newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

బీహార్ కూడా నేపాల్‌దేనట.. ఆనకట్ట పనులను అడ్డుకున్న నేపాలీ అధికారులు

24-06-202024-06-2020 06:34:48 IST
Updated On 24-06-2020 10:41:25 ISTUpdated On 24-06-20202020-06-24T01:04:48.769Z24-06-2020 2020-06-24T01:04:44.695Z - 2020-06-24T05:11:25.409Z - 24-06-2020

బీహార్ కూడా నేపాల్‌దేనట.. ఆనకట్ట పనులను అడ్డుకున్న నేపాలీ అధికారులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌త్‌లోని కీల‌క ప్రాంతాల‌ను త‌న భూభాగంలోకి క‌లుపుతూ నేపాల్ ప్ర‌భుత్వం రూపొందించిన పొలిటిక‌ల్‌ మ్యాప్‌కు ఆమోదం ల‌భించిన‌ విష‌యం తెలిసిందే. ఇందులో ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లిపులేఖ్‌, కాలాపానీ, లింపియ‌ధురా ప్రాంతాలున్నాయి. అయితే ఈ దుశ్చ‌ర్య‌ను భార‌త్ మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తూ వ‌చ్చింది. నేపాల్‌ కృత్రిమంగా భూభాగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. 

అయిన‌ప్ప‌టికీ నేపాల్ త‌న వక్రబుద్ధి పోనిచ్చుకోలేదు. సరిగ్గా నాలుగు రోజులు కూడా ముగియక ముందే తాజాగా బిహార్‌లోని కొంత ప్రాంతాన్ని నేపాల్ భూభాగంగా ప్రకటిస్తూ నేపాల్ ప్రభుత్వం మ‌రో దుస్సాహసానికి ఒడిగ‌ట్టింది. బిహార్ జ‌ల వ‌న‌రుల శాఖ చేప‌డుతున్న అభివృద్ధి ప‌నుల‌కు అడ్డుప‌డింది. 

బిహార్‌లోని తూర్పు చంపార‌న్‌ జిల్లా లాలా బేకీ న‌దిపై ఆన‌క‌ట్ట ప‌నులు చేప‌ట్ట‌డానికి వెళ్లిన భార‌తీయుల‌ను నేపాల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతం నేపాల్ భూభాగానికి చెందిన‌దంటూ వారిని అక్క‌డి నుంచి పంపించివేశారు. 

కాగా ఆ ఆన‌క‌ట్ట కొద్ది సంవ‌త్స‌రాల క్రిత‌మే నిర్మిత‌మైంద‌ని, కేవ‌లం మ‌ర‌మ్మ‌త్తులు వేయ‌డానికి వెళ్లితే అడ్డుకున్నార‌ని బీహార్ అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పైగా ఆ ప్రాంతం నేపాల్‌కు చెందిన‌ది అని తెలియ‌జేయ‌డంపైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. 

భారత్ భూభాగాలను తన దేశ భూభాగాలుగా ప్రకటిస్తూ, దేశ రాజకీయ, భౌగోళిక మ్యాప్‌ని తిరగరాస్తూ నేపాల్ పార్లమెంటు దిగువ సభ బిల్లు ఆమోదించడంపై భారత్ జూన్ 13నే తన తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేసింది. ఇలా కృత్రిమమైన సరిహద్దులును గీస్తూ అవి తమవేనని ప్రకటించుకోవడం చెల్లబోదంటూ నేపాల్ పార్లమెంట్ నిర్ణయాన్ని భారత్ తోసిపుచ్చింది.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle