newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

పిల్లల లైంగిక వేధింపులలో ట్విట్టర్‌దే ప్రధాన పాత్ర: ఐడబ్ల్యూఎఫ్ నివేదిక

12-11-201912-11-2019 10:32:21 IST
Updated On 12-11-2019 12:37:42 ISTUpdated On 12-11-20192019-11-12T05:02:21.072Z12-11-2019 2019-11-12T05:02:18.558Z - 2019-11-12T07:07:42.258Z - 12-11-2019

పిల్లల లైంగిక వేధింపులలో ట్విట్టర్‌దే ప్రధాన పాత్ర: ఐడబ్ల్యూఎఫ్ నివేదిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియాలో  పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న డేటాను ప్రచురిస్తున్న వాటిలో ట్విట్టర్‌దే అగ్రస్థానం అని తేలింది. గత మూడేళ్ల కాలంలో సోషల్ మీడియాలో, సెర్చ్ ఇంజన్లలో, క్లౌడ్ సర్వీసుల్లో పోస్ట్ చేస్తున్న అభ్యంతరకరమైన ఇమేజీలు, వీడియోలు, యుఆర్ఎల్ లింకులలో 49 శాతం వరకు  ట్విట్టర్ నుంచే వస్తున్నాయని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ (ఐడబ్ల్యూఎఫ్) నివేదించింది.

బ్రిటన్‌కు చెందిన ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ సంస్థ ఈ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించింది. సోషల్ మీడియాలో పిల్లలను లైంగిక వేధింపు పాలుచేస్తున్న కంటెంటులో సగం వరకు మైక్రో బ్లాగింగ్ ప్రాట్‌ఱఫాం అయిన ట్విట్టర్ లోనే కనిపిస్తోందని ఐడబ్ల్యుఎఫ్ తెలిపింది. తమ అధ్యయనంలో మొత్తం 2,835 ఘటనలు నమోదైతే వాటిలో1,396 ఘటనలు ట్వట్టర్‌లోనే రికార్డు అయి ఉండటం గమనార్హమని సంస్థ పేర్కొంది.

ట్విట్టర్ ఫిల్టర్ల ద్వారా పిల్లలను లైంగికంగా వేధించే చిత్రాలు, వీడియోలు ప్రదర్శించబడుతూ అందరూ వాటిని చూసేలా అందుబాటులో ఉంచడం భీతి గొలుపుతోందని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ, ఏ ప్లాట్‌ఫాంలో అయినా సరే లైంగిక వేధింపులు ప్రత్యేకించి పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆన్ లైన్ కంటెంటును తగ్గించడంలో తాము సహాయ పడుతున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రధానంగా పిల్లలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఇమేజ్‌లు, వీడియోలను తొలగించడంపైనే తాము దృష్టి పెడుతున్నామని తెలిపింది.

పిల్లల లైంగిక వేధింపుకు చెందిన ఇమేజీలు, వీడియోలను ఆన్ లైన్‌లో శోధించి తర్వాత అలాంటి కంటెంటు ఎక్కడున్నా సరే తమకు నివేదించాల్సిందిగా ప్రజలను కోరుతూ ఒక ప్లేస్‌ను ఇంటర్నెట్‌లో కేటాయించామని, వ్యక్తులు తమ వివరాలు బయటపెట్టకుండానే ఇలాంటి అభ్యంతరరకమైన ఘటనలను తమకు రిపోర్ట్ చేయాలని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ సంస్థ పేర్కొంది.

ట్విట్టర్ తర్వాత పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారం పంపిణీ చేయడంలో మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన బింగ్ సెర్చ్ ఇంజన్ రెండో స్థానంలో నిలిచిందని ఐడబ్ల్యూఎఫ్ ఆరోపించింది. 2016-18 మధ్య కాలంలో బింగ్‌లో 604 అభ్యంతరకరమై కంటెంటుకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని అమెజాన్ 375,  గూగుల్ 348 ఘటనలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయని ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ పేర్కొంది.

ఇక ఫేస్‌బుక్‌లో 72, ఇన్‌స్టాగ్రామ్‌లో 18, యుట్యూబ్‌లో 22 అభ్యంతరకరమైన ఉదంతాలను సంస్థ కనుగొంది. కాగా ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ ప్రకటించిన గణాంకాల కచ్చితత్వం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని, ఇలాంటి ఉదంతాలను వెలికితీయడంలో వారు అవలంబిస్తున్న పరామితుల కచ్చితత్వం గురించి తాము మదింపు చేస్తున్నామని ట్విట్టర్ పేర్కొంది.

మైక్రోసాఫ్ట్ కూడా పిల్లల వేధింపుకు సంబంధించిన పోర్న్ చిత్రాలను, వీడియోలను ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉందని విమర్శలు వస్తున్నాయి. బింగ్ ప్లాట్ ఫాంలోని కొన్ని పదాలు ప్రత్యేకించి పిల్లల పోర్న్ చిత్రాలు, వాటికి సంబంధించిన కీలకపదాలను కలిగిఉన్నాయని తేలింది.

పదేళ్ల నుంచి వేధింపులకు చెందిన చిత్రాలను తొలగించడంలో తాము ముందున్నామని, ఫోటో డీఎన్ఎ వంటి టూల్‌ను కూడా పదేళ్లకు ముందే తాము రూపొందించి లైంగికవేధింపులకు చెందిన డేటా పనిపడుతున్నామని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చెబుతున్నప్పటికీ దాని సెర్చి  ఇంజన్ అయిన బింగ్ లైంగిక వేధింపులకు చెందిన డేటాను ప్రచురించడంలో అత్యంత ఆధారపడదగిన సాధనంగా ఉంటోందని  పట్టుబడిన అనేకమంది నేరస్తులు పేర్కొనడం గమనార్హం.

Image result for Nearly half of child abuse content shared on social media is on Twitter IWF report

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle