం వల్ల జరిగిన నష్టం వివరాలను 1994లో వెల్లడించిందని ఓ రక్షణ రంగ నిపుణుడు తెలిపారు. తాజా ఘర్షణల్లో 40 మంది చైనా సైనికులు మరణించి వుంటారని ఇండియన్ ఆర్మీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు చైనా సరిహద్దుల్లో భారతీయ సైనికులు అపార ధైర్యసాహసాలు కనబరిచారని, వారి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.  లద్దాఖ్‌లో చైనా సైనికులతో తలపడి వీరమరణం పొందిన భారత జవాన్ల కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంఘీభావం తెలిపారు. సైనికులను కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు.   ‘భారత సైనికులను కోల్పోవడం ఎంతో కలచివేస్తోంది. ఇది ఎంతో బాధాకరం. విధి నిర్వహణలో వారు అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారు. దేశం కోసం ప్రాణాలలొడ్డి భారత ఆర్మీ విలువలను సమున్నతంగా చాటారు’ అని ట్విట్ చేశారు రాజ్ నాథ్ సింగ్. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle