newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

ప్రపంచంలోనే అతి ప్రమాదకర వ్యక్తి ట్రంప్‌... మేరీ ట్రంప్ తాజా పుస్తకం

30-06-202030-06-2020 07:23:41 IST
Updated On 30-06-2020 08:54:08 ISTUpdated On 30-06-20202020-06-30T01:53:41.366Z30-06-2020 2020-06-30T01:53:38.264Z - 2020-06-30T03:24:08.098Z - 30-06-2020

ప్రపంచంలోనే అతి ప్రమాదకర వ్యక్తి ట్రంప్‌... మేరీ ట్రంప్ తాజా పుస్తకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఆయ‌న‌ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ ప్ర‌పంచానికి తెలియని కొత్త విష‌యాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ట్రంప్ గురించి ఆమె ‘టూ మ‌చ్ అండ్ నెవ‌ర్ ఎన‌ఫ్‌ హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వ‌రల్డ్ మోస్ట్ డేంజ‌ర‌స్ మెన్’ పుస్త‌కాన్ని రాశారు. ఇందులో ట్రంప్‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

పారనాయిడ్‌ స్కిజోఫ్రేనియా (భ్రాంతిలో బ‌తికేయ‌డం)తో బాధ‌ప‌డుతున్న రోగుల‌ను ఆరు నెల‌ల‌పాటు లోతైన‌ అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత మేరీ ట్రంప్‌ ఈ పుస్త‌క‌ ర‌చ‌నకు పూనుకోవ‌డం విశేషం. పీడ‌క‌ల‌లు, విధ్వంస‌‌క‌ర సంబంధాలు, కుటుంబం విచ్ఛిన్న‌మ‌వ‌డంపైనా పుస్త‌కంలో ప్ర‌స్తావించారు. మ‌ర‌ణించిన త‌న తండ్రి జూనియ‌ర్ ఫ్రెడ్‌, డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య ఉన్న హానిక‌ర సంబంధ‌ బాంధ‌వ్యాలను ఆమె పుస్త‌కంలో రాసుకొచ్చారు.

కాగా ఫ్రెడ్ మ‌ర‌ణానికి సోదరుడు ట్రంప్‌ తీరు కూడా కార‌ణ‌మ‌ని ఫ్రెడ్‌ స్నేహితులు గ‌తంలో పేర్కొన్నారు. ఈ విష‌యంపై ట్రంప్ కూడా ఒకానొక సంద‌ర్భంలో త‌న సోద‌రుడితో ప్ర‌వ‌ర్తించిన తీరుపై చింతిస్తున్నాన‌ని విచారం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా ఈ పుస్త‌కం వ‌చ్చే నెల మార్కెట్లో విడుద‌ల కానుంది. అయితే దీన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు ట్రంప్ కుటుంబం య‌త్నిస్తోంద‌ని మేరీ త‌ర‌పు న్యాయ‌వాది థియోడ‌ర్ బౌట్ర‌స్ పేర్కొన్నారు. 

మ‌రోవైపు మేరీ త‌న గురించి పుస్తకం రాస్తుంద‌ని ట్రంప్ ఊహించ‌లేక‌పోయారు. గ‌తంలో చేసుకున్న ఒప్పందం వ‌ల్ల ఇది అసాధ్య‌మ‌ని ఆయ‌న భావించారు. ఇక‌ ఈ పుస‌క్తం విడుద‌ల‌ను అడ్డుకోవాల‌ని ట్రంప్ సోద‌రుడు రాబ‌ర్ట్ కోర్టును ఆశ్ర‌యించారు. కేవ‌లం త‌న సొంత లాభం కోస‌మే ఇన్నేళ్ల త‌ర్వాత ఆమె పుస్త‌క ర‌చ‌న‌కు పూనుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇది కుటుంబ సంబంధాల‌ను దెబ్బ‌తీసే కుట్ర‌తో పాటు ఆమె త‌న తండ్రికి అన్యాయం చేసిన‌ట్లేన‌ని విమ‌ర్శించారు. అయితే ఆయన అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కోర్టు పిటిష‌న్‌ను కొట్టివేసింది. ఈ విష‌యంపై న్యూయార్క్ స్టేట్ సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని రాబ‌ర్ట్ త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు. 

కాగా మేరీ ట్రంప్ 2001లో సైకాల‌జీలో మాస్ట‌ర్ డిగ్రీ, 2003లో క్లినిక‌ల్ సైకాల‌జీలో మాస్ట‌ర్స్‌, 2010లో క్లినిక‌ల్ సైకాల‌జీలో డాక్టోర‌ల్ డిగ్రీ అభ్య‌సించారు. గ‌తంలో ట్రంప్ ఎన్నికైన రోజున ‘ఇది నా జీవితంలోనే చెత్త రోజు’ అని  12 సార్లు రాసిన ట్వీట్‌ను మేరీ షేర్ చేశారు. ఈ మ‌ధ్యే ఆ ట్వీట్‌ను తొల‌గించారు. 

 

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

   6 hours ago


తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

   7 hours ago


నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

   8 hours ago


భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

   8 hours ago


నేపాల్‌లో  విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

నేపాల్‌లో విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

   21 hours ago


 కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

   10-07-2020


పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

   10-07-2020


విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

   10-07-2020


భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

   10-07-2020


కరోనా వల్లే మన ఫార్మా సత్తా ప్రపంచానికి తెలిసింది.. మోదీ ప్రశంస

కరోనా వల్లే మన ఫార్మా సత్తా ప్రపంచానికి తెలిసింది.. మోదీ ప్రశంస

   10-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle