newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

పీఎన్ఎస్ సాద్ రక్షణకు పాక్ పాట్లు

25-06-201925-06-2019 07:41:24 IST
Updated On 25-06-2019 12:02:44 ISTUpdated On 25-06-20192019-06-25T02:11:24.335Z25-06-2019 2019-06-25T01:58:43.656Z - 2019-06-25T06:32:44.107Z - 25-06-2019

పీఎన్ఎస్ సాద్ రక్షణకు పాక్ పాట్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలాకోట్ దాడుల త‌ర్వాత పాకిస్తాన్ మ‌న సైన్యం దెబ్బ‌కు ఓస్థాయిలో వ‌ణికి పోయిందట‌. ఎప్పుడు ఎటు నుంచి ఇండియ‌న్ ఆర్మీ దాడి చేస్తుందో అన్న భ‌యంతో యుద్ధ‌నౌక‌లు, జ‌లాంత‌ర్గాముల‌ను సుర‌క్షిత ప్ర‌దేశాల‌కు త‌రలించింద‌ట‌. ఎందుకంటే ఓ ద‌శ‌లో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. దాదాపుగా యుద్ధం ఖాయ‌మ‌న్న రీతిలో ఉద్రిక్త‌త‌లు పెర‌గ‌డం, అదే స‌మ‌యంలో యుద్ధ నౌక‌లు, అణ్వాయుధ నౌక‌ల‌తో పాటు జ‌లాంత‌ర్గాముల‌ను ఇండియ‌న్ నేవీ క‌రాచీకి ద‌గ్గ‌ర‌గా మోహ‌రించ‌డంతో పాకిస్తాన్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ట‌. 

దీంతో అత్యంత టెక్నాల‌జీతో రూపొందించిన పీఎన్ఎస్ సాద్ జ‌లాంత‌ర్గామిని క‌రాచీ స‌ముద్ర జ‌లాల నుంచి మాయం చేసింద‌ట పాకిస్తాన్ నేవీ. ఈ విష‌యం క‌నిపెట్టిన నిఘా వ‌ర్గాలు ఇండియ‌న్ నేవీ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో, ఆ జ‌లాంత‌ర్గామి భార‌త జ‌లాల్లోకి చొర‌బ‌డింద‌న్న అనుమానం నేవీ అధికారుల‌కు వ‌చ్చింది.

దీంతో పాకిస్తాన్ సైన్యానికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేవీ, పీఎన్ఎస్ సాద్ జ‌లాంత‌ర్గామి కోసం వేట కొన‌సాగించారు. క‌రాచీ తీరం నుంచి గుజ‌రాత్ తీరానికి ఆ జ‌లాంత‌ర్గామి రావ‌డానికి మూడు రోజులు ప‌డుతుంద‌నీ, ముంబై తీరానికి రావ‌డానికి ఐదు రోజులు ప‌డుతుంద‌నీ లెక్క‌లు క‌ట్టిన నేవీ అధికారులు అంచ‌నా వేశారు. 

వెంట‌నే జ‌లాంత‌ర్గాముల‌ను గుర్తించే అత్యంత అధునాత‌న యుద్ధ నౌక‌ల‌ను రంగంలోకి దింపిన నౌకాద‌ళం, త‌క్కువ స‌మ‌యంలో పీఎన్ఎస్ సాద్ జ‌లాంత‌ర్గామి త‌క్కువ స‌మ‌యంలో ఎక్క‌డి వెళ్తుందో అంచ‌నా వేసి స‌ముద్ర జ‌లాల్లో జ‌ల్లెడ ప‌ట్టింది. ముఖ్యంగా గుజ‌రాత్, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు స‌ముద్ర తీరాల్లో క్షుణ్నంగా జ‌ల్లెడ ప‌ట్టింది.

ఇందుకోసం ఐఎన్ఎస్ చ‌క్ర‌, ఐఎన్ఎస్ క‌ల్వ‌రి యుద్ధ నౌక‌ల‌తో పాటు స్కార్పీన్ క్లాస్ జ‌లాంత‌ర్గామిని ఉప‌యోగించారు నేవీ అధికారులు. ఇదే స‌మ‌యంలో భార‌త జ‌లాల్లో ఎలాంటి అల‌జ‌డి సృష్టించినా, దాడుల‌కు పాల్ప‌డినా తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని పాకిస్తాన్ సైన్యానికి గ‌ట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చార‌ట నేవీ అధికారులు. 

ఇలా దాదాపు ప‌ది రోజుల పాటు స‌ముద్ర జ‌లాల్లో పీఎన్ఎస్ సాద్ జ‌లాంత‌ర్గామి కోసం జ‌ల్లెడ ప‌ట్టినా దాని ఆచూకీ తెలియ‌క పోవ‌డంతో టెన్ష‌న్ ప‌డ్డ మ‌న నేదీ అధికారులు, శాటిలైట్ లొకేట‌ర్ల‌తో జాడ తెల్సుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

ఇలా 21 రోజుల నిరంత‌ర గాలింపు త‌ర్వాత పాకిస్తాన్ ప‌శ్చిమ తీరంలో పీఎన్ఎస్ సాద్ జ‌లాంత‌ర్గామి ఉన్న‌ట్లు క‌నిపెట్టారు. అయితే క‌రాచీ పోర్ట్ నుంచి ప‌శ్చిమ తీరానికి ఆ జలాంత‌ర్గామిని ఎందుకు త‌ర‌లించార‌న్న దానిపై నిఘా వ‌ర్గాలు కూపీ లాగడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. 

పీఎన్ఎస్ సాద్ జ‌లాంత‌ర్గామిని భార‌త నేవీ ద‌ళాలు ధ్వంసం చేస్తాయ‌న్న భ‌యంతోనే పాకిస్తాన్ క‌రాచీ నుంచి త‌ర‌లించిన‌ట్లు తేలింది. అంతేకాదు, త‌మ‌పై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ద‌ళాలు ముప్పేట దాడి చేస్తాయ‌న్న భ‌యంతో అత్యంత విలువైన యుద్ధ నౌక‌ల‌ను కూడా ముందు జాగ్ర‌త్త‌గా మ‌క్రాన్ తీరానికి పాకిస్తాన్ త‌ర‌లించింద‌ట‌. యుద్ధం వస్తే స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోడానికి యుద్ధ నౌక‌లు, జ‌లాంత‌ర్గాముల‌ను సిద్ధంగా ఉంచాల్సిన పాకిస్తాన్  వాటిని జాగ్ర‌త్త‌గా సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించింది అంటే, మ‌న సైన్యం దెబ్బ‌కి ఏ మేర‌కు భ‌య‌ప‌డిందో ఇట్టే అర్థం అవుతోంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle