newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

10-07-202010-07-2020 10:19:16 IST
Updated On 10-07-2020 13:52:06 ISTUpdated On 10-07-20202020-07-10T04:49:16.192Z10-07-2020 2020-07-10T04:47:38.077Z - 2020-07-10T08:22:06.096Z - 10-07-2020

పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికాలోని లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ కారణంగా విద్యాసంస్థలు పూర్తిగా  ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు మారితే... ఆ కాలేజీల్లోని విదేశీ విద్యార్థులు అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది.  ఈ మేరకు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం (ఐసీఈ) మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు నిర్వహించనున్న సెమిస్టర్‌కి సంబంధించి కొత్తగా వీసాలు జారీ చేయబోమని కూడా స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ఉండాలనుకునే వారు భౌతికంగా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించే విద్యాసంస్థలకు బదిలీ కావాలని, లేదంటే ఇమ్మిగ్రేషన్‌ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని ఐసీఈ హెచ్చరించింది. 

మరోవైపు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు మాధ్యమాల (హైబ్రిడ్‌) ద్వారా తరగతులు నిర్వహిస్తున్న సంస్థలు తమ విద్యార్థులు భౌతికంగా హాజరవుతున్నారని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. ఈ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఒకటి కంటే ఎక్కువ లేదా త్రీ ఆన్‌లైన్‌ క్రెడిట్‌ అవర్సే అనుమతిస్తారు. కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించడం లేదని, విద్యార్థులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటికీ హాజరవుతున్నారని సదరు విద్యా సంస్థ స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. 

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది విదేశీ విద్యార్థులకు ఆశనిపాతంలా మారింది. ముఖ్యంగా సెప్టెంబరులో ప్రారంభం కానున్న సెమిస్టర్‌లో అడ్మిషన్‌ పొందాలని చూస్తున్న విదేశీ విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అమెరికా నిర్ణయంతో అక్కడి విద్యాసంస్థలన్నీ దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 

2017, 2018 విద్యా సంవత్సరాల్లో  చైనా(478,732) తరవాత భారత్‌(251,290) నుంచే అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.  ఐసీఈ నిర్ణయంపై అమెరికాల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఈ చర్యను అమెరికాలోని పలువురు విద్యావేత్తలు, చట్టసభల సభ్యులు ‘భయానక’ నిర్ణయంగా అభివర్ణించారు. ఐసీఈ జారీ చేసిన మార్గదర్శకాలు భయంకరంగా ఉన్నాయని, ఈ విషయంలో తాము మరింత స్పష్టతను కోరుతున్నామని ది అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌(ఏసీఈ) అధ్యక్షుడు టెడ్‌ మిచెల్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రతిపక్ష డెమొక్రటిక్‌ పార్టీ కూడా ఈ నిర్ణయంపై తీవ్రంగా విరుచుకు పడింది.  

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తీసుకున్న నిర్ణయంపై భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది.  భారత వీదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా యూఎస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ స్టేట్‌ సెక్రటరీ డేవిడ్‌ హేల్‌తో నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. భారతీయ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడతామని డేవిడ్‌ హేల్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

‘ఆన్‌లైన్‌’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ

న్యూయార్క్‌: ఆన్‌లైన్‌ క్లాస్‌లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ వేశాయి.

ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ లారెన్స్‌ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. 

 

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   6 hours ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   14 hours ago


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   15 hours ago


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   03-08-2020


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle