newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

బకాయిలపై సుప్రీం ఆగ్రహం.. టెలికాం సంస్థలకు చిక్కులు

19-03-202019-03-2020 08:38:30 IST
2020-03-19T03:08:30.405Z19-03-2020 2020-03-19T03:08:17.931Z - - 11-08-2020

బకాయిలపై సుప్రీం ఆగ్రహం.. టెలికాం సంస్థలకు చిక్కులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా టెలికాం సంస్థలు కష్టమర్ల నుంచి ముక్కుపిండి మరీ బిల్లులు వసూలు చేస్తుంటాయి. కానీ లైసెన్స్, ఇతర చెల్లింపులకు సంబంధించి ఉదాశీన వైఖరిని అనుసరిస్తుంటాయి. తాజాగా టెలికం సంస్థల వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్‌ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి  ఎలాంటి పునఃసమీక్ష ఉండదని తేల్చేసింది. ఇందుకు అనుమతినిచ్చిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

 ఏజీఆర్‌ను లెక్కించేందుకు మరోసారి ప్రయత్నించవద్దని, ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై  కూడా కోర్టు మొట్టికాయలు వేయడం విశేషం. గత కొంతకాలంగా ఏజీఆర్ బకాయిల చెల్లింపు విషయంలో కంపెనీలు జాప్యం చేస్తూనే వున్నాయి. అసలు వీటిని ఎవరు సమీక్షించమన్నారంటూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. 

గత ఏడాది అక్టోబర్ 24 న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు నిర్ణయించిన  ఏజీఆర్‌ బకాయిలను స్వీయ అంచనా వేయడం లేదా తిరిగి అంచనా వేయడం ఉండదని స్పష్టం చేసింది.  బకాయిలు వసూలుపై ప్రభుత్వ తీరు సరిగా లేదని మండిపడింది. బకాయిల విషయంలో మరో అవకాశం లేదని, మళ్ళీ తిరిగి సమీక్షిస్తే కోర్టు గతంలో తప్పుచేసినట్లు అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోమంటోంది సుప్రీంకోర్టు.

బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడంపై సుప్రీంకోర్టు సంస్థలపైనా, ప్రభుత్వంపై ఆగ్రహించింది. దీంతో కొన్ని సంస్థలు బకాయిల్లో కొంత మొత్తాన్ని చెల్లించాయి. కానీ మరోసారి కోర్టు సమీక్షిస్తే కొంత మినహాయింపు లభిస్తుందని భావించాయి. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది.

ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులు 20 ఏళ్ల పాటు వాయిదాల రూపంలో చెల్లించేందుకు సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ విధివిధానాలను రూపొందించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏజీఆర్‌​ చార్జీల చెల్లింపు వల్ల సంస్థ పనితీరు దెబ్బతింటే ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పేర్కొంది. లక్షలాది మంది వినియోగదారుల పైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతూ  తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ఎయిర్ టెల్ సంస్థ ఫిబ్రవరి 17న రూ. 10 వేల కోట్లను చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన ఎయిర్ టెల్ రూ. 8,004 కోట్లను డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాంకు చెల్లించింది. దీంతో భారతీ ఎయిర్ టెల్ చెల్లించిన మొత్తం రూ18,004 కోట్లకు చేరింది. కానీ ఎయిర్ టెల్ రూ. 35,586 కోట్లను చెల్లించాల్సి వుంది. తాజా చెల్లింపులతో సగం బకాయిలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఎయిర్ టెల్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తుందో చూడాలి.  కేంద్రానికి వోడాఫోన్ ఐడియా రూ. 3,500 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ రూ. 2,197 కోట్లు చెల్లించాయి. ఏజీఆర్ బకాయిలు పూర్తిగా చెల్లించాలని పట్టుబడితే మాత్రం వోడాఫోన్-ఐడియా సంస్థ మనుగడ కష్టం కానుంది. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle