newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

బంకర్‌లో ట్రంప్... అమెరికాలో 40 నగరాలకు కర్ప్యూ విస్తరణ

02-06-202002-06-2020 10:35:03 IST
Updated On 02-06-2020 11:24:47 ISTUpdated On 02-06-20202020-06-02T05:05:03.782Z02-06-2020 2020-06-02T05:05:02.193Z - 2020-06-02T05:54:47.920Z - 02-06-2020

బంకర్‌లో ట్రంప్... అమెరికాలో 40 నగరాలకు కర్ప్యూ విస్తరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాత్యహంకారంపై అమెరికాలో తిరుగుబాటు

జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణోదంతంపై రగులుతున్న జనం

దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ఆందోళనలు

140 నగరాల్లో హింసాత్మక ఘటనలు

40 నగరాల్లో కర్ఫ్యూ.. వేలాదిమంది అరెస్ట్.. 

వైట్‌హౌస్‌ వద్ద భారీ ఆందోళన.. కాల్పులు.. ఐదుగురు మృతి

రహస్య బంకర్‌లోకి ట్రంప్, కుటుంబం

వణికిపోయిన ట్రంప్ కుటుంబం

పలు దేశాల్లో ఆందోళనకారులకు మద్దతు

దేశంలో అశాంతికి మీడియా సంస్థలే కారణం. ట్రంప్ ట్వీట్

1965 నుంచి ఓటు బ్యాంకుగానే నల్లజాతి ప్రజలు

నల్లజాతి హక్కుల ఉద్యమనేత మార్టిన్ లూథర్ కింగ్ హత్య తర్వాత గత 50 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రజాందోళలనలతో అమెరికా అట్టుడికి పోతోంది. నల్ల జాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని వాషింగ్టన్‌ డీసీలో నిరసనకారుల ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. అమెరికాలో శ్వేత జాత్యహంకార దాడులపై మొదలైన నిరసన సెగలు శ్వేతసౌధాన్ని తాకాయి. ఏకంగా శ్వేతసౌధంపైకే దండెత్తారు. ఆగ్రహోదగ్రులైన ఆందోళనకారులు రాళ్లు, సీసాలు విసిరారు. శ్వేతసౌధం సమీపంలోని భవనాలను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. 

George Floyd death case: Nearly 40 cities under curfew as violent ...

దీంతో శ్వేతసౌధం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుండడంతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాగ్రత్తపడ్డారు. శ్వేతసౌధంలోని సురక్షిత స్థావరమైన నేలమాళిగ (బంకర్‌)లోకి వెళ్లిపోయారు. ఉగ్రదాడి వంటి అత్యవసర సమయాల్లోనే ఈ బంకర్‌ను వినియోగిస్తారు. ట్రంప్‌ గంటకుపైగా బంకర్‌లోనే ఉన్నట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ప్రథమ మహిళ మెలానియా, కుమారుడు బ్యారన్‌ కూడా బంకర్‌లోనే ఉన్నారు. అప్రమత్తమైన శ్వేతసౌధం భద్రతా సిబ్బంది ఉత్తరం వైపు లైట్లు ఆర్పేశారు. అధ్యక్షుడు మరణిస్తేనే ఇలా చేస్తారు.

వైట్‌హౌస్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో ఆందోళనకారులు భవనం కిటికీలను బద్దలు కొట్టడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలోనే అధ్యక్షుడు ట్రంప్‌ అతడి భార్య మెలానియా, కుమారుడు బారన్‌లను కొద్ది సమయం పాటు రహస్య బంకర్‌లో ఉంచినట్లు సీఎన్‌ఎన్‌ ఒక కథనం ప్రసారం చేసింది. వైట్‌హౌస్‌ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువుతోపాటు స్టన్‌ గ్రెనైడ్‌లు వాడారని వార్తలు వచ్చాయి. పలువురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఆదివారం మొత్తం బహిరంగ ప్రకటనలు చేయకపోగా, ఎవరికీ కనిపించలేదు. దేశంలో అశాంతికి మీడియా సంస్థలే కారణమని ట్రంప్‌ ట్వీట్లు చేశారు.

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోంది. దేశాద్యంతం హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్‌ చేశారు. నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆఖరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం తాత్కాలికంగా ఓ రహస్య స్థావరంలో తలదాచుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమైపోతుంది. మినసోటాలో మొదలైన ఆందోళన పర్వం దావానలంలా లాస్‌ ఏంజిలెస్, షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీలకూ విస్తరించింది. ఈ స్థాయి ఆందోళనలు 1968లో మార్టిన్‌ లూథర్‌కింగ్‌ హత్య తరువాత మాత్రమే జరిగాయని న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ కథనంలో పేర్కొంది.

ట్రంప్‌ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ సంఖ్యలో వచ్చిన ఆందోళనకారులను చూసి ట్రంప్‌ కుటుంబం భయపడిపోయినట్లు రిపబ్లికన్‌ పార్టీనేత చెప్పారు. ట్రంప్‌ శుక్రవారం కూడా బంకర్‌లోకి వెళ్లినట్లు సమాచారం. నకిలీ వార్తలతో దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మీడియాపై ట్రంప్‌ నిప్పులు చెరిగారు. ఇక రాజధాని వాషింగ్టన్‌ డీసీ లో నిరసనకారులు చెలరేగిపోయారు. వీధుల్లో అనేక వాహనాలకు నిప్పుపెట్టారు. శ్వేతసౌధం వద్ద రోడ్డు సూచికలు, బ్యారికేడ్లను తగులబెట్టారు. కొందరు అమెరికా జాతీయ జెండాను దగ్ధం చేశారు. వేలాది మంది ఆందోళనకారులు ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అమెరికా వ్యాప్తంగా 140నగరాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చాలా చోట్ల పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఉధృత స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. 40కి పైగా నగరాల్లో కర్ఫ్యూ విధించారు. వాషింగ్టన్‌ డీసీతో పాటు 20రాష్ట్రాల్లో వేల మందికి పైగా నేషనల్‌ గార్డ్స్‌ సైనికులను మోహరించారు. ఫిలడెల్ఫియా, కాలిఫోర్నియాలో పట్టపగలే దుకాణాలను లూటీ చేశారు. పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టారు. కాలిఫోర్నియాలోని ప్రభుత్వ కార్యాలయాలను మూసేశారు. ఇప్పటి వరకు 4400 మందిని అరెస్టు చేశారు. అల్లర్లలో ఐదుగురు మరణించారు.

ప్రపంచవ్యాప్తంగా మద్దతు 

అమెరికా నిరసనకారులకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఫ్లాయిడ్‌ హత్యను ఖండిస్తూ న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో సోమవారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూజిలాండ్‌లో పోలీసుల హింస, అరాచకాలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. లండన్‌లోనూ జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ‘న్యాయం జరిగే వరకు శాంతి ఉండదు’ అంటూ నినాదాలు చేశారు. బ్రెజిల్‌, కెనడాల్లోనూ ‘ఐ కాంట్‌ బ్రీత్‌’ అంటూ నినదించారు. అమెరికా ఆందోళనలను ఇరాన్‌ ప్రభుత్వ టీవీ చానెల్‌లో పదేపదే ప్రసారం చేశారు. హాంకాంగ్‌ విషయంలో మాట్లాడేముందు అమెరికా రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలని చైనా అధికార పార్టీ పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొంది. ఉత్తరకొరియా అధికార రోడంగ్‌ సిమున్‌ పత్రికలోనూ అమెరికా నిరసనల వార్తలను ప్రముఖంగా ప్రచురించారు. 

కాగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని యాపిల్‌ స్టోర్‌ను దుండగులు దోచుకున్నారు. అద్దాలు పగులగొట్టి, అక్కడున్నదంతా ఎత్తుకుపోయారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే స్టోర్‌లో ఉన్న వస్తువులను దుండగులు మాయం చేశారు. ఆఖరి నిమిషంలో ఒకే ఒక్క పోలీసు అక్కడికి చేరుకున్నారు. గ్యాడ్జెట్‌ల నుంచి డిస్‌ప్లే స్టాండ్లదాకా అన్నిటినీ ఊడ్చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో న్యాయపోరాటానికిగానూ హాలీవుడ్‌ జంట రియాన్‌ రెనాల్డ్స్‌, బ్లేక్‌ లైవ్లీ రూ.1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. జాతి వివక్షకు సంబంధించి న్యాయపోరాటం చేసే ప్రముఖ సంస్థ ఎన్‌ఏఏసీపీకి ఈ మొత్తాన్ని అందజేశారు. జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఎలా బతకాలన్న విషయమై తమ పిల్లలకు అవగాహన కల్పిస్తామన్నారు. కాగా.. మిన్నెసోట ఘటనపై ‘లూటీ మొదలైతే.. కాల్పులు కూడా మొదలవుతాయి’ అంటూ ట్రంప్‌ చేసిన వివాదాస్పద పోస్ట్‌పై చర్య తీసుకోకపోవడం సరికాదని పలువురు ఫేస్‌బుక్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు.

వివక్షకు బలవుతున్న నల్లజాతి ప్రజలు

అగ్రరాజ్యం.. ప్రపంచానికే పెద్దన్న.. ఆర్థిక పరిపుష్ఠితో ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం.. అన్ని రంగాల్లో ముందంజ.. అయినా.. అమెరికాలో నల్లజాతీయులు నేటికీ వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు. బానిసత్వ శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగులు పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ వారిని వివక్ష వీడటం లేదు. అడపాదడపా శ్వేత జాత్యహంకార దాడులను ఎదుర్కొంటున్నారు.  అమెరికాలో నల్లజాతీయుల సంఖ్య 4.2 కోట్లుగా ఉంది. అంటే.. ఆ దేశ జనాభాలో వీరి వాటా 14 శాతం. వీరిలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారు. గతంలో అమెరికాలో వ్యవసాయానికి నల్లజాతీయుల అవసరం ఎంతగానో ఉండేది. యాంత్రీకరణ తర్వాత వారు ఉపాధిని కోల్పోయారు. మరింత పేదరికంలోకి జారుకున్నారు. ఈ కారణాలే శ్వేత-నల్లజాతీయుల మధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి.

ప్రొఫెషనల్‌ స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న ఆఫ్రో-అమెరికన్ల సంఖ్య చాలా తక్కువ. వారి వేతనాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఒక శ్వేతజాతీయుడి సగటు వేతనం సాలీనా 36,785 డాలర్లు కాగా..  నల్లజాతీయుల వేతనం 23,738 డాలర్లకు మించడం లేదు. నిరుద్యోగిత రేటు నల్లజాతీయుల్లో 5.5శాతంగా ఉండగా.. ఇది శ్వేతజాతీయులతో పోలిస్తే.. 2.3శాతం ఎక్కువ.  నిజానికి అమెరికాలో నల్లజాతీయులకు 1964లో పౌరహక్కులు వచ్చాయి. 1965 నుంచి వాటికి ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచి వీరు ఓటు బ్యాంకుగా మారారు. ఇక అమెరికాలో కొవిడ్‌-19తో చనిపోయినవారిలో నల్లజాతీయులే అధికంగా ఉన్నారు. అమెరికాలో నమోదైన మరణాల్లో 50.3 శాతం నల్లజాతీయులవి కాగా.. 20.7 శాతం తెల్లజాతీయులున్నారు. వారికి కరోనా టెస్టులు నిర్వహించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 1804లో ఉత్తర అమెరికాలో బానిసత్వం రద్దయింది. వందళ్ల ఏళ్లపాటు నల్లజాతీయులతో చాకిరీ చేయించుకున్నందుకు ‘రీపార్షన్స్‌ ఫర్‌ స్లేవరీ’ పేరుతో పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ ఇప్పటికీ నెరవేరలేదు. 1870లో 15వ సవరణ ద్వారా ఆఫ్రో-అమెరికన్‌ పురుషులకు ఓటు హక్కు వచ్చింది.  

ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో  

జార్జ్‌ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో జరగనున్నాయి. మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. నగర మేయన్‌ సిల్వర్‌స్టర్‌ టర్నల్‌ శనివారమే అంత్యక్రియల ప్రణాళికను ప్రకటించగా.. ఎప్పుడుఅన్నది స్పష్టం చేయలేదు. నార్త్‌ కారొలీనాలో జన్మించిన ఫ్లాయిడ్‌ హ్యూస్టన్‌లో పెరిగి పెద్దయ్యారు. 2014 నుంచి ఫ్లాయిడ్‌ మినియాపోలీస్‌లో ఉంటున్నా అతడి ఇద్దరు కూతుళ్లు హ్యూస్టన్‌లో ఉంటున్నారు. ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన డెరెక్‌ ఛావిన్‌ను ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించగా శుక్రవారం హత్య ఆరోపణలపై అతడిని అరెస్ట్‌ చేశారు. ఫ్లాయిడ్‌ మృతదేహానికి తాము ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తామని ఆ గౌరవం తమకు కలిగించాలని హ్యూస్టన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ముఖ్యాధికారి ఆర్ట్‌ అసీవిడో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో బహిరంగంగా అభ్యర్థించారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఫ్లాయిడ్‌ మృతదేహాన్ని మినియాపోలీస్‌ నుంచి హ్యూస్టన్‌కు తరలించనున్నారు.  

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle