newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

పేలిన రియల్ బూమ్.. ఐదు లక్షల కొలువులకు కోత

20-11-201920-11-2019 11:52:14 IST
2019-11-20T06:22:14.920Z20-11-2019 2019-11-20T06:22:08.385Z - - 11-08-2020

పేలిన రియల్ బూమ్.. ఐదు లక్షల కొలువులకు కోత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశం మొత్తంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వికాసానికి మారుపేరుగా గత అయిదేళ్లలో తనదైన ముద్ర లిఖించింది. అలాంటి మహానగరంలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు కట్టిన 28,000కు పైగా గృహాలు, భవనాలు కొనే నాధులు లేక నీరసించిపోతున్నాయి. ఇక యాదాద్రి కేంద్రంగా గత రెండేళ్లుగా సాగిన రియల్ బుడగ పేలిపోవడంతో ఒక్కసారిగా భూముల ధరలు సగానికి సగం పడిపోయాయి. ఈ పరిస్థితిలో దేశంలోని నిర్మాణరంగంలో భారీస్థాయిలో కొలువల కోతకు దారి తీయనుందని అంచనా.  

నిర్మాణ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఆయా కంపెనీలు లేవని, తీవ్ర నగదు కొరత బ్యాంకింగ్‌, నిర్మాణ రంగాలకు సమస్యగా పరిణమిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకులు నిర్మాణ రంగానికి తాజా రుణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొనడం రియల్‌ఎస్టేట్‌ రంగంలో సమస్యలు పెరిగేందుకు దారితీస్తుందని అంచనా వేస్తున్నారు. 

నిర్మాణ రంగం కుదేలైన క్రమంలో రానున్న రెండేళ్లలో రియల్‌ఎస్టేట్‌ ఇతర అనుబంధ రంగాల్లో భారీగా అంటే 5 లక్షల వరకు కొలువుల కోత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన గృహాలు, వెంచర్లలో పలు యూనిట్లు విక్రయానికి నోచుకోకుండా ఉన్నాయని, భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేసినా ఇన్వెంటరీలు పేరుకుపోయాయని నిర్మాణ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా రూ 1.8 లక్షల కోట్ల విలువైన నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. 

నిర్మాణ రంగంలో స్ధబ్ధత కారణంగా దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. ఇక సిమెంట్‌, స్టీల్‌ వంటి అనుబంధ పరిశ్రమలోనూ పెద్దసంఖ్యలో పరోక్ష ఉద్యోగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. 

గృహాలు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండటంతో తక్కువ అద్దెలు, పెట్టుబడి పెరుగుదల ప్రతికూలంగా ఉంటుందనే అంచనాతో ఇన్వెస్టర్లు సైతం ఆస్తుల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. 

ఏ రకంగా చూసినా దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఇది పిడుగుపాటు లాంటి వార్తే. 

 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle