newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

పెద్దల సభలో రచ్చ.. సభ్యుల సస్పెన్షన్..!

21-09-202021-09-2020 10:50:24 IST
Updated On 21-09-2020 12:42:41 ISTUpdated On 21-09-20202020-09-21T05:20:24.258Z21-09-2020 2020-09-21T05:20:21.446Z - 2020-09-21T07:12:41.252Z - 21-09-2020

పెద్దల సభలో రచ్చ.. సభ్యుల సస్పెన్షన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పార్లెమెంటులో గత నాలుగు రోజులుగా దుమారం రేగుతూనే ఉంది. ఇప్పటికే లోక్ సభ ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపగా వివాదాల నడుమే రాజ్యసభలో కూడా ఆదివారం ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే ఈ బిల్లులు చట్టరూపం దాల్చనున్నాయి. బిల్లులు ఆమోదం పొందినా పెద్దల సభలో రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం సభ మొదలైన దగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలు వ్యవసాయ బిల్లులపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలకు దిగారు. దీంతో సభ మొత్తం రసాభాసగా మారింది.

సభలో రభస సృష్టించిన ప్రతిపక్ష సభ్యులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మొత్తం ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సభ నుంచి బహిష్కరిస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పట్ల విపక్ష సభ్యులు అనుచితంగా వ్యవహరించారనీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ చైర్మన్ వెంకయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

డెరెక్ ఓ బ్రైన్, సంజయ్ సింగ్, రాజు సతవ్, కెకె రగేష్, రిపున్ బోరా, డోలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమరన్ కరీం తదితరులపై సస్పెన్షన్ వేటు పడగా సభ్యుల సస్పెన్షన్ అనంతరం కూడా వివాదం ముగిసిపోలేదు. కాగా, ప్రతిపక్ష సభ్యులు ఆదివారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా సోమవారం సభ్యుల సస్పెన్షన్ మరింత వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

బీజేపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్.. ముగ్గురు కాల్చివేత

బీజేపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్.. ముగ్గురు కాల్చివేత

   an hour ago


పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

   an hour ago


అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

   2 hours ago


మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

   2 hours ago


వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

   2 hours ago


బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

   16 hours ago


రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

   21 hours ago


టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   29-10-2020


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   29-10-2020


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   29-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle