newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ రెడీ.. రష్యాలో పూర్తయిన క్లినికల్ ట్రయల్స్

13-07-202013-07-2020 08:33:03 IST
Updated On 13-07-2020 09:04:22 ISTUpdated On 13-07-20202020-07-13T03:03:03.653Z13-07-2020 2020-07-13T03:02:58.961Z - 2020-07-13T03:34:22.064Z - 13-07-2020

ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ రెడీ.. రష్యాలో పూర్తయిన క్లినికల్ ట్రయల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ని నిరోధించే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో రష్యా ఒక అడుగు ముందడుగు వేసింది. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ప్రపంచానికి రష్యా ఒక శుభవార్తను అందించింది. సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వాడిమ్‌ తారాసోవ్‌ తెలిపారు. 

రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన టీకాతో జూన్ 18 న ట్రయల్స్ ప్రారంభించారు. అందులో భాగంగానే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల బృందం బుధవారం డిశ్చార్జ్‌ కానుంది. ఇక రెండో బృందం జూలై 20వ తేదీన డిశ్చార్జ్‌ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ రెండు బృందాలకు కూడా సెచెనోవ్‌ యూనివర్శిటీ విజయవంతంగా పరీక్షలను పూర్తి చేసినట్లు తారాసోవ్‌ చెప్పారు. 

కరోనా మహమ్మారి తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం ఒక విద్యా సంస్థగా మాత్రమే కాకుండా, ఔషధాల వంటి ముఖ్యమైన సంక్లిష్టమైన ఉత్పత్తుల సృష్టిలో పాల్గొనగలిగే శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనా కేంద్రంగా కూడా పనిచేసిందని తారాసోవ్‌ తెలిపారు. 'మేము ఈ టీకాతో పనిచేశాము. ట్రయల్స్‌లో ఈ దశ యొక్క లక్ష్యం మానవ ఆరోగ్యానికి వ్యాక్సిన్ యొక్క భద్రతను పరీక్షించడం, ఇది విజయవంతంగా జరిగింది' అని సెచెనోవ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసిటాలజీ, ట్రాపికల్, వెక్టర్-బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ అన్నారు. 

వ్యాక్సిన్‌ భద్రత పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఇక వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సెచెనోవ్‌ యూనివర్సిటీ దృష్టి సారించనుంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. కాగా గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లండన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ అత్యంత పురోగతిలో ఉందని వెల్లడించింది. ఆ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. ఇప్పుడు రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం అందరిలోనూ ఆశలు నింపుతోంది.

వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 12 మిలియన్ల మంది మహమ్మారి బారిన పడగా.. సుమారు 70 లక్షల మంది కోలుకున్నారు. ఐదున్నర లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ఇక కోవిడ్‌-19 విజృంభించిన నాటి నుంచి వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి. వాటిలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకోగా.. అమెరికాకు చెందిన బయోటెక్‌ సంస్థలు గిలియాడ్‌ సైన్సెన్‌, మాడెర్నా కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ వేగవంతం చేశాయి.

ఈ నేపథ్యంలో యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమెడిసివిర్‌ ఉపయోగించడం వల్ల కోవిడ్‌ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అమెరికా ఔషధ దిగ్గజం గిలియాడ్ సైన్సెస్ మరోసారి స్పష్టం చేసింది. తీవ్రమైన లక్షణాలతో బాధ పడుతున్న కరోనా పేషెంట్లకు ఈ డ్రగ్‌ ఇవ్వడం ద్వారా మరణం అంచున ఉన్న వారిని కాపాడుకోవచ్చని శుక్రవారం తెలిపింది. 

అదే విధంగా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సే కంపెనీ తాము రూపొందించిన వ్యాక్సిన్‌కు ఈ ఏడాది చివర్లోగా ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తాము తయారు చేసిన బీఎన్‌టీ162బీ1 అనే వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రాథమిక దశలో అద్భుత ఫలితాలనిచ్చిందని, దాదాపు 30 వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించింది. 

ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైన తరుణంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో సిద్ధమయ్యే అవకాశం ఉందని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు గురువారం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలియజేశారు. కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ అధ్యక్షతన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై  ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశమైంది. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై చర్చించారు.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle