newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!

19-09-202019-09-2020 18:35:49 IST
Updated On 19-09-2020 18:47:53 ISTUpdated On 19-09-20202020-09-19T13:05:49.467Z19-09-2020 2020-09-19T13:05:38.093Z - 2020-09-19T13:17:53.865Z - 19-09-2020

పెరుగుతున్న నిరుద్యోగం.. అరకోటికి పైగా ఉద్యోగాలు హుష్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా.. దీని వల్ల నష్టపోనివారంటూ లేరు. కొందరు ఆరోగ్య పరంగా నష్టపోతే.. మరికొందరు జీవితాలే రోడ్డుపాలయ్యాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో పెద్దదిక్కులేక, కుటుంబ పోషణ సాగక కొన్ని వేల మంది నానా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తొలిదశలోనే ప్రధాని మోదీ లాక్ డౌన్ ను ప్రకటించారు. మొదట జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత వారంరోజుల లాక్ డౌన్, అనంతరం 15 రోజులు, నెల, రెండు నెలల పాటు లాక్ డౌన్ ను పొడిగించుకుంటూ వచ్చారు ప్రధాని. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చనుకున్న ప్రధాని అంచనాలు తప్పాయి. వైరస్ కట్టడి కాక పోగా వేలాది మంది వలస కార్మికుల ఉపాధిని పోగొట్టింది కరోనా. 

కరోనా రాకముందు దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లి, బెంగళూరు, చెన్నై, సూరత్, గుజరాత్, హైదరాబాద్, విశాఖపట్నాలకు మారుమూల పల్లె ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ, కుటుంబాలను పోషించి జీవనం సాగించేవారు. కానీ లాక్ డౌన్ వారి తలరాతల్ని మార్చేసింది. వలస వచ్చిన ఊరిలో పనులు లేక, సొంతూరికెళ్లే దారిలేక బిక్కు బిక్కుమంటూ.. అప్పుడప్పుడూ స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, ఇతరులు పెట్టే తిండితో ఒక్కపూట కడుపునింపుకుంటూ కాలం వెళ్లదీశారు. పోనీ లాక్ డౌన్ పూర్తయ్యాకైనా ఉపాధి దొరికిందా అంటే అదీ లేదు. వలస కూలీలకు ఉపాధినిచ్చే కంపెనీలు సైతం నష్టాలబాటలో ఉండటంతో ఇంకా తిరిగి పనులు ప్రారంభించలేని పరిస్థితి. దేశంలో సుమారు 50 లక్షల మంది వలస కూలీలు ఉపాధిని కోల్పోయారు. 

కరోనా ప్రభావం వలస కూలీలపైనే కాదు.. ఉద్యోగులపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ప్రతి 10 మందిలో ఒకరు ఉద్యోగం కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లనే తేడా లేకుండా దేశంలో సుమారు 66 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ ఇండియా ఎకానమీ చేసిన రీసెర్చ్ లో తేలింది. ఉద్యోగాలు కోల్పోయినవారంతా ఉన్నత పదవుల్లో ఉన్నవారు కావడం గమనార్హం. అధిక జీతాలు చెల్లించలేక కొన్ని కంపెనీలు సీనియర్ ఎంప్లాయిస్ ను నిర్మొహమాటంగా తొలగించేసింది. వారి స్థానంలో ఇప్పుడు ఫ్రెషర్స్ కు అవకాశాలిస్తున్నాయి. అయితే ఇది కేవలం తమ రీసెర్చ్ లో తెలిసిన విషయమని, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్న ఆశ్చర్య పోనక్కర్లేదు. 

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు కోల్పోయినవారు, ఉపాధి లేక ఆకలి కేకలు పెడుతున్న వలసకూలీలు కలిపి మొత్తం కోటికి పైగా ప్రజలు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఈ సంస్థ వెల్లడించింది. కరోనా నుంచి మనదేశం విముక్తి పొందేదెప్పటికో ? ఆపై దేశంలో నిరుద్యోగ సమస్య తీరేదెన్నటికో.. అంతా దేవుడికే ఎరుక. 

 

బీజేపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్.. ముగ్గురు కాల్చివేత

బీజేపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్.. ముగ్గురు కాల్చివేత

   31 minutes ago


పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

   an hour ago


అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

   2 hours ago


మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

   2 hours ago


వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

   2 hours ago


బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

   15 hours ago


రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

   21 hours ago


టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   29-10-2020


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   29-10-2020


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   29-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle