newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

11-07-202011-07-2020 09:37:16 IST
Updated On 11-07-2020 17:18:47 ISTUpdated On 11-07-20202020-07-11T04:07:16.658Z11-07-2020 2020-07-11T04:07:14.252Z - 2020-07-11T11:48:47.964Z - 11-07-2020

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్‌ అంబానీ (63) తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. నికర విలువ పరంగా, బిజినెస్‌​ టైకూన్‌, ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అధిగమించారు. 

బ్లూంబర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అంబానీ విలువ ఇప్పుడు 70.1 బిలియన్ డాలర్లకు చేరగా, వారెన్ బఫెట్ సంపద విలువ 67.9 బిలియన్ డాలర్లు మాత్రమే. దీంతో అంబానీ ప్రపంచంలో ఏడవ ధనవంతుడుగా నిలిచారు. 

రిలయన్స్‌ టెలికాం విభాగం జియోలో వరుస పెట్టుబడులతో అంబానీ సంపద గణనీయంగా పుంజుకుంది. దీంతో ప్రపంచంలోని టాప్10 ధనవంతుల క్లబ్‌లో ఉన్న ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచారు.  

బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ సీఈఓ వారెన్ బఫెట్‌ (82) 37 బిలియన్ డాలర్లకు పైగా బెర్క్‌షైర్ హాత్వే షేర్లను ఇటీవల విరాళంగా ఇచ్చిన తరువాత సంపద క్షీణించింది. ఒరాకిల్ ఆఫ్ ఒమాహా గా పేరొందిన బఫెట్‌ ఈ వారంలో 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు డొనేట్‌ చేశారు. దీంతో ఆయన సంపద నికర విలువ క్షీణించింది.  

కాగా హురున్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, అంబానీ ఇటీవల ప్రపంచంలో ఎనిమిదవ ధనవంతుడిగా అంబానీ అవతరించారు. సంపన్న భారతీయుడిగా అంబానీ నంబర్ వన్ ర్యాంకులో దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలో మొదటి రెండు నెలల్లో తీవ్ర నష్టాలను నమోదు చేసినప్పటికీ, జియోలో వరుస భారీ పెట్టుబడుల నేపథ్యంలో రిలయన్స​ షేరు రికార్డు గరిష్టాన్ని తాకింది. 

దీంతో కరోనా సంక్షోభంలో కూడా గణనీయమైన వృద్దిని సాధించి, అప్పుల్లేని సంస్థగా రిలయన్స్‌ అవతరించింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12.70 లక్షల కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరింది.

పదిరోజుల్లోపే ముఖేష్ అంబానీ సంపద పైకి ఎగబాకటంతో ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల విశిష్ట క్లబ్‌లో చోటు సాధించిన ఏకైక ఆసియన్ టైకూన్‌గా చరిత్రకెక్కారు.

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   6 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   14 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   15 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle