newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

బ్రేకింగ్: మే 17 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

01-05-202001-05-2020 18:47:06 IST
Updated On 01-05-2020 19:33:34 ISTUpdated On 01-05-20202020-05-01T13:17:06.455Z01-05-2020 2020-05-01T13:16:15.995Z - 2020-05-01T14:03:34.630Z - 01-05-2020

బ్రేకింగ్: మే 17 వరకూ లాక్ డౌన్ పొడిగింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్‌డౌన్ గడువు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ మరో రెండువారాలు పొడిగించింది. మే 3తో లాక్ డౌన్ ముగియనుండడంతో మే 17 వరకూ లాక్ డౌన్ పొడిగించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు లాక్ డౌన్ విధించింది. ఇప్పుడు మూడోసారి లాక్ డౌన్ వైపు మొగ్గుచూపింది. లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం వల్ల చాలా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అయినా ప్రజల ప్రాణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోకతప్పదు అంటున్నారు ప్రధాని మోదీ. ఇవాళ జరిగిన కీలక సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రులు, వివిధ మంత్రిత్వశాఖలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. మూడో విడత లాక్ డౌన్లో గ్రీన్, ఆరెంజ్ జోన్లు వున్న జిల్లాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఈమేరకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. అయితే విమానాలు, రైల్వే, మెట్రో, సబర్బన్, అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణాలపై అన్ని జోన్లలో నిషేధం విధించింది. రాజకీయ, మతపరమయిన సమావేశాలకు అనుమతులు ఇవ్వడంలేదు. దేశంలో తొలిసారి 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించారు. అది ముగియక ముందే మరోసారి ఏప్రిల్ 3 వరకూ లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. రెండవ సారి లాక్ డౌన్ కూడా ముగియకముందే లాక్ డౌన్ 3.O ప్రకటించారు మోడీ. 

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, ఇతరులను రైళ్లలో తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వారిని తమ తమ స్వస్థలాలకు పంపించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కూలీలు తరలింపునకు రైలు సేవలు వినియోగించుకునేలా మార్గదర్శకాలను సవరిస్తూ హోంశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక రైళ్లను రైల్వేమంత్రిత్వ శాఖ నడుపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీనికి సంబంధించి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకునేందుకు ఓ నోడల్‌ అధికారిని రైల్వే శాఖ నియమిస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం మాట్లాడుకుని, రైల్వే శాఖతో సంప్రదించి ఈ రైళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రామిక ప్రత్యేక రైళ్లు పేరిట వీటిని ఇవాల్టి నుంచి నడపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైలు ఎక్కించేటప్పుడు, గమ్యస్థానం చేరుకున్న తరువాత అక్కడి ప్రభుత్వ అధికారులు స్వయంగా వచ్చి తీసుకువెళ్లేలా చూడాలని ఆదేశాల్లో పేర్కొంది. టికెట్ల విక్రయం, రైళ్లు, రైల్వే స్టేషన్‌, ప్లాట్‌ఫాంపై భౌతిక దూరానికి సంబంధించి మార్గదర్శకాలను రైల్వేశాఖ జారీ చేయనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అన్ని జోనల్ మేనేజర్లకు రైల్వే శాఖ ప్రత్యేక ఆదేశాలు పంపింది.

ఇప్పటికే తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు 1200 మంది వలస కూలీలతో ప్రత్యేక రైలు ఇవాళ ఉదయం బయలుదేరిన సంగతి తెలిసిందే. అలాగే ట్రక్కుల రవాణాకు అనుమతివ్వాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. సరకు రవాణాకు ఇబ్బందుల లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాత్సవ తెలిపారు. వలస కూలీలు, విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ మేరకు దిల్లీలో సంయుక్త మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఇటు తెలంగాణలో కరోనా ఎఫెక్ట్‌డ్ జిల్లాలను జోన్లుగా ప్రకటించింది కేంద్రం. రెడ్‌జోన్లుగా హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట,  వరంగల్ అర్బన్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలున్నాయి. ఆరెంజ్‌ జోన్లుగా గద్వాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసీఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, జనగాం, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, నారాయణపేట, మంచిర్యాల వున్నాయి. గ్రీన్‌ జోన్లుగా ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ , భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, సిద్దిపేట, భువనగిరి యాదాద్రి, వరంగల్ రూరల్ వున్నాయి. 

 

 

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   3 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   a day ago


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle