newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

బాటిల్ నీరు ఇక అత్యవసర వస్తువే.. కేరళ బోల్డ్ నిర్ణయం

14-02-202014-02-2020 11:59:39 IST
Updated On 15-02-2020 15:16:39 ISTUpdated On 15-02-20202020-02-14T06:29:39.781Z14-02-2020 2020-02-14T06:29:36.901Z - 2020-02-15T09:46:39.043Z - 15-02-2020

బాటిల్ నీరు ఇక అత్యవసర వస్తువే.. కేరళ బోల్డ్ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాగే నీళ్లపై వేలకోట్ల వ్యాపారం నడుస్తున్న భారతదేశంలో బాటిల్ రూపంలో అమ్ముతున్న లీటర్ నీటిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి కేరళ ప్రభుత్వం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా దేశంలో సాగుతున్న నీటివ్యాపారంపై బాటిల్ నీటి ధరలపై ఒక రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ విధించటం ఇదే మొదటిసారి. రిటైల్ ధరలో లీటర్ బాటిల్ నీరు ఇప్పుడు కనీసం రూ. 20 రూపాయలకు అమ్ముతుండగా కేరళ ప్రభుత్వం దానిపై సీలింగ్ విధించి రూ.13 రూపాయలకే బాటిల్ నీరును అమ్మాలని ఆదేశించింది.

తాగునీటి ధరను నియంత్రించడమే కాకుండా అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్టు వేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో అమ్ముతున్న ప్రతి బాటిల్ వాటర్ బ్రాండు కూడా తప్పనిసరిగా బీఐఎస్ నీటి నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించింది.

2018 సంవత్సరంలోనే కేరళ ప్రభుత్వానికి, ఆ రాష్ట్రంలోని తాగునీటి తయారీ సంస్థలకు మధ్య నీటి ధరల తగ్గింపుపై చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో లీటర్ బాటిల్ నీటి ధరను రూత. 12లకు తగ్గించాలని అంగీకారం కుదిరింది. కానీ ఆ నిర్ణయం ఏ కారణం వల్లో అమలు కాలేదు. కొన్ని తాగునీటి వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కారణం. 

అయితే రెండేళ్ల తర్వాత 2020 సంవత్సరంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్ర ఆహార శాఖ ప్రతిపాదనపై సంతకం చేశార లీటర్ బాటిల్ నీటిని రూ. 13లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా కేరళ ఆహార శాఖమంత్రి పి. తిలోత్తమన్ బాటిల్ నీటిని అత్యవసర సరకులు జాబితాలో చేర్చుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం బాటిల్ నీటి ధరను స్థిరీకరించిన తర్వాత కేరళలోని ఏ బాటిల్ నీటి తయారుదారు కూడా ఆ ధరకు మించి తమ ఉత్పత్తిని అమ్మకూడదని మంత్రి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఏకరూపంలో అమలవుతుందని స్పష్టం చేశారు.

వాస్తవంగా బాటిల్ నీటి తయారీకి 6 రూపాయలు ఖర్చు కాగా మరో రెండు రూపాయలు పంపిణీకోసం వెచ్చిస్తారని మంత్రి చెప్పారు. కానీ బాటిల్ నీటి వ్యాపారులు బాటిల్ నీటిని లీటరుకు రూ. 15లు విధించాలని చెప్పారు కానీ తమ ప్రభుత్వం లీటర్ బ్యాటిల్ నీటిని రూ. 13లకే అమ్మాలని నిర్దేశించినట్లు తెలిపారు.

కేరళలో బాటిల్ నీటి తయారీరంగంలో 300 బ్రాండ్లు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాన్ని కేరళ బాటిల్డ్ వాటర్ తయారుదారుల అసోసియేషన్ సమర్థించింది. కానీ నూరు మంది సభ్యులున్న తమ అసోసియేషన్‌లో ప్రభుత్వ నిర్ణయంపై ఎవరికైనా అసమ్మతి ఉంటే వారు కోర్టును సంప్రదించవచ్చని తెలిపింది.

ప్రయివేటు బాటిల్ వాటర్ సంస్థలతోపాటు కేరళ ప్రభుత్వం కూడా తాగునీటిని లీటరుకు పది రూపాయలకు అమ్ముతూండటం గమనార్హం. కేరళ వాటర్ అథారిటీ అనుబంధ సంస్థ ద్వారా ప్రభుత్వం చౌకధరకే బాటిల్ నీటిని అమ్ముతోంది.

నీటి వ్యాపారంపై కేరళ తీసుకున్న సాహసోపేత నిర్ణయం దేశవ్యాప్తంగా అమలు చేయవలసి ఉంది. ప్రధానంగా ముప్పావు లీటర్ బాటిల్ని 50రూపాయలకు అమ్ముతున్న ఐమ్యాక్స్ థియేటర్లను కట్టడి చేయడం తక్షణం ప్రారంభించాలి.

 

జాతీయవాదం, ‘భారత్‌మాతాకీ జై’ నినాదం దుర్వినియోగం: మన్మోహన్

జాతీయవాదం, ‘భారత్‌మాతాకీ జై’ నినాదం దుర్వినియోగం: మన్మోహన్

   7 hours ago


మోదీ-ట్రంప్‌లది ఫాసిస్టు కూటమి: గుజరాత్ విద్యావేత్తల నిరసన లేఖ

మోదీ-ట్రంప్‌లది ఫాసిస్టు కూటమి: గుజరాత్ విద్యావేత్తల నిరసన లేఖ

   12 hours ago


వాహనాల రిపేరులో గో మెకానిక్ విప్లవం

వాహనాల రిపేరులో గో మెకానిక్ విప్లవం

   17 hours ago


బాహుబలిగా సందడి చేసిన ట్రంప్.. వైరల్ వీడియో

బాహుబలిగా సందడి చేసిన ట్రంప్.. వైరల్ వీడియో

   17 hours ago


సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

   17 hours ago


భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

   22-02-2020


విమానయాన రంగం రెక్కలు విరుస్తున్న కోవిడ్19

విమానయాన రంగం రెక్కలు విరుస్తున్న కోవిడ్19

   22-02-2020


అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

   22-02-2020


పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

   22-02-2020


స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

   22-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle