newssting
BITING NEWS :
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో అసంతృప్తులు. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు నేనంటే నేనే అంటూ వాదులాడుకునే స్థాయికి చేరిన వివాదం. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు స్పష్టం చేసిన పార్టీ * కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం బిల్లు ఆమోదాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌. వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, కేం‍ద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సుప్రీం పిటిషన్ లో పేర్కొన్న ఎంపీ. కేం‍ద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మూడు చట్టాలు రాజ్యాంగ విరుద్దమని, చెల్లదని రద్దుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన ఎంపీ * అసోం మాజీ మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ (84) అనారోగ్యంతో ఆస్ట్రేలియాలో కన్నుమూత. అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాల పాటు పనిచేసిన సైదా అన్వర తైమూర్. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సైదా అన్వర అసోం మొట్టమొదటి మహిళా సీఎం. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉన్న తన కుమారుడి వద్ద ఉంటున్న సైదా అన్వర తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూత * బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి(61)కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. హిమాలయాల పర్యటనలో ఉండగా స్వల్ప జ్వరం రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ ఫలితాలు. రిషికేశ్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లుగా ట్వీట్. తన డ్రైవర్‌కు పాజిటివ్‌ వచ్చిందని, అతడి ద్వారా వ్యాపించి ఉంటుందని ట్వీట్ లో వెల్లడించిన ఉమా భారతి * రైలు ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ కసరత్తులు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ల ప్రయాణికులపై చార్జీల మోత. ప్రయాణికుడు కొనుగోలు చేసే టికెట్ ధరను బట్టి పెరుగుదలకు అవకాశం. గరిష్ఠంగా రూ.35 నుండి కనిష్ఠంగా పది రూపాయల వరకు వసూలు చేయనున్న వినియోగ రుసుము* దేశవ్యాప్తంగా మొత్తం 7 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రద్దీగా ఉండే స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి వినియోగ రుసుమును వసూలు చేస్తామని రైల్వే శాఖ ఇది వరకే ప్రకటించింది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్లు దాదాపు 1000 వరకు ఉన్నాయి. రైల్వే శాఖ ప్రతిపాదనకు కేంద్రం కనుక ఆమోద ముద్ర వేస్తే ఈ స్టేషన్లలోని ప్రయాణికుల జేబులకు చిల్లులు పడడం ఖాయం * నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన. బావామాన్ పురా ప్రాంతంలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం. ఈ ఘటనలో అక్కడికక్కడే మరణించిన ముగ్గురు వ్యక్తులు. కరోనా బారిన పడ్డ ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ * ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి అధికంగా సాగుతున్న వరద నీటి ప్రవాహం. జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్న అధికారులు. జలాశయం ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,06,819 క్యూసెక్కులు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. 883.90 అడుగులకు చేరిన ప్రస్తుతం నీటి మట్టం * తమ భూములకు సరైన నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు కృష్ణంరాజు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ దాఖలు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు * దేశంలో సోమవారం నుండి ప్రారంభమైన వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యం. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో రాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరిక * మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్న అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరిన ప్రస్తుత నీటి మట్టం. అలాగే ఇన్ ఫ్లో 4,505 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,978 క్యూసెక్కులుగా నమోదు * కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో అరెస్టయిన ముగ్గురు సహనిందితులకు ఏసీపీ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు. చేసింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రీనాథ్‌యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌కు బెయిల్‌

ప్లాస్మా థెరపీ వేస్ట్.. అనుమతులు నిలిపివేసిన అమెరికా.. ఇక టీకానే విరుగుడు

23-08-202023-08-2020 08:36:26 IST
2020-08-23T03:06:26.934Z23-08-2020 2020-08-23T03:06:24.306Z - - 30-09-2020

ప్లాస్మా థెరపీ వేస్ట్.. అనుమతులు నిలిపివేసిన అమెరికా.. ఇక టీకానే విరుగుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లూ కరోనా వైరస్ బారిన పడి కోలుకుని బయటకు వచ్చిన రోగుల శరీరాల్లోని ప్లాస్మా కొత్తగా కరోనా సోకిన రోగుల పాలిట సంజీవనిగా ప్రచారం కావడంతో వ్రపంచం మొత్తం ప్లాస్మపై పడింది. దేశదేశాల్లో ప్లాస్మా దానం ద్వారా కరోనా రోగులను కాపాడాలని కోరుతూ ఆరోగ్య సంరక్షణా సంస్థలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ప్లాస్మా మార్పిడి వేగవంతమైంది. కానీ అమెరికా ఆహార, ఔషధ పాలనా యంత్రాంగం ప్లాస్మా థెరపీపై పెదవి విరవడంతో ఏకంగా ప్లాస్మా థెరపీ అనుమతులనే ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. 

ప్లాస్మా చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మహమ్మారి కరోనా బారిన పడిన వారి పాలిట వరంలా పరిగణిస్తున్న ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిలిపివేసింది. ఈ విషయం గురించి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ క్లినికల్‌ డైరెక్టర్‌ హెచ్‌, క్లిఫార్డ్‌ లేన్‌ మాట్లాడుతూ.. ప్లాస్మా థెరపీపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత సమీప భవిష్యత్తులో అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఈ చికిత్స ద్వారా ఎంత మంది కోలుకున్నారు, ఏ మేరకు సత్ఫలితాలు లభించాయన్న వివరాలపై స్పష్టత లేనందున అనుమతులు నిలిపివేసినట్లు భావిస్తున్నామన్నారు.

కరోనాకు విరుగుడు టీకా అందుబాటులోని రాని నేపథ్యంలో భారత్‌ వంటి దేశాల్లో ప్లాస్మా థెరపీ ద్వారా మహమ్మారిని జయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో పలు సూచనలు చేసిన భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌).. ఏప్రిల్‌ నుంచి ప్లాస్మా చికిత్స క్లినికల్‌ ట్రయల్స్‌ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూలై 2న ఢిల్లీలోని లివర్‌ అండ్‌ బిలియరి సైన్సెస్‌లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసి.. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి కోవిడ్‌ పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఆ తర్వాత లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ హాస్పిటల్‌లో కూడా మరో బ్యాంకును ఏర్పాటు చేశారు. దీని గురించి అవగాహన పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా మరిన్ని ప్లాస్మా బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. 

అయితే ఈ చికిత్స ద్వారా ఇంత వరకు ఏ మేర సానుకూల ఫలితాలు వచ్చాయన్న అంశంపై కొంతమంది నిపుణులు అనునామాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ ఎడిటర్‌ అమర్‌ జేసాని మట్లాడుతూ.. ‘‘దీని ద్వారా కరోనా రోగులు కోలుకుంటున్నారడానికి సరైన ఆధారాలు లేవు. ఏప్రిల్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైనా, ఆగష్టు వరకు కూడా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, గణాంకాలు బయటకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అని పేర్కొన్నారు. 

మరికొందరు నిపుణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఎఫ్‌డీఏ తాత్కాలికంగా అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిపై ప్రభుత్వాలు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు వరుసగా విఫలం అవుతుండటంతో  ఇక వ్యాక్సిన్ కోసం ఎదురు చూడటమొక్కటే చివరి పరిష్కార మార్గంగా భావిస్తున్నారు.

 

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   5 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   12 hours ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   15 hours ago


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   15 hours ago


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   17 hours ago


కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

కోవిడ్ నేర్పిన గుణపాఠం అదే.. ప్రధాని మోదీ

   17 hours ago


రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

రైలు ప్రయాణమా.. కాస్త ఖర్చవుతుంది..!

   18 hours ago


సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణులు.. యుద్ధానికి భారత్ సన్నద్ధం

   19 hours ago


అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

అన్ లాక్ 5.0...కరోనా వ్యాప్తికి ఆహ్వానం కానుందా?

   28-09-2020


ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

ఢిల్లీలో ట్రాక్టర్ తగలబెట్టిన రైతులు.. ప్రభుత్వం పట్టించుకునేనా

   28-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle