newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

బ్యాంకు వేళలివే... 50 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు

04-05-202004-05-2020 08:59:16 IST
Updated On 04-05-2020 10:10:57 ISTUpdated On 04-05-20202020-05-04T03:29:16.422Z04-05-2020 2020-05-04T03:29:04.072Z - 2020-05-04T04:40:57.767Z - 04-05-2020

బ్యాంకు వేళలివే... 50 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. నిత్యం ప్రజలతో అనుసంధానంగా ఉండే బ్యాంకులు కూడా అదే బాటలో వున్నాయి. తమ ఖాతాదారులు ఎవరినీ బ్యాంకులకు రావద్దని, కస్టమేర్ కేర్ సెంటర్లలోనూ తక్కువ సిబ్బంది వున్నారని మెసేజ్ లు పంపాయి. తాజాగా సోమవారం నుంచి అన్ని బ్యాంకులు 50 శాతం ఉద్యోగులతో యథావిధిగా పనిచేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగించగా, కొన్ని కర్మాగారాలు, దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. 

‘కరోనా’ వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా బ్యాంకులు తక్కువ సిబ్బందితో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేశాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి బ్యాంకులు ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, 50 శాతం సిబ్బంది మాత్రమే విధులకు వినియోగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే సమయంలో క్వారంటైన్‌ ప్రాంతాల్లో మాత్రం పనిచేయవని, ఆయా జిల్లాల యంత్రాంగం నివేదికల ఆధారంగా ఆ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయడంపై త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో వుంటాయని ఏవైనా ఆధార్ అప్ డేట్, ఇతర అవసరమయిన సేవలు ప్రస్తుతం అందించడం లేదని బ్యాంకులు తెలిపాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. ఆదివారం ఢిల్లీ నుంచి ఆయన సీఎస్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్ డౌన్ వేళ ఏంచేయాలో నిర్దేశించారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు కరోనా సాయం అందిస్తున్న నేపధ్యంలో ఆ నగదు బ్యాంకులలలోనే జమ అవుతుంది. ఇక ఈ సమయంలో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.ఇక మన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సాయం బ్యాంకులలో డిపాజిట్ కాగా ఆ డబ్బు కోసం జనాలు క్యూ కట్టారు. గుంపులు గుంపులుగా బ్యాంకులకు రావడంతో బ్యాంకు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. 

బ్యాంకుల్లో కరెన్సీ నోట్ల వల్ల కూడా కరోనా వస్తుందని వార్తలు రావడంతో కరెన్పీ నోట్లను చూస్తేనే ఉద్యోగులు వణికిపోతున్నారు. ఈ కారణంగానే కొంత మంది సిబ్బంధి విధులకు రావడానికే భయపడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంకు నుంచి ఇంటికి వెళ్లేసరికి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని బ్యాంక్ సిబ్బంది అంటున్నారు. 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   18 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle