newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

14-01-202014-01-2020 15:31:56 IST
Updated On 14-01-2020 16:30:17 ISTUpdated On 14-01-20202020-01-14T10:01:56.482Z14-01-2020 2020-01-14T10:01:53.564Z - 2020-01-14T11:00:17.730Z - 14-01-2020

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు.  నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ ఠాకూర్‌ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ డెత్ వారెంట్లపై నిందితుల్లో ఇద్దరైన వినయ్‌ శర్మ, ముఖేష్‌ కుమార్లు సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేశారు.   ఈ పిటిషన్ పై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ , అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారీమణ్‌, ఆర్‌ భానుమతి, అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. అనంతరం పిటిషన్‌‌ను కొట్టివేసింది. దీంతో వీరి ఉరికి రంగం సిద్ధమయింది. ఇప్పటికే ఉరి కోసం జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు.

బీహార్ బక్సర్ నుంచి తెచ్చిన ఉరితాళ్ళను ఉరికి సిద్ధం చేశారు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై నిర్భయ తల్లి ఆశాదేవి సంతోషం వ్యక్తం చేశారు.   

‘‘ఇది నాకు చాలా ముఖ్యమయిన రోజు. నిర్భయ కేసు దోషుల క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం. ఏడేళ్ళ నుంచి నేను చేస్తున్న పోరాటంలో జనవరి 22న వారిని(దోషులను) ఉరి తీయడం అంతకంటే ప్రధానమయిన రోజవుతుంది. -ఆశాదేవి, నిర్భయ తల్లి’’ 

నిరుపేదలకు శుభవార్త.. గరీబ్ కల్యాణ్ పథకం పొడిగింపు

నిరుపేదలకు శుభవార్త.. గరీబ్ కల్యాణ్ పథకం పొడిగింపు

   11 hours ago


ముంబైలో అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి

ముంబైలో అంబేద్కర్ ఇంటిపై దుండగుల దాడి

   12 hours ago


యూపీలో వికాస్ దూబె కోసం గాలింపు.. సహాయకుడి ఎన్ కౌంటర్

యూపీలో వికాస్ దూబె కోసం గాలింపు.. సహాయకుడి ఎన్ కౌంటర్

   21 hours ago


పాక్ పనిపట్టేందుకు రెడీగా ఉన్నాం.. భారత్ ఆర్మీ లెఫ్టినెంట్ ప్రకటన

పాక్ పనిపట్టేందుకు రెడీగా ఉన్నాం.. భారత్ ఆర్మీ లెఫ్టినెంట్ ప్రకటన

   a day ago


కరోనా వ్యాక్సిన్‌  ప్రకటనలో గందరగోళం.. రాజకీయ కోణంపై దుమారం

కరోనా వ్యాక్సిన్‌ ప్రకటనలో గందరగోళం.. రాజకీయ కోణంపై దుమారం

   07-07-2020


ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్...18వేల ఉద్యోగాల తొలగింపు

ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్...18వేల ఉద్యోగాల తొలగింపు

   07-07-2020


దోవల్ దౌత్యం ఫలించినట్లే... వెనక్కు మళ్లిన చైనా సైన్యం

దోవల్ దౌత్యం ఫలించినట్లే... వెనక్కు మళ్లిన చైనా సైన్యం

   07-07-2020


ఎనిమిది లక్షలమంది భారతీయుల ఉద్యోగాలు ఫట్.. షాక్ ఇచ్చిన కువైట్

ఎనిమిది లక్షలమంది భారతీయుల ఉద్యోగాలు ఫట్.. షాక్ ఇచ్చిన కువైట్

   07-07-2020


హైడ్రాక్సీక్లోరోక్విన్‌లో పసలేదు.. ట్ర‌యల్స్ నిలిపివేత‌‌ డ‌బ్ల్యూహెచ్‌వో

హైడ్రాక్సీక్లోరోక్విన్‌లో పసలేదు.. ట్ర‌యల్స్ నిలిపివేత‌‌ డ‌బ్ల్యూహెచ్‌వో

   06-07-2020


విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ

   06-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle