newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

పాలు ఇలా కూడా పోస్తారా....వైరల్ అవుతున్న ఫోటో

09-05-202009-05-2020 08:53:53 IST
Updated On 09-05-2020 09:19:16 ISTUpdated On 09-05-20202020-05-09T03:23:53.909Z09-05-2020 2020-05-09T03:23:46.788Z - 2020-05-09T03:49:16.870Z - 09-05-2020

పాలు ఇలా కూడా పోస్తారా....వైరల్ అవుతున్న ఫోటో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోంది.  కరోనా వైరస్‌ విజృంభణతో ప్రజల జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్నాయి. నిత్యావసర సరకులు, పాలు, కూరగాయల విక్రయాల వద్ద మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖానికి మాస్క్ పెట్టుకుని అటు అమ్మకం దారులు. ఇటు వినియోగదారులు తగిన విధంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పాలు నిత్యావసరాల్లో ప్రధానమయినవి. కరోనా వైరస్ పాలద్వారా, కూరగాయల ద్వారా కూడా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. పాలు పోసే సమయంలో కూడా భౌతికదూరం పాటించేలా ఉపాయం ఆలోచించాడు. ఓ పైపునకు గరాట జోడించి పాల క్యాన్లతోపాటు బైక్‌కు దాన్ని అమర్చుకున్నాడు.

మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించి ద్విచక్రవాహనంపై కూర్చొనే పాలు పోస్తున్నాడు. భౌతిక దూరం పాటించేందుకు ఇది ఓ చక్కటి ఉపాయమని అతడి వద్ద పాలు కొనుగోలు చేస్తున్న  వినియోగదారులు మెచ్చుకుంటున్నారు.  దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఐఏఎస్‌ అధికారి నితిన్‌ సంగ్వాన్‌ ట్విటర్‌లో ఈ ఫొటో పోస్ట్‌ చేశారు. పాల వ్యాపారి ఆలోచనను మెచ్చుకున్నారు. ‘కొందరు వ్యక్తులు తమను, తమ చుట్టూ ఉన్న వారిని సురక్షితంగా ఉంచడానికి వినూత్నంగా ఆలోచించడం సంతోషంగా ఉంది.

ఇళ్లలో ఉన్నప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉందాం. ఈ పాల వ్యాపారిలా బయటికి వెళ్లాల్సిన అవసరం లేకపోయినా.. మాస్కు ధరించి, కనీస భౌతిక దూరం పాటిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ‘సృజనాత్మకత, పాల వ్యాపారికి కుడోస్‌, ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్న ఈ వ్యక్తికి హ్యాట్సాఫ్‌, ఇది నిజంగా గొప్ప ఆలోచన, ప్రజల్లో అవగాహన ఏర్పడటం ఆనందంగా ఉంది..’ అని రకరకాల పోస్ట్‌లు చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు మాత్రం తెలియరాలేదు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle