newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ప్రధాని అఖిలపక్ష భేటీ... చైనా కట్టడే ఎజెండా

19-06-202019-06-2020 08:59:11 IST
Updated On 19-06-2020 10:45:51 ISTUpdated On 19-06-20202020-06-19T03:29:11.928Z19-06-2020 2020-06-19T03:29:01.996Z - 2020-06-19T05:15:51.621Z - 19-06-2020

ప్రధాని అఖిలపక్ష భేటీ... చైనా కట్టడే ఎజెండా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్-చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయలో చైనా సైనికులు మారణకాండకు పాల్పడిన సంగతి తెలిసిందే. 20మంది భారత సైనికులు అసువులు బాశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సా.5 గంటలకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న అఖిలపక్ష సమావేశంలో భారత్-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులను వివరించనున్నారు ప్రధాని మోదీ. అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్. ఈమేరకు హోం మంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ లు చేశారని తెలుస్తోంది.

చైనాను కట్టడి చేయడానికి ఏం చేయాలనేదానిపై చర్చించనున్నారు. చైనాతో ఒప్పందం వల్ల ఆయుధాలు ఉపయోగించకూడదు. చైనా దుష్టబుద్ధితో తుపాకులు వాడలేదు. ఇతర రకాల ఆయుధాలు, వెదురుబొంగులు, రాళ్ళ దాడి, ఇనుపరాడ్లు తెచ్చి చైనా సైనికులు దాడులకు దిగడం ఊహించలేదు. భారతదేశంతో పాటు చైనాకు కూడా భారీనష్టం జరిగింది. రక్షణ శాఖ ఈమేరకు అందరికీ వివరణ ఇచ్చింది. చైనా అరాచకాలను ఎలా అరికడతారోనని దేశప్రజలు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

చైనా ఆర్థిక మూలాలను కట్టడి చేయడం సాధ్యమేనా? ఇప్పటికే బాయ్‌కాట్ చైనా పేరుతో అక్కడి ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని కొందరు వ్యక్తిగతంగా చేస్తున్న పోస్టులు కాగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

2014 మేకిన్ ఇండియా స్లోగన్ గా మిగిలింది. ఆరేళ్ళలో భారతదేశంలో మానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంతగా ముందుకు సాగలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సంకల్పం లేదు. మేకిన్ ఇండియా ఆరేళ్ళలో ఆచరణలోకి వచ్చి వుంటే మనం చైనా ఉత్పత్తులను నిషేధించవచ్చు. కానీ మనం చైనాను కాదని మనగలిగే పరిస్థితి లేదు. 

దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయి. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వివిధ వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. చైనాతో ఉన్న సరిహద్దుపొడవునా బలగాలను పెంచే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రష్యా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసే పనిని వేగవంతం చేశారు. మరోవైపు దౌత్యమార్గాల ద్వారా చైనాను కట్టడి చేయటానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. చైనాను దీటుగా ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఆ దేశ ఉత్పత్తులను గణనీయంగా తగ్గించటానికి కసరత్తు మొదలైంది.

ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించాలని, విదేశాల నుంచి దిగుమతి అయిన వస్తువులు నాణ్యత విషయంలో బీఐఎస్‌ నిబంధనలకు కచ్చితంగా లోబడి ఉండాలి. ఇకపై బీఐఎస్‌ నిబంధనలను అమలుచేసి, చవకబారు ఉత్పత్తులను నిలిపివేయాలని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అంటున్నారు. భారత్‌లో చైనా ఆహారాన్ని విక్రయించే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయాలని, చైనా వస్తువులను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాందాస్‌ ఆఠవలే పిలుపునిచ్చారు. కాగా.. భారతదేశం ఇక మీదట చైనాపై ఆధారపడరాదని కేంద్ర మంత్రి గడ్కరీ అంటున్నారు. చైనాను కట్టడిచేసే విషయంలో వివిధ పార్టీల సూచనలను మోడీ ఆహ్వానించనున్నారు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle