newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

పుల్వామా దాడికి ఏడాది.. అమరులకు అశ్రు నివాళి

14-02-202014-02-2020 13:03:18 IST
Updated On 14-02-2020 13:20:33 ISTUpdated On 14-02-20202020-02-14T07:33:18.068Z14-02-2020 2020-02-14T07:33:14.266Z - 2020-02-14T07:50:33.167Z - 14-02-2020

పుల్వామా దాడికి ఏడాది.. అమరులకు అశ్రు నివాళి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
2019, ఫిబ్రవరి 14... దేశం ఉలిక్కిపడ్డ రోజిది. సైనిక వాహనశ్రేణినే టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడికి పాల్పడి 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఘటనకు ఏడాది పూర్తయింది. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన 40 మంది సైనికులు అశువులు బాశారు.

జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా సైనికులు జమ్మూ నుంచి  శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. అంతమంది సైనికులను రోడ్డుమార్గంలో పంపడం రిస్క్ అనే భావన వచ్చినా.. అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు.

సైనికులను హతమార్చడానికి కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ను ఆత్మాహుతి ఆయుధంగా ఉపయోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సీఆర్పీఎఫ్ వాహనాలు వస్తున్న సమయం అంతా పక్కాగా తెలుసుకుని, జాతీయ రహదారికి ఆనుకుని వున్న అవంతీపుర సమీపాన ఉన్న  లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొనడంతో ఆ వాహనం పేలిపోయింది. 

జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉండడంతో వాహనాల వేగం తక్కువే. అంతేకాదు వాహనాల శ్రేణిలో సైనికులు ఏ వాహనాల్లో వున్నారో కూడా ముందే ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడం ఉగ్రవాదులకు కలిసి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు లభించింది.

ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల అనంతరం ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. సర్జికల్ స్ట్రయిక్స్ లో 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడితో పాక్ రెచ్చిపోయింది. భారత సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. అయితే, వీటిని భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది. పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు జాతియావత్తూ నివాళులర్పిస్తోంది. వారి త్యాగాలను కొనియాడుతున్నారు దేశ ప్రజలు. 

 

జాతీయవాదం, ‘భారత్‌మాతాకీ జై’ నినాదం దుర్వినియోగం: మన్మోహన్

జాతీయవాదం, ‘భారత్‌మాతాకీ జై’ నినాదం దుర్వినియోగం: మన్మోహన్

   6 hours ago


మోదీ-ట్రంప్‌లది ఫాసిస్టు కూటమి: గుజరాత్ విద్యావేత్తల నిరసన లేఖ

మోదీ-ట్రంప్‌లది ఫాసిస్టు కూటమి: గుజరాత్ విద్యావేత్తల నిరసన లేఖ

   11 hours ago


వాహనాల రిపేరులో గో మెకానిక్ విప్లవం

వాహనాల రిపేరులో గో మెకానిక్ విప్లవం

   15 hours ago


బాహుబలిగా సందడి చేసిన ట్రంప్.. వైరల్ వీడియో

బాహుబలిగా సందడి చేసిన ట్రంప్.. వైరల్ వీడియో

   16 hours ago


సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

సోన్‌భద్రలో 3 వేల టన్నుల బంగారం నిల్వలు.. దేశ రిజర్వుల కంటే 5 రెట్లు

   16 hours ago


భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

భారత్ ప్రత్యేక విమానానికి అడ్డుతగల్లేదు: చైనా వివరణ

   22-02-2020


విమానయాన రంగం రెక్కలు విరుస్తున్న కోవిడ్19

విమానయాన రంగం రెక్కలు విరుస్తున్న కోవిడ్19

   22-02-2020


అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

అమూల్య.. ఆర్ద్ర పేరు ఏదైనా... వివాదాస్పదమే

   22-02-2020


పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

   22-02-2020


స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

స్వైన్ ఫ్లూ వైరస్‌తో వణుకుతున్న బెంగళూరు

   22-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle