newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రతాపం చూపుతున్న సైక్లోన్ ఎంఫాన్ . ఉప్పాడలో ఎగసిపడుతున్న అలలు

19-05-202019-05-2020 12:20:59 IST
Updated On 19-05-2020 14:10:12 ISTUpdated On 19-05-20202020-05-19T06:50:59.473Z19-05-2020 2020-05-19T06:50:50.825Z - 2020-05-19T08:40:12.913Z - 19-05-2020

ప్రతాపం చూపుతున్న సైక్లోన్ ఎంఫాన్ . ఉప్పాడలో ఎగసిపడుతున్న అలలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంఫాన్‌ తుపాను మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది బంగాళాఖాతంలో ఈశాన్యం వైపు పయనించి ఈ నెల 20న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాను ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తరఈశాన్యం వైపు పయనించి మరింత తీవ్రంగా మారనుంది.

దిఘా(ప.బెంగాల్‌), హటియా దీవి(బంగ్లాదేశ్‌)ల మధ్య పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. తీరప్రాంత జిల్లాల నుంచి పది లక్షల మందిని ఖాళీ చేయించిన ఒడిశా సర్కారు...కొనసాగుతోన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీ ఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది. ఒడిశాలోని భద్రక్, బాలాసోర్,మయూర్భంజ్, జైపూర్, కేంద్రపారా, కేంజర్ జిల్లాలపై తీవ్రతుపాను ప్రభావం ఉంది. .ఆయా జిల్లాల్లో 75 నుంచి 125 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. 

దీంతో ఒడిశా తీరం వెంబడి ఉన్న గజపతి, గంజాం, పూరి, జగత్‌సింగ్‌ పూర్, కేంద్రపార జిల్లాల్లో తీవ్రమైన గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఒడిశా తీరప్రాంత 12 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు వాతావరణ శాఖ పశ్చిమ బెంగాల్‌కు ‘ఆరెంజ్‌’హెచ్చరికలను జారీ చేసింది.

ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎంఫాన్ తుఫాను తీరాన్ని దాటే సమయంలో గాలి తీవ్రత 165 కి.మీ.లు ఉండొచ్చు. ఈ తుఫాను పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరి రక్షణకూ చర్యలు తీసుకుంటామనీ, ప్రభావిత రాష్ట్రాలకు సాధ్యమైనంత మేర కేంద్రం సాయం అందజేస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

భీకరంగా మారిన ఎంఫాన్ తుపాన్... ఏపీ, ఒడిశాలో హై అలర్ట్

ఉప్పాడపై సైక్లోన్ ప్రభావం 

https://www.photojoiner.net/image/lsvttXyH

ఎంఫాన్ సైక్లోన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా తీరప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. గంటకు 17 కి.మీ వేగంతో ఉత్తర ఈశాన్యదిశగా పయనిస్తుండడంతో  కోనసీమ తీరప్రాంతంలో సముద్రం అల్ల కల్లోలం వుంది. రాజోలు నియోజకవర్గంలోని తూర్పు పాలెం,కేసనపల్లి,అంతర్వేదిలో 15 మీటర్ల ముందుకు వచ్చింది సముద్రం. దీంతో సముద్రతీరంలోని నివాసాల్లోకి నీళ్ళు చేరాయి. అమలాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాలలో ముందస్తు భద్రతా  చర్యలు చేపట్టారు. కాకినాడ పోర్టులో  రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. 

ఇటు ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఉదయం నుంచి ఉప్పాడ సముద్రతీరం అల్ల కల్లోలంగా మారింది. రంగంపేట నుంచి ఎస్పీ జిఎల్ శివారు వరకు సముద్రం ఎగసిపడుతుంది. సముద్రపు అలలు వాహనదారులపై విరుచుకుపడుతున్నాయి.దీంతో కాకినాడ ఉప్పాడ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. బీచ్ రోడ్డు మీదకి రాళ్లు వచ్చిపడుతున్నాయి. నీటి మట్టం పెరగడం, వాతావరణంలో మార్పు రావడంతో  సముద్రం అలలు  మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం పక్కన ఉన్న బోట్లు,వలలు భద్రపరచుకునే పనిలో మత్స్యకారులు  నిమగ్నమయ్యారు..

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   20 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   21 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle