newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

పోలీసులు ఇలాకూడా శిక్షిస్తారా.. చూసిరాతతో..

08-11-201908-11-2019 09:43:45 IST
2019-11-08T04:13:45.875Z08-11-2019 2019-11-08T04:13:42.669Z - - 05-08-2020

పోలీసులు ఇలాకూడా శిక్షిస్తారా.. చూసిరాతతో..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొద్దిరోజులుగా తమిళ ప్రాచీన మహాకవి తిరువళ్లువార్ తన పేరుతో జరుగుతున్న రాజకీయాలను చూసి ఏమీ చేయలేక మౌనం పాటించి ఉండవచ్చు కానీ తమిళనాడు పోలీసులు మాత్రం ఊరుకోలేదు. తిరుక్కురళ్ పేరుతో గొడవలకు దిగి కొట్టుకున్న విద్యార్థులకు తమదైన రీతిలో శిక్ష విధించారు. అయితే థర్డ్ డిగ్రీ కాదు. ఇంటరాగేషన్ కాదు. బడితపూజ కాదు. ఎవరి పేరు చెప్పి వీధిగొడవలకు సిద్ధమయ్యారో ఆ మహాకవి తిరువళ్లువార్ 2 వేల సంవత్సరాల క్రితం రాసిన మహాకావ్యం తిరుక్కురళ్ లోని మొత్తం 1330 పద్యపాదాలను చూసి రాయాలని 49 మంది విద్యార్థులను పోలీసులు ఆదేశించడం సంచలనం గొల్పుతోంది.

ఒక వారం క్రితం పాళ్యంకోట్టై బస్టాండ్ సమీపంలో చిన్న చిన్న కారణాలతో కొట్టుకున్న 49మంది విద్యార్థులకు తిరునల్వేలి జిల్లా పోలీసులు వింత శిక్ష విధించారు. వారిని తమదైన శైలిలో విచారించి బడితపూజ చేయడానికి బదులుగా దిద్దుబాటు చర్యలతో వారిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నించారు. స్కూలులో పాఠాలు సరిగా వినకుంటే, పరీక్షలు సరిగా రాయకుంటే పరీక్షా ప్రశ్నాపత్రాలను, సమాధానాలను చూసి రాయమని టీచర్లు పిల్లలను ఆదేశిస్తారు కదా. అలాగే వీధుల్లో గలాభా చేస్తున్న విద్యార్థులకు శిక్షగా తమిళుల ఆదిగ్రంథం తిరుక్కురళ్ లోని మొత్తం 1330 నీతిపద్యాలను చూసి రాసి తీసుకురమ్మని పోలీసులు ఆదేశించారు.

పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలోని 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి అక్టోబర్ 29న పాళయంకూట్టై బస్ స్టాండ్ సమీపంలో గొడవలకు దిగారు. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజ్ ఆధారంగా గొడవలకు కారణమైన విద్యార్థులను పాఠశాలలో గాలించి పట్టుకున్నామని, అయితే తామెందుకు కొట్టుకున్నారో వారికే తెలియడం లేదని పాళయం కూట్టై పోలీసు ఇన్‌స్పెక్టర్ థిలాయ్ నాగరాజన్ చెప్పారు.

ఇది కొత్త రకం కేసు కావడంతో ఏం చేయాలో పాలుపోని పోలీసులు తాము పట్టుకున్న పిల్లల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి పిల్లల కొట్లాట గురించి తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పోలీసులు పుస్తకం చూడకుండా తిరుక్కురళ్ శ్లోకాన్ని చదవమని పిల్లలకు చెప్పగా వారిలో ఒక్కరు కూడా తమిళ మహాకవి గ్రంథంలోని ఒక్క శ్లోకాన్ని కూడా చెప్పలేకపోయారు. దీంతో ఆ విద్యార్థులను ఇంటికి వెళ్లి మహాకవి రాసిన మొత్తం 1330 శ్లోకాలను రాసుకుని  మరునాడు స్టేషన్‌కి రావాలని సీఐ నాగరాజన్ చెప్పారు. 

అయితే ఇక్కడా ఒక ట్విస్ట్ జరిగింది. మర్నాడు కొద్ది మంది విద్యార్థులు మాత్రమే స్టేషన్‌కు వచ్చి సీఐ ఇచ్చిన అసైన్‌మెంటును పూర్తి చేసినట్లు చూపించారు. చాలామంది విద్యార్థులు స్టేషనుకూ రాలేదు. అసైన్మెంటూ పూర్తి చేయలేదు. పోలీసు అధికారులు తమకు విధించిన శిక్షను మర్చిపోతారు లెమ్మని వారు నిర్లక్ష్యం చేశారు. కానీ వారనుకున్నది జరగకపోగా స్టేషన్‌కు రప్పించి అక్కడే తిరుక్కురళ్ శ్లోకాలన్నింటినీ రాయమని పోలీసు అధికారి చెప్పి మరీ రాయించారు.

చేసిన తప్పుకు శిక్షగా అసైన్మెంటు రాయమంటే రాయని పిల్లలందరినీ స్టేషనుకు పిలిపించి అక్కడే కూచొబెట్టి తిరుక్కురళ్ శ్లోకాలన్నింటినీ రాయాలని, ఆ తర్వాతే పాఠశాలకు పోవాలని చెప్పామని సీఐ నాగరాజన్ తెలిపారు. అలా 49 మంది విద్యార్థులు రాసిన శ్లోకాలపై స్టేషన్ స్టాంపు వేసి మరీ వాటిని తిరిగి పిల్లలకు ఇచ్చామని, వాటిని తమ తమ స్కూల్ టీచర్లకు ఇవ్వాలని ఆదేశించామని సీఐ తెలిపారు.

చిన్నిపాటి ఘర్షణలకు దిగిన స్కూలుపిల్లలను బాలల సంస్కరణ కేంద్రాలకు పంపించడం ఏమంత మంచిది కాదనిపించిందని, అలా చేస్తే వారి జీవితాలకు, కెరీర్లకు హాని కలుగవచ్చని సీఐ నాగరాజన్ తెలిపారు. వారందరిగీ 16 లేదా 17 సంవత్సరాల వయసు ఉంటుందని, పైగా పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుందని అందుకనే వారు తమ తప్పు గ్రహించి మారాలని చెప్పి చూచిరాత రాయించామని సీఐ చెప్పారు.

తిరుక్కురళ్ గ్రంథంలోని 1330 నీతి శ్లోకాలను ఒకేసారి రాయడం కష్టమే కావచ్చు కానీ మహాకవి రాసిన ఒక్క శ్లోకాన్ని కూడా చెప్పలేకపోయిన పిల్లలకు సరైన శిక్షే విధించారని పాళయం కూట్టం ప్రజలు నవ్వుకున్నారు,

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   38 minutes ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle