newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

బ్రేకింగ్:పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కి ఉరి శిక్ష

17-12-201917-12-2019 13:03:35 IST
Updated On 17-12-2019 13:09:45 ISTUpdated On 17-12-20192019-12-17T07:33:35.500Z17-12-2019 2019-12-17T07:33:21.459Z - 2019-12-17T07:39:45.046Z - 17-12-2019

బ్రేకింగ్:పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కి ఉరి శిక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషరఫ్‌కు ఆ దేశ న్యాయస్థానం షాకిచ్చింది. ఆయనకు ఉరి శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది. దేశ ద్రోహంలో ముషారఫ్ ను దోషిగా తేల్చింది పాకిస్తాన్ కోర్టు. పాకిస్థాన్ రాజ్యంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్‌ తీవ్రమైన దేశద్రోహానికి పాల్పడినట్టు తేల్చింది ప్రత్యేక న్యాయస్థానం. ఆ దేశ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి కఠిన శిక్ష విధించడం ఇదే తొలిసారి. 

ఫర్వేజ్ ముషారఫ్ పై 2013లోనే దేశ ద్రోహం కేసు నమోదయ్యింది. ఈ కేసులో ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ముషారఫ్‌ విదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

మూడేళ్ల క్రితం పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్... ప్రస్తుతం అక్కడే తల దాచుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్... సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకుని పాలించారు. 

ముషారఫ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక విచారణ జరిగింది. పెషావర్ లోని ప్రత్యేక న్యాయస్థానం సమగ్ర విచారణ చేపట్టింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వకార్ అహ్మత్ సేఠ్ సారథ్యంలో జస్టిస్ నజర్ అఖ్తర్, జస్టిస్ షాహిద్ కరీంలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసులపై సమగ్ర విచారణ నిర్వహించింది.

నజర్ అఖ్తర్ సింధ్ హైకోర్టుకు, షాహిద్ కరీం లాహోర్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. సైనిక ప్రభుత్వాన్ని కొనసాగించారు. ఈ చర్య దేశద్రోహం కిందికి వస్తుందంటూ అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   19 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle