newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

పేదలకు సాయపడితే నన్ను గౌరవించినట్లే.. మోదీ హితవు

09-04-202009-04-2020 14:36:24 IST
Updated On 09-04-2020 14:41:53 ISTUpdated On 09-04-20202020-04-09T09:06:24.718Z09-04-2020 2020-04-09T09:06:22.915Z - 2020-04-09T09:11:53.591Z - 09-04-2020

పేదలకు సాయపడితే నన్ను గౌరవించినట్లే.. మోదీ హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకోసం అహర్నిశలూ కష్టపడుతున్న ప్రధాని మోదీకి గౌరవపూర్వకంగా వందన సమర్పణ చేద్దామంటూ సోషల్ మీడియాలో చక్కర్లు గొడుతున్న పోస్టర్ బహుశా  ఫేక్ కావచ్చు అని అని సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీనే ప్రకటించారు. నిజంగా నాపై మీకు ప్రేమ‌, గౌర‌వం ఉన్న‌ట్లైతే ఓ ప‌ని చేసి పెట్టాలి. క‌రోనా సంక్షోభం ముగిసేవ‌ర‌కు ఒక పేద కుటుంబాన్ని ద‌త్త‌త తీసుకోవాలి అని కోరారు. పేదలకు సహాయం చేయడమే నిజమైన గౌరవం అంటూ హితవు చెప్పిన ప్రధానిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

దేశంలో క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తోంది. ముఖ్యంగా భార‌త ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని ప‌ర్యవేక్షిస్తూ క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌డుతున్నారు. ఈ మ‌హ‌మ్మారితో జ‌రుగుతున్న పోరాటంలో ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌హిస్తున్న వైద్యులకు, మున్సిప‌ల్ సిబ్బందికి, పోలీసుల‌కు, అత్య‌వ‌వ‌స‌ర సిబ్బందికి ప్రోత్సాహం అందించేందుకు మార్చి 22న‌ జ‌న‌తా క‌ర్ఫ్యూ నాడు చ‌ప్ప‌ట్లు కొట్ట‌మ‌ని పిలుపునిచ్చారు. దీంతో భార‌తావ‌ని ఒక్క‌తాటిపైకి వ‌చ్చి దాన్ని త‌మ విధిగా నిర్వ‌ర్తించింది. 

అనంత‌రం దేశ స‌మైక్య‌త‌ను చాటి చెప్పేందుకు ఏప్రిల్ 5న జ్యోతిని వెలిగించాల‌ని కోరగా దాన్ని కూడా ప్ర‌జ‌లు దిగ్విజ‌యం చేశారు. అంతేకాక‌ లాక్‌డౌన్ వ‌ల్ల ఇబ్బందిప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను త‌న హోదాను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఈ నేప‌థ్యంలో మ‌నకోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతున్న‌ న‌రేంద్ర మోదీకి వంద‌నం చేద్దాం.. అంటూ ఓ పోస్ట‌ర్‌ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌న కోసం, మ‌న దేశం కోసం ఎంతో కృషి చేస్తున్న మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ.. ఏప్రిల్ 12న సాయంత్రం 5 గంట‌ల‌కు ఇంట్లోనే నిల్చుని సెల్యూట్ చేద్దాం అన్న‌దే ఈ పోస్ట్ సారాంశం. 

కానీ ఈ పోస్టర్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ''నా కోసం 5 నిమిషాలు నిల‌బ‌డండి అని చేస్తున్న ప్ర‌చారం నా దృష్టికి వ‌చ్చింది. అయితే తొలుత న‌న్ను వివాదంలోకి లాగ‌డానికి అల్ల‌రి మూక‌లు చేసిన ప‌నిగా భావించాను. కానీ నిజంగా నాపై మీకు ప్రేమ‌, గౌర‌వం ఉన్న‌ట్లైతే ఓ ప‌ని చేసి పెట్టాలి. క‌రోనా సంక్షోభం ముగిసేవ‌ర‌కు ఒక పేద కుటుంబాన్ని ద‌త్త‌త తీసుకోవాలి'' అని కోరారు. దీంతో మ‌రోసారి మోదీపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగింనంతవరకు శక్తి ఉన్నవారు కనీసం ఒక పేద కుటుంబాన్నయినా దత్తత తీసుకుని వారి బాధ్యత వహించండి. దీనికంటే నన్ను గౌరవించేది మరేదీ ఉండదన్న మోదీ ఇచ్చిన పిలుపు నెటిజన్లను కదిలిస్తోంది. మీరు నిజంగా నన్ను గౌరవించదల్చినట్లయితే  మిమ్మల్ని ఒకటి అభ్యర్థిస్తున్నా. కనీసం కరోనా వైరస్ నిర్మూలన జరిగేంతవరకైనా ఈ సహాయం చేయండి. అంతకు మించిన గౌరవం నాకు మరొకటి ఉండదు అంటూ మోదీ చేసిన ప్రకటన నిజమైన నాయకుడి లక్షణాన్ని తలపింపచేసిందంటూ సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది

కాగా, ప్రధాని మోదీ ఈ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత సహా కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 14 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్రాలు, ఇతర నిపుణులు కోరుతున్న నేపథ్యంలో ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆ విషయంపై ప్రధాని స్పష్టత ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle