newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ఫారిన్ సంబంధాలు.. నరకం చూపిస్తున్నశాడిస్ట్ మొగుళ్ళు

04-03-202004-03-2020 09:59:03 IST
2020-03-04T04:29:03.965Z04-03-2020 2020-03-04T04:28:53.302Z - - 12-08-2020

ఫారిన్ సంబంధాలు.. నరకం చూపిస్తున్నశాడిస్ట్ మొగుళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా విదేశీ సంస్కృతి పెరిగిపోతోంది. దేశీయంగా ఉద్యోగాలు చేస్తున్నవారికంటే ఎన్నారైలకు వివాహాలు చేయడానికి అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఇండియాలో కంటే అమెరికా సంబంధమైతే తమ గారాలపట్టి మరింత సుఖంగా ఉంటుదని భావిస్తుంటారు. తమ అల్లుడు డాలర్లలో సంపాదిస్తాడు.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోదం చేస్తాడని చెప్పుకోవడంలో ఆ స్టాటసే వేరు అనుకుంటుంటారు. అయితే... అమెరికా అల్లుళ్లలోనూ శాడిస్టులున్నారని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. అల్లుళ్ల వేధింపులపై తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 574 కేసులు ఎన్నారై భర్తలు, వారి బంధువులపైన కేసులు నమోదయ్యాయి. 

వీటిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన 17 మహిళా పోలీస్ స్టేషన్ల లోనే 417 కేసులు అయ్యాయి. జూలై 17 న ఏర్పాటైన ప్రత్యేక ఎన్నారై సెల్ కు 73 పిటిషన్ లు వచ్చాయి. వివాహ, గృహ హింస, ఇతర వేధింపులపై ఎన్నారై నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఈ పిటిషన్లలో 70 వాటిపై కేసులను రిజిస్టర్ చేశారు.ఈ 70 కేసుల్లో 29 కేసులు దార్యాప్తు దశలో ఉండగా, 41 కేసులు పెండింగ్ ట్రయల్స్ లో వున్నాయి. 46 మందికి లుక్ అవుట్ నోటీసులు, మరో 32 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ లు. ఐదుగురికి ఎల్.ఒ.సిలు అమలయ్యాయి కూడా... మరో ఆరుగురి నుంచి ఏకంగా పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక... ఈ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ సిటీ మహిళా సీసీఎస్ పోలీసు స్టేషన్ లో 137 కేసులుతో మొదటి స్థానంలో ఉండగా... 78 కేసులతో సరూర్ నగర్ మహిళా పీ.ఎస్ ద్వితీయ స్థానంలో ఉంది. ఇక... సౌత్ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో 65 , బేగంపేట్ మహిళా స్టేషన్ లో 34 ,భువనగిరి మహిళా స్టేషన్ లో ఒకటి, గచ్చిబౌలి మహిళా స్టేషన్ లో 8 , వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని సుబేదారి, వరంగల్ అర్బన్ మహిళా స్టేషన్ లలో 42 , ఖమ్మం లో ఏడు, మహబూబ్ నగర్ లో ఆరు, ఆదిలాబాద్ లో 11 , కరీంనగర్ మహిళా స్టేషన్ లో 21, నల్గొండ స్టేషన్ లో ఏడు కోసులు నమోదయ్యాయి.ప్రవాస భారతీయుల కేసులకు సంబంధించి ప్రధానంగా ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి దర్యాప్తు అధికారులకు సహాయపడేలా నెట్ వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగల్ ఆక్టివిస్ట్ ఇతర స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలను అందిస్తున్నాయి. 

ముఖ్యంగా వరకట్న వేధింపులు, ఎన్నారై వివాహాల మోసాలు,బంధువుల వేధింపుల విషయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు సహాయ పడేలా ఈ సెల్ తోడ్పడుతుంది. ఈ కేసులలో దర్యాప్తు చేసే విధానం పై ఎస్.హెచ్.ఓ లకు శిక్షణ అందిస్తోంది. ఈఎన్నారై సెల్ ఎప్పటి కప్పుడు లుక్అవుట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ కేసులు, ఛార్జ్ షీట్ ల దాఖలు, దర్యాప్తు వేగవంతం పై నిరంతరం విచారణాధికారులతో పర్యవేక్షిస్తోంది. వివిధ దేశాల ఎంబసీలు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమీషన్, ఎన్నారై వివాహాల పై పనిచేసే స్వచ్చంద సంస్థల కాంటాక్ట్ నెంబర్లను బాధితులకు అంద చేస్తుంది.

ఎన్నారై సెల్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఐదు కేసులకు సంబంధించి లుక్ అవుట్ నోటీసులు అమలు చేయడం తో పాటు ఆరు కేసులకు సంబంధించి పాస్ పోర్ట్ లను ఇంపౌండ్ చేసింది. ఈ సెల్ ప్రధానంగా జాతీయ మహిళా కమీషన్, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి, కాన్సిలేట్ జనరల్, ఎంబసీలు, తెలంగాణా ప్రభుత్వ ఎన్ఆర్ఐ సెల్, జీఏడీ ల సహాయం, సమన్వయంతో కేసుల సత్వర విచారణను చేపట్టేందుకే సాంకేతిక సహకారాన్ని విచారణాధికారులకు అందచేస్తోంది.

ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సంఖ్యలో కేసులు నమోదయితే... పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.కాబట్టి... అమెరికా, ఫారెన్ సంబంధాలు అనగానే ఏం చూసుకోకుండా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం సరి కాదని నిపుణులు సూచిస్తున్నారు. అబ్బాయి, వారి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే పెళ్లి సంబంధం విషయంలో ముందడుగు వేయాలని హెచ్చరిస్తున్నారు.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle