newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

బ్రిటిష్ ప్రధానులను మింగేస్తున్న బ్రెగ్జిట్

11-09-201911-09-2019 15:13:56 IST
2019-09-11T09:43:56.501Z11-09-2019 2019-09-11T09:43:43.035Z - - 23-01-2020

బ్రిటిష్ ప్రధానులను మింగేస్తున్న బ్రెగ్జిట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బ్రెగ్జిట్ గ్రేట్ బ్రిటన్ ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆ దేశ ప్రధానులకు అదే పదవీ గండంగా మారింది. ఇప్పటికే బ్రెగ్జిట్ కారణంగా ఇద్దరు ప్రధానులు పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రధాని బోరిస్ జాక్సన్ కూడా పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్నే బ్రెగ్జిట్ అంటున్నాం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావాలా వద్దా అన్న విషయంపై రిఫెరెండం జరిగింది. స్వల్పమే అయినా మెజారిటీ బ్రిటిషర్లు బ్రెగ్జిట్ కే ఆమోదముద్ర వేశారు. 

ఆ రిఫరెండం కామెరూన్ పదవిని ఊడగొడితే...నిర్దిష్ట కాలవ్యవథిలో బ్రెగ్జిట్ ను సజావుగా పూర్తి చేయడంలో విఫలమైన థెరిస్సా మే కూడా ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు బోరిస్ జాన్సన్ వంతు వచ్చినట్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్ధమౌతుంది. అక్టోబర్ 31 నాటికి బ్రిటిష్ పార్లమెంటు బ్రెగ్జిట్  బిల్లును ఆమోదించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధన సాధ్యం కాకపోవడంతో ప్రధాని బోరిస్ జాన్సన్ సభను నిరవధికాంగా వాయిదా వేశారు. అక్టోబర్ 15 వరకూ సభను వాయిదా వేసేశారు. 

బ్రెగ్జిట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోకుండానే సభ వాయిదా పడడాన్ని బట్టి చూస్తే బ్రిటన్ ఎన్నికల వైపు అడుగులు వేస్తున్నదా అనిపించక మానదు. అయితే అదీ అంత తేలిక కాదు. ఒక వేళ ఎన్నికల ద్వారా బ్రెగ్జిట్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని బ్రిటన్ ప్రయత్నించినా...అందుకు మెజారిటీ సభ్యుల మద్దతు కావాలి. కానీ బోరిస్ జాన్సన్ కు ఆ మద్దతు లభించే అవకాశాలు దాదాపు మృగ్యం. విపక్షం బోరిస్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పేసింది. బ్రెగ్టిట్ విషయంలో నాడు సానుకూలంగా స్పందించిన ప్రజలు కానీ, కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలలో అత్యధికులు కానీ ఇప్పుడు బ్రెగ్జిట్ కు సుముఖంగా లేరు. 

సొంత పార్టీ నిర్ణయాన్నే వారు వ్యతిరేకిస్తున్నారు. ఆ కారణంగానే ఈ బిల్లు విషయంలో ముందడుగు వేయడంలో విఫలమై ఇద్దరు ప్రధానులు తమ పదవులను పోగొట్టుకున్నారు. ఇప్పుడు మూడో ప్రధానిగా బోరిస్ జాన్సన్ వంతు వచ్చిందా అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈయూ (యూరోపియన్ యూనియన్) లో భాగస్వామిగా ఉన్నంత కాలం బ్రిటిష్ యువతకు ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాలలో అన్యాయం జరుగుతుందన్న భావన ఈయూ నుంచిబయటకు రావాలన్న ఆలోచనకు, ఆందోళనకు కారణమైంది. బ్రెగ్జిట్ అయితే స్థానిక యువతకు అవకాశాలు అపారంగా ఉంటాయన్న భావన బ్రిటిషర్లలో విస్తృతంగా వ్యాపించడానికి ప్రధాన కారణం కన్సర్వేటివ్ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఎంపీలే. 

అయితే ఆ తరువాత వీరే తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అలా మార్చుకోవడానికి కూడా సహేతుక కారణాలు ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కవన్న భానవ ఎంత వాస్తవమో, ఈయూకి పెద్ద దిక్కుగా వ్యవహరించే బ్రిటన్ యూనియన్ నుంచి విడిపోతే వచ్చే నష్టాలు కూడా అధికమే.  అదేలాగంటే  బ్రిటన్‌ వాణిజ్య ఉత్పత్తులకు ఈయూ దేశాల్లో బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది.  వైదొలగడమంటూ జరిగితే బ్రిటన్ పెద్ద మార్కెట్ ను కోల్పోతుంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల మాట అటుంచి...ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. 

ఈ కారణంగానే ఇప్పుడు బ్రిటన్ లో బ్రెగ్జిట్ కు సానుకూలత కనిపించడం లేదు. బ్రిటన్ ఈ బలహీనతను అవకాశంగా తీసుకుని యూపీ సభ్యదేశాలు వైదొలగాలంటూ బ్రిటన్ పై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. నిజంగా ఇది బ్రిటన్ కు పెద్ద గడ్డు సమస్యే. దీనిని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు బోరిస్ జాన్సన్ ఏ వ్యూహం అనుసరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది.  ఇప్పటికిప్పుడైతే ఆయన పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్నట్లుగానే ఉంది. స్వపక్షం నుంచే మద్దతు కరవై ప్రధాని పదవిని ముళ్ల కిరీటంలా భావిస్తున్నారనే చెప్పాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle