newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బాంద్రా ఘటనలో పేదప్రజల ఉద్వేగాలతో ఆడుకోవద్దు: సీఎం ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్

15-04-202015-04-2020 08:27:15 IST
Updated On 15-04-2020 08:49:31 ISTUpdated On 15-04-20202020-04-15T02:57:15.961Z15-04-2020 2020-04-15T02:57:11.569Z - 2020-04-15T03:19:31.052Z - 15-04-2020

బాంద్రా ఘటనలో పేదప్రజల ఉద్వేగాలతో ఆడుకోవద్దు: సీఎం ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్‌ని ధిక్కరించి మరీ వందలాది మంది వలస కార్మికులు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు తరలివెళ్లడంలో తమ తప్పేమీ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవం ఠాక్రే స్పష్టం చేశారు. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగిసిందని భావించిన ముంబైలో చిక్కుకున్న 1500 మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బాంద్రా రైల్వే స్టేషన్‌కు తరలివెళ్లిన ఘటన తీవ్రమైన రాజకీయ రభసకు దారితీసింది. లాక్ డౌన్ సడలింపు చేస్తారని, దీంతో దేశవ్యాప్తంగా రైళ్ల రాకపోకలు జరుగుతాయని పుకారు వ్యాపించడంతో మహారాష్ట్రలో చిక్కుకుపోయి పడరాని పాట్లు పడుతున్న ఉత్తరాది వలస కార్మికులు మూకుమ్మడిగా ముంబైలోని బాంద్రా స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల లాఠీ చార్జీని కూడా ధిక్కరించి వెంటనే తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ వలసకార్మికులు బాంద్రా రైల్వే స్టేషన్ ముందు బైఠాయించారు. 

లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించి తమను ఇబ్బంది పెట్టవద్దని.. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు చేసిన సూచనను కూడా వారు పట్టించుకోలేదు. దీంతో.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ విమర్శలు రేగాయి. అధికార శివసేన కేంద్రాన్ని తప్పుబడితే.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఫడ్నవీస్ శివసేన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అయితే మరాఠా రాజకీయ కుమ్ములాటలను పట్టించుకోకుండా తమకు వలస శిబిరాలు, ఆహారం అందించడం సమస్యకు పరిష్కారం కాదని.. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాది వలసకార్మికులు తిరిగబడటంతో రాజకీయ దుమారం చెలరేగింది. 

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగించిన ప్రకటన నేపథ్యంలో ముంబైలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని రాజకీయ రగడకు దారితీసింది. వివాదం కాస్తా ముదురుతున్నట్లు కనిపించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం జరిగిన ఘటనపై అధికారికంగా వివరణ ఇచ్చారు. 

మీ ఇష్టం లేకుండా ఎవరూ మీరు ఇక్కడ ఉండాలని భావించడం లేదని, ఇది లాక్‌డౌనే తప్ప లాకప్ కాదని వలస కార్మికులను ఉద్దేశించి ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. ఇది మన దేశమని, మహారాష్ట్రలో మీరు పూర్తి సురక్షితంగా ఉంటారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వలస కార్మికులకు ఆయన సూచించారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసే రోజున తాను మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వం కూడా మీరు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తుందని ఉద్ధవ్ తెలిపారు.

రైళ్ల రాకపోకల గురించి ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి వలస కార్మికులు స్టేషన్ వద్దకు గుంపులుగా వచ్చారని, పేదప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. లాక్ డౌన్ నేపత్యంలో ప్రజల్లో పుకార్లు లేవనెత్తుతున్న వారి పని పడతామంటూ ముఖ్యమంత్రి హెచ్చరించారు. అదే సమయంలో ప్రభుత్వం తరపున మేమంతా మీకు అండగా ఉన్నా. మీ భద్రతకు లోటేమీ లేదు. నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను. మీ క్షేమం పట్ల మేం శ్రద్ధ తీసుకుంటాం. 

ఇది కరోనా నేపథ్యంలో అనివార్యంగా వచ్చిన లాక్ డౌన్ మాత్రమే కానీ లాకప్ ఏమాత్రం కాదు అని సీఎం ఉద్దవ్ అనునయించారు. వలస ప్రజలు తిండి లేక దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఇబ్బందిపడుతున్నారంటూ వస్తున్న వార్తలను ఠాక్రే ఖండించారు.

బాంద్రా ఘటనను రాజకీయం చేయొద్దని ఉద్ధవ్ కోరారు. నేటితో లాక్‌డౌన్‌ను ఎత్తేశారని, రైళ్ల రాకపోకలు మొదలయ్యాయన్న పుకారును నమ్మడం వల్లే వలస కార్మికులంతా రైల్వే స్టేషన్ బాట పట్టారని సీఎం చెప్పుకొచ్చారు. అయితే బాంద్రా రైల్వే స్టేషన్‌లో వందల మంది వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది. 

వలసకార్మికులకు బాసటగా అఖిలేష్.. పేదలకు రైళ్లు పంపలేరా అంటూ ధ్వజం

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో వలస కూలీలు గుమిగూడడంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ధనికులను విదేశాల నుండి విమానాల ద్వారా తీసుకురాగలిగినప్పుడు, పేదలను రైళ్ల ద్వారా ఎందుకు తరలించకూడదని ఆయన ప్రశ్నించారు. ముంబైలో చికుక్కున్న వేలాది మంది ఇంటికి తిరిగి వెళ్లాలని చేస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం వెంటనే నోడల్ అధికారిని నియమించాలని, మహారాష్ట్రతోపాటు  ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ప్రజలను వారి ప్రాంతాలకు తరలించాలని మాజీ సీఎం అన్నారు. కాగా ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు భారీగా వలస కూలీలు వచ్చేలా చేసిన కేసులో వినయ్ దుబే అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వినయ్ దుబే 'ఇంటికి వెళ్దాం' అనే ప్రచారాన్ని నడుపుతున్నాడు. ఈ కేసులో పోలీసులు వెయ్యి మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

 

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   42 minutes ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   an hour ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   11 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   18 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   19 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   17 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle