newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

బయటకు వస్తే క్వారంటైన్ చేయండి... లాక్‌డౌన్‌‌పై కేంద్రం కీలక ఆదేశాలు..

30-03-202030-03-2020 13:52:32 IST
2020-03-30T08:22:32.726Z30-03-2020 2020-03-30T08:22:30.244Z - - 12-08-2020

బయటకు వస్తే క్వారంటైన్ చేయండి... లాక్‌డౌన్‌‌పై కేంద్రం కీలక ఆదేశాలు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనాపై పోరుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఈమేరకు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని కేంద్రం స్పష్టం చేసింది.

ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధికారులతో వీడియో కాన్పరెన్సు‌ నిర్వహించిన కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ, కేంద్ర హోంశాఖ కార్యదర్సి అజయ్ భల్లాలు లాక్ డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ముఖ్యంగా నగరాల్లో ఏ ఒక్కరినీ బయటకు రానివ్వద్దని, హైవేలపైకి రాకపోకలను పూర్తిగా నిషేధించాలని కోరారు. 

రాష్ట్రాల మధ్య సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని.. కేవలం సరకు రవాణాకు మాత్రమే అనుమతించాలని కేంద్రం చెప్పింది. ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణాలు చేసినవారిని 14 రోజులపాటు తప్పకుండా క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపంది. 

కాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న వాహనదారుల కట్టడికి తెలంగాణ పోలీసులు కొత్త ప్రయత్నం చేశారు. కాలనీ నుంచి బయటకు వచ్చే వాహనాలను రిజిస్టర్‌ చేసి.. వాటి వివరాలను నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అప్‌డేట్‌ చేస్తున్నారు. మూడు కిలోమీటర్లు దాటి ఎవరైనా వాహనాలపై ప్రయాణిస్తే.. చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నిఘా కార్యక్రమం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని కట్టడి చేసేందుకే పోలీసు శాఖ ఈ చర్యలు చేపట్టింది. 

వలస కూలీలను వారు పనిచేస్తున్న చోటే ఉంచి, ఆహారం తదితర అవసరాలన్నింటినీ అక్కడికే సరఫరా చేయాలని, పేదలకు నిత్యావసరాలను లోటు లేకుండా కల్పించాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కేంద్ర అత్యున్నతాధికారులు అనునిత్యం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో టచ్‌లో ఉంటూ అవసరమైన ఆదేశాలను, సలహాలను రోజువారీ ప్రాతిపదికన అందిస్తూనే ఉన్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 987కి చేరింది. 25 మరణాలు సంభవించాయి. ఇక తెలంగాణలో 67 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 కేసులు నమోదయ్యాయి.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle