newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

పేదలకు అన్యాయం చేయొద్దు.. పోలీసులకు సీఎం హితవు

12-11-201912-11-2019 09:39:28 IST
2019-11-12T04:09:28.315Z12-11-2019 2019-11-12T04:09:22.681Z - - 09-08-2020

పేదలకు అన్యాయం చేయొద్దు..  పోలీసులకు సీఎం హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చట్టాన్ని అమలు పరుస్తున్నప్పుడు అవతలి పక్షంలో ఎవరు ఉన్నారన్నది పట్టించుకోకుండా పేదలకు న్యాయం చేకూర్చాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హితవు చెప్పారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీ పడొద్దని సూచించారు. రాష్ట్రంలో వలయార్ సిస్టర్స్ హత్య కేసు విచారణంలో పోలీసుల నుంచి జరిగిన తీవ్ర లోపాల కారణంగా నిందితులైన  అధికార పార్టీ సీపీఎం కార్యకర్తలు నిర్దోషులుగా విడుదల కావడాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పోలీసులను సున్నితంగా హెచ్చరించారు. 

కేరళలో ఇటీవలికాలంలో పోలీసులు పలు వివాదాల్లో చిక్కుకుని తీవ్ర విమర్శల పాలవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి పోలీసులకు హితవు చెప్పారు. సాక్షుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేయడంలో సమర్థంగా వ్యవహరించకపోవడంతోపాటు వయలార్ సిస్టర్స్ హత్య కేసువిచారణలో చేసిన తీవ్ర తప్పిదాలకు గాను కేరళ పోలీసులపై ప్రజానీకం ధ్వజమెత్తుతున్నారు. పోలీసులు పక్షపాత వైఖరివల్లే సంచలనం కలిగించిన ఈ కేసులో నిందితులైన అధికార సీపీఎం కార్యకర్తలు కొందరిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.

త్రిసూర్ జిల్లాలోని కేరళ పోలీసు శిక్షణా అకాడమీలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పెరేడ్‌కి హాజరయిన ముఖ్యమంత్రి విజయన్ విధినిర్వహణలో వారు రాజీ పడొద్దని, శాంతిభద్రతలను కాపాడుతూనే పేదలకు అన్యాయం చేయవద్దని సున్నితంగా హెచ్చరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే ప్రత్యేకించి ఎలాంటి వివాదాలను సూచించకుండానే సీఎం తన పోస్టులో పోలీసులకు హితవు చెప్పారు.

చట్టాన్ని అమలు చేసేటప్పుడు వ్యక్తుల ముఖాలను చూడవద్దు. వారి వివరాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. కేసుల విచారణను పూర్తిగా నిష్పాక్షికంగా చేపట్టాలి. పేదలకు న్యాయాన్ని తిరస్కరించవద్దు. పోలీసుల వైఖరి పేదలకు ప్రాధాన్యత ఇవ్వడమే అని విజయన్ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.  సీపీఎం పాలనలో కేరళలో పోలీసులు అతి చర్యలు, తీవ్ర తప్పిదాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పై ప్రకటన చేయడం గమనార్హం.

ప్రజలకు సాయపడటం, వారి విశ్వాసాన్ని చూరగొనడంలో ఉన్న ప్రాధాన్యతను పోలీసులు అర్థం చేసుకోవాలి. ఎలాంటి భయాలకు, సందేహాలకు చోటు లేకుండా పోలీసు స్టేషన్‌కు ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితులు ఉండాలి అని సీఎం విజయన్ సూచించారు.

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   18 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle