newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

బ్రేకింగ్... నిర్భయ నిందితుల ఉరిపై స్టే.. మూడో ‘సారీ’వాయిదా

31-01-202031-01-2020 18:44:32 IST
Updated On 01-02-2020 12:17:47 ISTUpdated On 01-02-20202020-01-31T13:14:32.675Z31-01-2020 2020-01-31T13:14:30.931Z - 2020-02-01T06:47:47.676Z - 01-02-2020

బ్రేకింగ్... నిర్భయ నిందితుల ఉరిపై స్టే.. మూడో ‘సారీ’వాయిదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెల్లారితే ఉరితీయాల్సిన నిర్భయ నిందితులకు మరో అవకాశం వచ్చింది. నిర్భయ నిందితుల ఉరిపై పాటియాల కోర్టు స్టే విధించింది. దీంతో నిర్భయ నిందితుల ఉరి కథ మొదటికే వచ్చింది. శుక్రవారం నిర్భయ నిందితులు నలుగురికి వీధించి ఉరిశిక్ష మీద స్టే విధించింది ఢిల్లీ పాటియాలా కోర్టు. ఆ నలుగురికీ రేపు ఉరి లేనట్టే. అమలుకు కొద్ది గంటల ముందే వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు శిక్ష అమలు చేయొద్దని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

మరణ శిక్ష అమలు చేయకుండా స్టే విధించాలని నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను గురు, శుక్రవారాల్లో విచారించిన ఢిల్లీ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఉరి అమలు చేయొద్దని తీర్పునిచ్చింది. దీంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి జనవరి 22న ఉరి తీయాలని న్యాయస్థానం తొలుత డెత్ వారంట్ జారీ చేసింది. క్యూరేటివ్ పిటిషన్ల కారణంగా రెండవసారి దాన్ని ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ఇప్పటి వరకూ మూడుసార్లు వీరి ఉరి వాయిదా పడింది.

శనివారం ఉదయం ఆరు గంటలకు తీహార్ జైల్లో నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉంది. కాగా ఉరి అమలుపై స్టే విధించాలని కోరుతూ దోషులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో తిహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ వాదనలు వినిపించారు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే పెండింగ్లో ఉందని.. మిగతా ముగ్గుర్ని ఉరి తీయొచ్చని అహ్మద్ న్యాయస్థానానికి తెలిపారు. దోషులను ఉరి తీయడంలో ఎలాంటి న్యాయపరంగా ఎలాంటి అవరోధాలు లేవన్నారు.

ముగ్గురు దోషుల పిటిషన్‌ను అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా విచారించారు. న్యాయపరంగా తమకున్న అవకాశాలను దోషులు పూర్తిగా వినియోగించుకోలేదని.. ఉరి అమలును వాయిదా వేయాలని దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ కోరారు. మరోవైపు పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 2012లో నేరానికి పాల్పడినప్పుడు తను మైనర్‌నని పవన్ వాదించాడు.

ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఉరి శిక్ష అమలు కోసం తిహార్ జైల్లో తలారి పవన్ జల్లాద్ సమక్షంలో శుక్రవారం ట్రయల్ నిర్వహించారు. తాజా నిర్ణయంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కన్నీరుమున్నీరయ్యారు. వాయిదాల మీద వాయిదాలు వేయడంపట్ల ఆమె మండిపడ్డారు. తమ కూతురి ఆత్మ క్షోభిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. 

చదవండి : మృగాళ్ళకు మళ్ళీ మారిన ఉరి తేదీ.. నిర్భయ తల్లి అసహనం

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle