newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ప్రధాని కంట తడిపెట్టించిన సామాన్య మహిళ. దేవుడనడంతో మోదీ భావోద్వేగం

08-03-202008-03-2020 09:25:16 IST
2020-03-08T03:55:16.609Z08-03-2020 2020-03-08T03:55:14.675Z - - 12-08-2020

ప్రధాని కంట తడిపెట్టించిన సామాన్య మహిళ. దేవుడనడంతో మోదీ భావోద్వేగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత ప్రధాని నరేంద్రమోదీ కళ్లు చెమ్మగిల్లిన వేళ లక్షలాది మంది నెటిజన్లు నిరుత్తరులయ్యారు. సామాన్య ప్రజల హితం కోసం ప్రధాని ప్రవేశపెట్టిన ఒక పథకం తన ప్రాణాలను నిలబెట్టిందనీ, తన జీవితానికి దేవుడు ఎవరైనా ఉన్నారంటే మోదీయేనని ఒక సగటు మహిళ ఆవేదనతో చెప్పిన మాటలు అంతటి మోదీనే  కదిలించివేశాయి. 

పక్షవాతంతో బాధపడుతున్న ఒక మహిళ ఆవేదనను విని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారు అయిన దీపా షా కథనం ఆయనను భావోద్వేగానికి గురి చేసింది. జన ఔషధి దినోత్సవం సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా డెహ్రాడూన్‌కు చెందిన దీపా షాతో మాట్లాడారు. దీపా షా తన దీనావస్థను వివరిస్తూ, విలపించారు. పక్షవాతానికి చికిత్స చేయించడం ఎంత కష్టమో ఆమె వివరించారు.

‘నాకు 2011లో పక్షవాతం వచ్చింది. నేను మాట్లాడలేకపోయేదాన్ని. నన్ను ఆసుపత్రిలో చేర్చారు. మందులు చాలా ఖరీదైనవి. నేను ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా మందులు తీసుకుంటున్నాను. అంతకుముందు నా మందుల కోసం రూ.5,000 ఖర్చయ్యేది. ఇప్పుడు ఈ పథకం ద్వారా రూ.1,500 ఖర్చవుతోంది. దాదాపు మూడు వేలు మిగులుతోంది. ఆ సొమ్ముతో నేను పళ్ళు, ఇతర వస్తువులు కొనుక్కుంటున్నాను అని దీపా షా తెలిపారు. 

‘‘మోదీజీ, నేను దేవుడిని చూడలేదు. కానీ నాకు మాత్రం మీరే దేవుడి అవతారం. నేను మీకు కృతజ్ఞురాలిని. ముఖ్యమంత్రి కూడా నాకు సహాయపడ్డారు. వైద్యులు ఆశలు వదిలేశారు, నేను బతకనని చెప్పారు. నేను బతకడం మాత్రమే కాకుండా జనరిక్ మందుల వల్ల ఖర్చులు కూడా తగ్గాయి. మోదీజీ, మీరు నాకు దేవుడివంటివారు. నేను మీకు చాలా చాలా కృతజ్ఞురాలిని’’ అని దీపా కళ్ళలో నీటి సుడులు తిరుగుతుండగా చెప్పారు. 

దీంతో ప్రధాని మోదీ కూడా అక్కడికక్కడే కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన గద్గద స్వరంతో ఆమె కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కొన్న తీరును ప్రశంసించారు. 

జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మార్చి 7న దేశ వ్యాప్తంగా జన ఔషధి దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 6,200 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటెయిల్ ఫార్మా చెయిన్‌గా గుర్తింపు పొందింది.

పక్షవాతంతో బాధపడుతున్న దీపా షా తనవంతు రాగానే లేచి నిలబడుతుండగా వారించిన ప్రధాని కూర్చునే మాట్లాడాలని ఆమెను కోరారు. జన ఔషది మందులు తక్కువ ధరలకే లభ్యమైన కారణంగానే తాను మందులు కొనుక్కుని వాడి ప్రాణం నిలబెట్టుకోగలిగానని దీపాషా చెప్పారు. 

ఆమె మాట్లాడుతుండగా ఆద్యంతం ఖిన్నుడై వింటూండిపోయిన మోదీ తర్వాత ఆమె తన మానసిక శక్తితోనే వ్యాధిని ఓడించగలిగిందని చెప్పారు. అమ్మా.. మీ మనోబలంతోటే వ్యాధిని జయించారు. మీ ధైర్యమే మీ దేవుడు. ఆ సాహసమే మిమ్మల్ని అతిపెద్ద సంక్షోభం నుంచి మీరు కోలుకునేలా చేసింది. మీ ఈ నమ్మకాన్ని చివరివరకు కొనసాగించాలి ఆని మోదీ ఆమెను ఊరడించారు.

జనరిక్ మెడిసన్ గురించి ఇప్పటికీ కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత తక్కువగా మందులు దొరుకుతున్నాయంటే వాటిలో ఏదో లోపముందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ జనరిక్ మందులతో ఎలాంటి ప్రమాదం లేదని, వాటిలో ఏ లోపమూ లేదని మన ముందున్న మహిళ తన జీవితనుభవాన్ని చాటిచెబుతోందని మోదీ అన్నారు.

మేకిన్ ఇండియా తీసుకొచ్చిన కారుచౌక ధరకలిగిన జెనటిక్ మందులను ప్రజలందరూ ఉపయోగించాలని మోదీ ఈ సందర్భంగా సూచించారు.

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   12 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle