newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

బామ్మకోసం ప్రియురాలిని వదులుకున్నా.. రతన్ టాటా

14-02-202014-02-2020 09:21:03 IST
Updated On 14-02-2020 13:44:59 ISTUpdated On 14-02-20202020-02-14T03:51:03.440Z14-02-2020 2020-02-14T03:51:01.495Z - 2020-02-14T08:14:59.087Z - 14-02-2020

బామ్మకోసం ప్రియురాలిని వదులుకున్నా.. రతన్ టాటా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయన టాటా గ్రూప్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు చైర్మన్. అంతకుమించి గొప్ప మానవతావాది. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం.. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు అలవాటు. భారతదేశ సంపన్న బిలియనీర్లలో ఒకరుగా ఉన్నప్పటికీ అతి నిరాడంబర జీవితం సాగిస్తున్న ఆదర్శవంతుడు.  ఆయన గుర్తింపు ఒకరోజులో వచ్చిన అదృష్టం కాదు. ఎనిమిదిపదుల జీవితంలోనూ ఘోటక బ్రహ్మచారిగా గడుపుతున్న ఈ పెద్దాయనకు కూడా ఒక ప్రేమ కథ ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇన్నాళ్లుగా ఆ రహస్యం ఆయన తలపుల్లోనే భద్రంగా ఉండిపోయింది. 

ప్రేమికుల దినోత్సవానికి ఒక రోజు ముందు రతన్ టాటా వెల్లడించిన విషయాలు సంచలనం గొలుపుతున్నాయి. పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన రతన్ టాటాను ఆయన బామ్మ చేరదీసి మనవడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే... తల్లిదండ్రుల విడాకుల వ్యవహారం కారణంగా ఆయన కుంగిపోకుండా బాల్యంలో గుండెనిబ్బరంతో పెరిగేలా చేశారట. తనకోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి.. తనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చిన బామ్మ కోసం తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని రతన్ చెబుతున్నారు.. చివరిరోజుల్లో బామ్మకు తోడుగా ఉండేందుకు ఇండియాకు రావడం వల్ల ప్రేమించిన అమ్మాయికి దూరం కావటమే కాకుండా బ్రహ్మచారిగా కూడా మిగిలిపోయానని రతన్ టాటా చెప్పారు.

నా సోదరుడు, నేను కాస్త పెరిగిపెద్దవాళ్లం అవుతున్న కొద్దీ.. మా అమ్మానాన్నల విడాకుల వ్యవహారం వల్ల తోటి విద్యార్థుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అప్పట్లో విడిపోవడం అంటే ఇప్పటిలా తేలికైన విషయం కాదు. అందుకే స్కూళ్లో మమ్మల్ని ర్యాగింగ్‌ చేసేవాళ్లు. అయితే అలాంటి సమయాల్లో మా బామ్మ  మాకు ఎంతో అండగా నిలిచింది. అలా కొన్నాళ్లు గడిచింది. కానీ ఎప్పుడైతే మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. అయితే అప్పుడు కూడా బామ్మ తోడుగా నిలిచింది. సంయమనంతో ఉండటం నేర్పించింది. నేటికీ నేను అది కొనసాగిస్తున్నాను అని రతన్ టాటా తెలిపారు.

మనిషి గౌరవంతో ఎలా బతకాలో బామ్మే మాకు నేర్పించింది. ఆ విషయాలన్నీ మా మెదళ్లలో ముద్రపడిపోయాయి. తను ఎల్లప్పుడూ మా కోసమే జీవించింది. బామ్మ చెప్పినట్లుగా మృదువుగా మాట్లాడుతూనే.. నాకు కావాల్సిన వాటిని సాధించుకునేవాడిని. దీనంతంటికీ తనిచ్చిన ధైర్యమే కారణం. కాలేజీ అయిపోయిన తర్వాత.. లాస్‌ ఏంజెల్స్‌లోని ఓ నిర్మాణ సంస్థలో జాబ్‌ సంపాదించాను. రెండేళ్లపాటు అక్కడే పనిచేశాను. అక్కడ ఉన్నది కొంతకాలమే గానీ.. అక్కడి వాతావరణం ఎంతో అందమైనది. నా సొంత కారు, నేను ఇష్టంగా చేసే జాబ్‌. 

Image result for Ratan Tata was in love, wanted to get married but then 1962 India-China war happened

నేను ప్రేమలో పడింది కూడా అక్కడే. ఓ అమ్మాయిని ప్రేమించాను... దాదాపుగా మా పెళ్లి అయిపోయినట్లే అనే భావన. కానీ అప్పుడే నేను ఇండియాకు రావాల్సి వచ్చింది. అప్పటికే ఏడేళ్లుగా బామ్మ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తనను చూడటానికి.. తనతో ఉండటానికి ఇక్కడికి వచ్చేశాను. నాతో పాటు ఆ అమ్మాయి కూడా వస్తుందనుకున్నా. అయితే 1962లో ఇండో- చైనా యుద్ధం జరుగుతున్న సమయం అది. అప్పుడు తను ఇక్కడికి రావడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అలా ఆ బంధం బీటలు వారింది అని 82 ఏళ్ల రతన్‌ టాటా తన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. 

Image result for Ratan Tata was in love, wanted to get married but then 1962 India-China war happened

కష్టానికి, సుఖానికి మధ్య వారను బామ్మ పెంపకం ద్వారా గమనించి జీవితాన్ని నిర్దేశించుకున్న రతన్ టాటా తన ప్రేమ బీటలు వారిపోవడానికి ఇండో-చైనా యుద్ధమే కారణం అని కూడా ఆరోపించలేదు. ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురిని యుద్ధకాలంలో భారత్‌కు పంపడానికి ఇష్టపడకపోవడం వల్లే తమ ప్రేమ బంధం చెదిరిపోయందని రతన్ టాటా చెప్పారు.

ప్రేమ విఫలమైతే, అనివార్య కారణాల వల్ల ప్రేమ సఫలం కాకపోతే జీవితం అంతమైనట్లేననీ, ప్రతీకారం తీర్చుకోవలసిందేననీ ఊగిపోతున్న నేటి యువతరం ప్రేమికుల దినం సందర్భంగా రతన్ టాటా భగ్నప్రేమను, ఆతర్వాత ఆయన ప్రదర్శించిన గుండెనిబ్బరాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

జాతీయవాదం, ‘భారత్‌మాతాకీ జై’ నినాదం దుర్వినియోగం: మన్మోహన్

జాతీయవాదం, ‘భారత్‌మాతాకీ జై’ నినాదం దుర్వినియోగం: మన్మోహన్

   7 hours ago


మోదీ-ట్రంప్‌లది ఫాసిస్టు కూటమి: గుజరాత్ విద్యావేత్తల నిరసన లేఖ

మోదీ-ట్రంప్‌లది ఫాసిస్టు కూటమి: గుజరాత్ విద్యావేత్తల నిరసన లేఖ

   11 hours ago


వాహనాల రిపేరులో గో మెకానిక్ విప్లవం

వాహనాల రిపేరులో గో మెకానిక్ విప్లవం

   16 hours ago


బాహుబలిగా సందడి చేసిన ట్రంప్.. వైరల్ వీడియో

బాహుబలిగా సందడి చేసిన ట్రంప్.. వైరల్ వీడియో

   17 hours ago


సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

   17 hours ago


భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

   22-02-2020


విమానయాన రంగం రెక్కలు విరుస్తున్న కోవిడ్19

విమానయాన రంగం రెక్కలు విరుస్తున్న కోవిడ్19

   22-02-2020


అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

   22-02-2020


పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

   22-02-2020


స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

   22-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle