newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

బాబు దీక్ష యమా కాస్ట్లీ గురూ... !

11-02-201911-02-2019 12:34:38 IST
Updated On 11-02-2019 18:54:57 ISTUpdated On 11-02-20192019-02-11T07:04:38.244Z11-02-2019 2019-02-11T07:04:35.740Z - 2019-02-11T13:24:57.413Z - 11-02-2019

బాబు దీక్ష యమా కాస్ట్లీ గురూ... !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్ష మామూలుగా లేదు. ఈ ధర్మపోరాట దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోసం ఎక్కడా రాజీపడడం లేదు ప్రభుత్వం. రానుపోను విమాన టికెట్లు, ఖరీదైన హోటళ్లలో విడిది, మంచి భోజనం ఏర్పాటుచేశారు అధికారులు. అసలు దేశరాజధానిని చూడని నేతలు, టీడీపీ కార్యకర్తలు కూడా దీక్ష పుణ్యమాని హాయిగా విమానం ఎక్కేశారు. ఇక ప్రత్యేక రైళ్ళ సంగతి సరేసరి.  ప్రత్యేక రైళ్ల కోసం రూ. 1.12 కోట్లు పైనే చెల్లించారు. ఎన్జీవో నేతలైతే డిమాండ్ చేసి మరీ విమాన టికెట్లు కొనుగోలుచేసేలా అధికారులపై వత్తిడి చేశారు. చేసేదేం లేక పోయేది జనం సొమ్మే కదా అని అధికారులు వారి కోరికలు తీర్చేశారు. 

ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి 29 మందికి, ఏపీ జేఏసీ అమరావతి నుంచి 20 మందికి, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ నుంచి ఐదుగురికి, ఏపీ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ నుంచి 18 మందికి, లోక్‌సత్తా, ఆప్‌ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలతో కలిపి మొత్తం 155 మందికి విమాన టిక్కెట్లు కొన్నారు. ఏపీ భవన్ సమీపంలో బ్యానర్లు, హోర్డింగుల కోసం కోటిరూపాయల వరకూ ఖర్చు చేశారు. 

ఢిల్లీకి వచ్చిన వారి కోసం ఖరీదైన హోటళ్లలో ఏకంగా 3,500 మందికి వసతి ఏర్పాట్లు చేశారు. ఈ ధర్మపోరాట దీక్షకు అవుతున్న ఖర్చు రూ.10 కోట్ల పైమాటే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు విలాసవంతమైన హోటళ్లలో వసతి కల్పిస్తోంది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్‌ రాయల్‌ ప్లాజాలో 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్‌ చేశారు. మంత్రులు, వీఐపీలు రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున వారి కోసం వీటిని కేటాయించారు. వారికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దీక్ష స్థలానికి చేర్చడానికి 32 లగ్జరీ బస్సులను ఏర్పాటు చేశారు. వీటి ఖర్చు ఏపి ప్రభుత్వ నిధులే. 

ధర్మపోరాట దీక్షకు హాజరైన 26 మంది మంత్రులు, 127 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలు, 15 మంది కార్పోరేషన్ల ఛైర్మన్లు, 2వేలమంది మద్దతుదారులు హాజరు. వీరికి అయిన ఖర్చులు 26 మంత్రులు హోటల్ రాయల్ ప్లాజా 6216 ఒక్కో రూమ్ అద్దె. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఒక రూం. మొత్తం ఖర్చు రూ. 2,42,424. 127 మంది ఎమ్మెల్యేలు బస చేసింది హోటల్ సూర్య రూం అద్దె రూ. 8960 చొప్పున ఇద్దరికి ఒక రూం మొత్తం రూ. 20,16,960 వైఎంసీఏలో 41 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఛైర్మన్లకు మొత్తం ఖర్చు రూం ఒకటికి రూ. 2800 చొప్పున 28 రూంలు..ఒక్కో రూంలో ఇద్దరికి అకామడేషన్. మొత్తం ఖర్చు రూ. 2,35,200..ఇలా అనేక హోటళ్ళలో వసతి ఖర్చులు 60 లక్షల పైమాటే. 

వీటికి తోడు ప్రత్యేక రైళ్ల ద్వారా వచ్చే వారికి పహార్‌గంజ్‌ ప్రాంతంలో 'ఆన్‌ యువర్‌ ఓన్‌' (OYO) కింద వివిధ హోటళ్లలో 850 గదులను బుక్‌ చేశారు. కేరళ, మహారాష్ట్ర భవన్‌లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్‌ హోటళ్ళు అన్నీ ఏపీ నేతలు, జనంతో నిండిపోయాయి. పనిలో పనిగా వాటి రేట్లు కూడా పెంచేశారు నిర్వాహకులు. బాబుగారు ఏపీలో చేసిన దీక్షలకే కోట్లు ఖర్చుచేశారు. 

ఢిల్లీ దీక్ష ముగిస్తే గానీ ఖర్చెంతయిందో లెక్కతేలదు. ఏ విషయంలోనూ నేతలు, అధికారులు రాజీపడడం లేదు. రాజు తలచకుంటే కాసులకు కొదవా అన్నట్టు.. బాబుగారు ఆర్డరేస్తే అధికారులు తు.చ తప్పకుండా అమలుచేస్తున్నారు. ఈ ఖర్చుపై విపక్షనేతలు మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని నీళ్ళలా ఖర్చుపెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఎవరేమన్నా చంద్రబాబు ఏం చేయాలంటే అదే చేస్తారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle