newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

పౌరసత్వ సవరణ చట్టంపై అట్టుడుకుతున్న ఢిల్లీ... ప్రియాంక నిరసన

16-12-201916-12-2019 18:15:20 IST
Updated On 16-12-2019 18:15:12 ISTUpdated On 16-12-20192019-12-16T12:45:20.106Z16-12-2019 2019-12-16T12:44:38.671Z - 2019-12-16T12:45:12.798Z - 16-12-2019

పౌరసత్వ సవరణ చట్టంపై అట్టుడుకుతున్న ఢిల్లీ... ప్రియాంక నిరసన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టంపై వివిధ వర్గాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఈచట్టంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిరసనకు దిగారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఆందోళనకారులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు.

Image

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆందోళనకారుల నిరసనలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. 

ఆందోళనకారులు తగులబెట్టిన బస్సులకు వ్యాపించిన మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా విద్యార్థులు వదలలేదు. వాటిని కూడా ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు గాయపడ్డారు. ఈఘటనలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ  హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఇది తననెంతో బాధిస్తోందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద నిరసనలు కొనసాగాయి. యూనివర్సిటీ గేట్‌-1 వద్ద విద్యార్థుల నిరసనలను కవర్‌ చేస్తుండగా ఇద్దరు జర్నలిస్టులపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఓ వార్తాసంస్థకు చెందిన రిపోర్టర్‌ ఉజ్వల్‌ రాయ్‌, కెమెరాపర్సన్‌ సరబ్‌జీత్‌ సింగ్‌పై కొందరు దాడి చేశారు. గాయపడ్డ వారిని ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. జర్నలిస్టులపై దాడిని పలువురు ఖండించారు.

విద్యార్ధుల దాడుల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద ఉన్న మెట్రో స్టేషన్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేశారు. . ఆ స్టేషన్‌ వద్ద మెట్రో రైళ్లను ఆపడం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరపాలంటే ముందుగా విద్యార్ధులు ఆందోళన ఆపాలని సుప్రీంకోర్టు సూచించింది. 


Image

Image

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle