newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

పెరుగుతున్న కరోనా ఆందోళన.. 694కి పెరిగిన కేసులు

27-03-202027-03-2020 07:21:22 IST
2020-03-27T01:51:22.883Z27-03-2020 2020-03-27T01:44:14.698Z - - 12-08-2020

పెరుగుతున్న కరోనా ఆందోళన.. 694కి పెరిగిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశాన్ని కరోనా పట్టికుదిపేస్తోంది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు 694కు పెరిగాయి. కొత్తగా 80 కేసులు నమోదయినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో 45 కి చేరిన కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ దోమలగూడకు చెందిన డాక్టర్‌(41)తో పాటు ఆయన భార్య(36)కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. భార్య కూడా డాక్టరే. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

అతను ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటు మరణాల సంఖ్య 16కు పెరిగిందని అధికారులు తెలిపారు. దేశంలో కేసుల పెరుగుదల పెద్దగా లేదని తెలిపింది. కరోనా వ్యాప్తి రెండో దశలోనే ఉందని, సామాజిక వ్యాప్తి లేదని ప్రజలకు భరోసా ఇచ్చింది. రాజస్థాన్‌లోని భీల్వాడాలో మధుమేహం, కిడ్నీ సమస్యతో కోమాలో ఉన్న 73 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకి గురువారం మరణించారు. ఇటు గోవాలో మూడు కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారిలో 42 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 124 కేసులు, తర్వాత కేరళలో 118 కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా వైరస్‌ పరీక్ష కిట్‌ల కోసం భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కొటేషన్లు ఆహ్వానించింది. ఏడు లక్షల కిట్‌లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఎయిర్‌ఫోర్స్‌ దేశవ్యాప్తంగా ఉన్న తన నోడల్‌ కేంద్రాల్లో తొమ్మిది క్వారంటైన్‌ కేంద్రాలు నెలకొల్పినట్టు తెలిపింది. కరోనాపై పోరాటానికి వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. బజాజ్ సంస్థ 100 కోట్ల విరాళం ప్రకటించింది. 

పశ్చిమ బెంగాల్‌లోని స్టార్‌ హోటళ్లు  14 రోజుల క్వారంటైన్‌కు తక్కువ ధరలకు రూములు ఇవ్వడానికి అంగీకరించాయి. తూర్పు ఇండియా హోటల్‌ అండ్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తితో కోల్‌కతాలోని రాజర్‌హాట్‌, న్యూటౌన్‌ ప్రాంతాల్లోని 31 టు, త్రీ, ఫోర్‌ స్టార్‌ హోటళ్లలోని 640 రూములను ఐసోలేషన్‌ కోసం రిజర్వు చేయడానికి అంగీకరించి

కరోనా కారణంగా తలెత్తే సవాళ్ళను ఎదుర్కొనేందుకు ‘మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్‌’ ఉండాలని ఎయిమ్స్‌ నిర్ణయించింది. దీన్ని రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కరోనా బాధితులకు చికిత్సలో అవసరమయ్యే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ముందుకు వచ్చింది. వెంటిలేటర్లను రూ.7,500కే అందించనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. ప్రస్తుతం ఇతర కంపెనీల వెంటిలేటర్ల ఖరీదు రూ.5లక్షల నుంచి రూ10 లక్షల వరకు ఉందని తెలిపింది. ఇటు అన్ని రాష్ట్రాల్లో అనుమతి లేకుండా మాంసం, జంతువుల విక్రయాలు జరగడంపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వున్న అన్ని టోల్ ప్లాజాల్లో  టోల్ రద్దుచేసింది. జాతీయ రహదారులపై నిత్యావసరాలు, పాలు మందులు వంటివి తీసికెళ్ళే వాహనాలను ఎక్కడా ఆపకుండా ఈ నిర్ఱయం తీసుకున్న ఎన్ హెచ్ఏఐ తెలిపింది. ఏపీ వ్యాప్తంగా వున్న 45 టోల్ ప్లాజాల్లో వసూళ్ళు నిలిపివేశారు. ఈ నిర్ణయంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు సాఫీగా ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతోంది. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle