newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ప్యాకేజీలు అందేది 18 శాతం వలస కార్మికులకు మాత్రమే.. తాజా సర్వే ఘోష

10-04-202010-04-2020 19:42:26 IST
2020-04-10T14:12:26.538Z10-04-2020 2020-04-10T14:12:22.611Z - - 09-08-2020

ప్యాకేజీలు అందేది 18 శాతం వలస కార్మికులకు మాత్రమే.. తాజా సర్వే ఘోష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ సాహస నిర్ణయానికి దేశమంతటా భావోద్వేగాలు రేకెత్తడం, అంతర్జాతీయ సమాజం కూడా మోదీ సకాలంలో తీసుకున్న కఠిన నిర్ణయాన్ని ప్రశంసించండం.. వంటివి భారతీయ రాజకీయ నాయకత్వపు స్థిరచిత్తానికి నిదర్శనాలుగానే కనిపించవచ్చు. కానీ 130 కోట్ల మంది జనాభాలో అధిక శాతం రోజువారీ పని చేసుకుని వచ్చే కూలీపైనే ఆధారపడి బతుకుతున్న పరిస్థితుల్లో ఏ ప్యాకేజీ కూడా వారిని ఆదుకోలేదనడానికి బోలెడు నిదర్శనలు కనిపిస్తున్నాయి. 

దేశంలోని 82 శాతం మంది కార్మికులకు కేంద్రప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకపోవడంతో ఎలాంటి ఆర్థిక సహాయం కానీ, రేషన్ సరకులు కానీ వీరికి లబించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మన చప్పట్లు, మన దీపాలు, మన క్యాండిల్స్, మన ఉద్వేగాలు ఇవేవీ ఈదేశంలోని వలసకార్మికులకు రెండు పూటల తిండి కూడా పెట్టలేని విషాదం ఇప్పుడు వారి జీవితాలపై పెనుదెబ్బ వేయనుంది..

లాక్ డౌన్ వల్ల ఇప్పటికే మూడువారాలపాటు దినసరి వేతనాన్ని కోల్పోయిన 92.5 శాతం కూలీలు తమ భవిష్యత్తుపై పూర్తిగా నమ్మకం కోల్పోయి ఉంటున్నారని తాజా సర్వేలో తేలింది. కరోనా వైరస్‌ విజంభన, పర్యవసానంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలో దాదాపు 92.5 శాతం కూలీలు మార్చి నెలాఖరు నాటికి ఒక వారం నుంచి మూడు వారాల పాటు దినసరి వేతనాన్ని కోల్పోయారు. ఏప్రిల్‌ 14వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేశాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, తమకు మళ్లీ ఉపాధి దొరకుతుందని నమ్మకం లేదని ‘జన్‌ సాహస్‌’  నిర్వహించిన సర్వేలో 80 శాతం మంది వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

సామాజికంగా వెలివేతకు బలవుతున్న వర్గాల ప్రజల మానవ హక్కుల కోసం కృషి చేస్తోన్న జన్‌ సాహస్‌ మార్చి 27 నుంచి 29 వరకు ఉత్తర, మధ్య భారత్‌కు చెందిన 3,196 మందిని విచారించడం ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు సహా దినసరి వేతన జీవులు దేశ జనాభాలో సగం మంది ఉన్నారు. వారందరు రోజుకు 200 రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు సంపాదిస్తారు. వాస్తవానికి నైపుణ్యం కలిగిన, కొంత నైపుణ్యం కలిగిన, నైపుణ్యంలేని  క్యాటగిరీల కింద దినసరి వేతన జీవులకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు రోజుకు వరుసగా 692, 625, 571 రూపాయలు చెల్లించాలి. 

లాక్‌డౌన్‌ సందర్భంగా ఇలాంటి వలస కార్మికులను, దినసరి వేతన జీవులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల రూపాయలతో ఓ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న ఈ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఉన్నప్పుడే ఈ ఆర్థిక సహాయం అందుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ద్వారా కార్మికులకు ఆర్థిక సహాయం అందాలంటే వారికి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉండాలి. అయితే నేడు దేశంలో 18.8 శాతం కార్మికులు వద్దనే ఆ గుర్తింపు కార్డు ఉన్నట్లు తెల్సింది.

అంటే దాదాపు 82 శాతం మంది కార్మికులకు కార్డులు లేవు కనుక వారికి ఆర్థిక సహాయం అందే అవకాశం లేదు. వారిలో 60 శాతం మందికి ప్రభుత్వం స్కీమ్‌ల గురించిగానీ, గుర్తింపు కార్డు గురించిగానీ ఏమీ తెలియదని జన్‌ సాహస్‌ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల్లో 40 శాతం మందికి రేషన్‌ కార్డులు లేవట. కనుక వారికి రేషన్‌ సరకులు లభించే అవకాశం లేదు. 

దేశంలోని వలసకార్మికుల్లో 66 వేలమందికి మాత్రమే భవననిర్మాణం, ఇతర నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ ఫండ్‌లో భాగంగా కేంద్ర ప్యాకేజీ నుంచి తోడ్పాటు వచ్చే అవకాశముందని, మిగిలిన 94 శాతం మందికి బీఓసీడబ్ల్యూ కార్డు లేనందున వారికి నగదు సహాయం కానీ ఇతరత్రా రేషన్ కానీ అందే అవకాశమే లేకుండా పోయిందని జన సహస్ సర్వే తెలిపింది. పైగా తమకోసం ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు గురించి కూడా తమకు ఏమీ తేలేదని వీరిలో 60 శాతం మంది చెప్పడం విశేషం. 

తాజా సమాచారం మేరకు దేశంలోని 40 శాతంమంది వలస కార్మికులకు రేషన్ రూపంలో ఆహార సరఫరా వ్యవస్థ అందుబాటులో లేదు. వీరిలో అతికొద్దిమందికి మాత్రమే రెండు నుంచి నాలుగువారాల వరకు కుటుంబాన్ని ఆదుకునే రేషన్ అందుతోందని చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అందుతున్న సంకేతాల ప్రకారం లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ చివరి వరకు పొడిగిస్తే ఇక వలస కార్మికుల దుస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ఊహకు కూడా అందదు.

ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం పెంచిన ఆహార ధాన్యాల కోటా కూడా ఇప్పటికే రేషన్ కార్డులు పొంది ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాలకే అందుతున్నాయి తప్ప ఎలాంటి కార్డులూ లేని అధిక సంఖ్యాక వలసకార్మికుల గతి ఏమిటన్నది ఇంతవరకూ ఏ ప్రభుత్వ శాఖ కూడా స్పష్టత ఇవ్వడం లేదు.

అందుకే లాక్ డౌన్ అనేది భారతీయ వలస కార్మికుల దుస్థితికి ప్రారంభం మాత్రమే కానీ ముగింపు కాదని నిపుణులు చెబుతున్నారు.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle