newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

10-12-201910-12-2019 09:11:14 IST
2019-12-10T03:41:14.393Z10-12-2019 2019-12-10T03:40:50.031Z - - 24-01-2020

పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్ణాటక రాజధాని బెంగళూరులో పెళ్ళయింది. అందరిలా వారికి కూడా మిత్రులు, బంధువులు మంచి మంచి గిఫ్ట్ లు అందించారు. కానీ ఆ దంపతులకు వచ్చిన గిఫ్ట్ లలో రెండు ప్యాకెట్లు చాలా విచిత్రంగా అనిపించాయి.

ఆ గిఫ్ట్ ప్యాక్ లు విప్పడం ప్రారంభించారు. స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూద్దామని వారంతా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.  ఆ గిఫ్ట్ లో ఉన్న వస్తువులను చూసి షాక్ అయ్యింది.  అవేంటో కాదు... ఉల్లిపాయలు.  వాటిని చూసిన కొత్త జంటతో పాటు అతిథులు కూడా చాలా ఆశ్చర్యపోయారు.

దేశవ్యాప్తంగా ఉల్లిధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లిని కొనాలంటేనే జనం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఉల్లి రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉంటోంది.  దీంతో స్నేహితులు రెండు కేజీల ఉల్లిని కొనుగోలు చేసి రెండు గిఫ్ట్ ప్యాక్ లో అందంగా ప్యాక్ చేసి వధూవరులకు అందజేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాదు, ఉల్లి కోసం దొంగతనాలు జరగడం, పంట చేలలో ఉల్లిని దొంగిలించడం ఇప్పుడు ప్రధాన వార్తలుగా మారిపోయాయి. ఇటీవల ఏపీలో ఇసుక కొరత కారణంగా ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఒక పెళ్ళిలో ఇసుకను బహుమతిగా అందించారు. ఇసుక కొరత నేపథ్యంలో ఓ భవననిర్మాణ కార్మికుడు మిత్రుల్ని ఇంటికి భోజనానికి పిలిచి ఇసుక వడ్డించిన సంగతి తెలిసిందే. 

అనకాపల్లిలో పెళ్ళిచేసుకున్న వధూవరులకు ఓ యువకుడు ఇసుక డబ్బాను బహూకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  అనకాపల్లి మండలం కొత్తతలారివానిపాలెంలో ఓ పెళ్లి జరిగింది. 

తెలుగు యువత నేత ఒకరు నూతన వధూవరులకు ఇసుక డబ్బాను గిఫ్ట్ ప్యాక్ చేసి అందించాడు. మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి ఇసుక తప్ప. బంగారం, వెండి, గృహోపకరణాలు అందుబాటులో వున్నాయని అందుకే ఇసుకను బహుమతిగా ఇచ్చానని పేర్కొన్నాడు.

దీంతో వివాహ వేడుకకు హాజరైన వారు నవ్వుల్లో మునిగిపోయారు. మొత్తం మీద నిన్నామొన్నటి వరకూ ఇసుక, ఇప్పుడు ఉల్లిపాయలు హాట్ టాపిక్ గా మారాయి. 

Image result for onions gift in marriage

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle