newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ప్రజల్ని ఒకేసారి చంపేయండి.. మండిపడ్డ సుప్రీం

26-11-201926-11-2019 09:34:00 IST
2019-11-26T04:04:00.598Z26-11-2019 2019-11-26T04:03:58.736Z - - 09-08-2020

 ప్రజల్ని ఒకేసారి చంపేయండి.. మండిపడ్డ సుప్రీం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశరాజధానిలో లక్షలాది ప్రజలు తీవ్రమైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతుండటంపై సుప్రీంకోర్టు మండిపడింది. గ్యాస్ చాంబర్లలో జనం చస్తూ బతుకుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.  ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కింది. తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, పొగలో నివసించలేక పోతున్నామని అక్కడి జనాలు గగ్గోలుపెడుతున్నారని.. భయాందోళనకు గురవుతున్న నగరవాసులను ఒకేసారి చంపేయండి అని చీవాట్లు పెట్టింది. ఢిల్లీలో మనుగడ సాగించడం నరకం కంటే భయంకరంగా ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఢిల్లీ వరకు ప్రభావం చూపుతుండటాన్ని అత్యంత కాలుష్యకారకమైన వాయువులను పీలుస్తూ లక్షలాది మంది ఇక్కట్ల పాలవుతుండటాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఢిల్లీ కాలుష్యానికి మీరంటే మీరు కారణమంటూ పరస్పరం నిందలు వేసుకుంటూ గడపడం చూస్తుంటే షాక్ కలుగుతోందని, మీ చేతకానితనం వల్ల ప్రజలెందుకు ఇలా ఇబ్బందులు పడాలి అని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రజలను మీరెలా చూస్తున్నారు.. వారు చనిపోవాలని అనుకుంటున్నారా? పంట వ్యర్థాలపై మీరెలాంటి చర్యలూ తీసుకోలేదంటే దానర్థం ప్రజలు చనిపోయినా ఫర్వాలేదనే కదా మీ ఉద్దేశం. ప్రజలను బలవంతంగా ఇలా గ్యాస్ చాంబర్‌లో ఉంచాలని ఎందుకు అనుకుంటున్నారు? అంతకంటే పేలుడు పదార్థాలు తెచ్చి అదర్నీ ఒకేసారి చంపేయండి అంటూ సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఢిల్లీ ప్రస్తుతం నరకం కంటే దారుణంగా ఉంది. ఇతర దేశాలు మనల్ని చూసి నవ్వుకుంటున్నాయని సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. వ్యక్తుల జీవితానికి మీరిచ్చే విలువ ఇదేనా.. ఇలాగే వాదిస్తే అధికార పీఠంపై కూర్చునే అర్హత కూడా మీకు ఉండదు అంటూ ఢిల్లీ ప్రభుత్వంపై కోర్టు మండిపడింది.

రాజధానిలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల కారణంగా పాలనా సమస్యలు ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ వాదిస్తుంటే కోర్టు తోసిపుచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విభేదాలను పక్కన పెట్టాలని, కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోర్టు సూచించింది.

దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై సోమవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీ అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్యూరిఫైయర్ టవర్స్‌ ఏర్పాటుపై పది రోజుల్లోగా ప్రణాళిక ఖరారు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించాలని.. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విభేదాలు పక్కనపెట్టి కలిసి పని చేయాలని హితవు పలికింది.

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle