newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన

20-09-202020-09-2020 10:24:28 IST
2020-09-20T04:54:28.508Z20-09-2020 2020-09-20T04:50:43.722Z - - 30-10-2020

పుస్తకాలే లేవు.. ఆన్‌లైన్ క్లాసులపై.. తల్లిదండ్రుల తీవ్ర ఆవేదన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి భారతదేశంలో ఇప్పటికే పిల్లల్లో ఉన్న డిజిటల్ డివైడ్‌ని మరింతగా పెంచివేసిందా.. దేశం మొత్తం మీద 80 శాతం పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ విద్య ఏమాత్రం అందుబాటులో లేదా.. భారత్‌లో ప్రభుత్వ పాఠశాలలు లాక్ డౌన్ కాలంలో విద్యార్థులందరికీ విద్యను అందించడంలో ఘోరంగా విఫలమయ్యాయా.. అనే పరుస ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాల్సి ఉంది.

విశ్వమహమ్మారి  కోవిడ్‌ వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేయాల్సి రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్‌ మీడియా ద్వారా విద్యా బోధన విధానాన్ని అనసరించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేటు పాఠశాలలను పక్కన పెట్టి, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యా సంస్థల్లో ఈ విద్యా విధానం ఏ మేరకు విజయవంమైందో తెలుసుకునేందుకు ‘ఆక్స్‌ఫామ్‌ ఇండియా’ స్వచ్ఛందంగా ఓ సర్వే నిర్వహించింది. 

ఈ సంస్థ ప్రతినిధులు సర్వేలో భాగంగా ఇటీవల బిహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించి ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.. ఈ క్రమంలో డిజిటల్‌ విద్యావిధానం తమ పిల్లలకు అందుబాటులోకి రాలేదని 80 శాతం మంది తల్లిదండ్రులు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 15 శాతం మంది జనాభాకే ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ జనాభాలో కూడా దళితులు, ఆదివాసీలు, ముస్లింలకు కూడా నెట్‌ సదుపాయం అందుబాటులో లేదు. 

ఆన్‌లైన్‌ తరగతులు అందుబాటులో ఉన్న విద్యార్థులకు కూడా పెద్ద ప్రయోజనం కలగలేదని, అందుకు కారణం ఆన్‌లైన్‌ క్లాసులకు అనుగుణంగా తగిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేకపోవడమేనని 80 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభానికే ముందే వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, అలా లేకపోవడం దురదష్టకరమని 71 శాతం మంది టీచర్లు అభిప్రాయపడ్డారు. 

డిజిటల్‌ తరగతుల విధానం దేశంలో కొత్త కాకపోయినా, కొన్ని సామాజిక వర్గాలకు నెట్‌ సదుపాయం అందుబాటులో లేదని ‘ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌’ సీఈవో రుక్మిణి బెనర్జీ తెలిపారు. కఠిన పరిస్థితుల్లో డిజిటల్‌ తరగతులు ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకాలం పాటు విద్యా సంస్థలు మూత పడతాయని ఎవరూ ఊహించలేక పోయారని ఆమె చెప్పారు. 

గత మార్చి నెలలో లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలను మూసివేయగా, జూన్‌ నెలలో ఆన్‌లైన్‌ క్లాసులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే. మధ్యాహ్న భోజనంతోపాటు వారికిచ్చే లెర్నింగ్‌ పరికరాలను కూడా పునరుద్ధరించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ 35 శాతానికి మించి పిల్లలకు ఈ సదుపాయం అందడం లేదని సర్వేలో తేలింది. 

బిహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 1,158 మంది తల్లిదండ్రులు, 488 టీటర్లను కలిసి ఈ సర్వేని నిర్వహించారు. సెప్టెంబర్ 4న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం చాలామంది కుటుంబాలకు డిజిటల్ ఉపకరణాలు లేకపోవడం, డిజిటల్ విద్యా మీడియం అందుబాటులో లేకపోవడం వల్ల తమ పిల్లలకు ఆన్ లైన్ చదువు అందడం లేదని తేలింది.

లాక్ డౌన్ కారణంగా ఉన్నట్లుండి విద్యా సంస్థలను మూసివేయడంతో దేశంలోని 32 కోట్ల మంది విద్యార్థులు విద్య పొందే అవకాశాలకు దూరమయ్యారని, ఆహార భద్రత లేమి, ఆర్థిక, సామాజిక ఒత్తిడి ఈ పిల్లలపై తీవ్ర ప్రభావం వేస్తోందని డ్రీమ్ ఎ డ్రీమ్ అనే ఎన్జీఓ అధ్యయనంలో తేలింది.

 

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన పాకిస్థాన్

   28 minutes ago


అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

అభినందన్‌ని వదలకపోతే భారత్ దాడి.. వణికిపోయిన పాక్ ఆర్మీ చీఫ్

   an hour ago


మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

మా మధ్య మీ జోక్యమేంటి.. అమెరికాపై గయ్‌మన్న చైనా

   an hour ago


వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

వ్యాక్సిన్ వస్తుందనే ధీమాతో మాస్కులు వదిలేయడం డేంజర్

   an hour ago


బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

బయటివారు కశ్మీర్ వస్తే అత్యాచారాలు పెరుగుతాయి.. పీడీపీ నేత

   15 hours ago


రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

రజనీకాంత్ కి అనారోగ్య సమస్యలు..రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?

   20 hours ago


టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

టిక్కెట్లు ర‌ద్దు చేసుకోండి.. డ‌బ్బులిస్తం

   a day ago


ఇదేంద‌య్యా  ఇది

ఇదేంద‌య్యా ఇది

   29-10-2020


ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

ఈసారి కూడా ట్రంపే గెలిస్తే.. అది అమెరికాకు పెద్ద గుణపాఠం హిల్లరీ క్లింటన్

   29-10-2020


త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చే వ‌ర‌కు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేస్తున్నాము

   28-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle