newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

పార్లమెంటు ముందు రక్షణ అడిగిన యువతిని ఆడపోలీసులు రక్తం వచ్చేలా కొట్టారు

01-12-201901-12-2019 08:54:47 IST
2019-12-01T03:24:47.475Z01-12-2019 2019-12-01T03:24:19.995Z - - 06-12-2019

 పార్లమెంటు ముందు రక్షణ అడిగిన యువతిని ఆడపోలీసులు రక్తం వచ్చేలా కొట్టారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రియాంకారెడ్డి దారుణ అత్యాచార హత్యకు నిరసనగా శనివారం ఉదయం 7 గంటలకు దేశరాజధానిలో పార్లమెంట్ వద్ద గళమెత్తిన ఓ యువతిని మహిళా పోలీసులు అడ్డుకుని చితకబాదిన ఘటన దేశాన్ని రగిలిస్తోంది. దేశం నిద్రనుండి లేస్తున్న వేళ ఈ దేశంలో నా రక్షణ విషయం ఏమిటి? అంటూ నిలదీసిన ఆ యువతిని మహిళా పోలీసులు దురుసుగా వ్యవహరించి హింసించి బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

నా భారతదేశంలో నాలాంటి ఆడపిల్లలకు రక్షణ లేదా.. ఈ దేశంలో ఎందుకు పుట్టానా అనిపిస్తోంది అంటూ ఆక్రోశించిన ఆ యువ ఉద్యోగిని స్వరాన్ని మహిళా పోలీసులు ఆటంకపర్చడం సంచలనానికి దారితీయడమే కాకుండా జనం మూకుమ్మడి నిరసనకు ప్రేరేపించింది. 

ఇంతవరకు పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం గురించిన వార్తలను విన్నాం కానీ కాకీ బట్టలువేసుకున్న మహిళా పోలీసులు అంత కంటే ఘోరంగా వ్యవహరించగలరని, సమస్య పట్ల కనీస సున్నితత్వం కూడా ప్రదర్శించలేనంతగా పోలీస్ బలగాలు మొత్తంగా బండబారిపోయాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అనూ దూబే అనే ఆ అమ్మాయి వేసిన ప్రశ్న ఒక్క రాజకీయనేతను కదిలించకపోగా ఎవరి శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు ఉన్నారనే ప్రశ్న దేశం ముందు నిలుస్తోంది. వీడియోకు అడ్డంగా దొరికిపోయిన ఢిల్లీ మహిళా పోలీసులు దేశం పరువును పూర్తిగా తీసేశారు. నాకు రక్షణ ఏది అని అడిగిన అమ్మాయిని మహిళా పోలీసులు ఇంత దురుసుగా వ్యవహరిస్తారా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

ప్రియాంకారెడ్డి హత్యపై పార్లమెంటు వద్ద ఓ యువతి గళమెత్తింది. తన సొంత దేశంలో తనకు రక్షణ ఉన్న భావన కలగడం లేదని వాపోయింది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల వార్తలు వినీ వినీ తాను అలసిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రియాంకకు ఎదురైన ఉదంతం తనకు ఎదురైతే పరిస్థితి ఏంటి అంటూ కన్నీటిపర్యంతమైంది. ఈ దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి అంటూ నిలదీసింది. 

ప్రియాంక హత్యపై ఢిల్లీకి చెందిన అను దూబే తీవ్ర కలత చెందింది. ఈ ఘటన తనకు ఎదురైతే పరిస్థితి ఏంటని ఊహించుకొని కుమిలిపోయింది. తన రక్షణపై పాలకులను ప్రశ్నిస్తూ శనివారం ఉదయం 7 గంటలకే పార్లమెంటు వద్ద తనొక్కటే నిరసనకు దిగింది. దేశంలో తనకు ఉన్న రక్షణ ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ప్లకార్డు పట్టుకొని కూర్చుంది. 

పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మరోసారి ఈ దేశంలో ఇలాంటి ఘటనలు చూసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. చివరికి పోలీసులు ఆమెను బలవంతంగా పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

కాగా, అను దూబేను పోలీసులు అడ్డుకున్న తీరును ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. దూబేతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకుని దూబేకు సంఘీభావం తెలిపారు. సాటి యువతిని హింసించిన ఆ మహిళా పోలీసులపై తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అన్నిటికంటే ముఖ్యమైన విషయం నాకు ఈ దేశంలో భద్రత ఉందని అనుకోవడం లేదు అంటూ గంటలపాటు పార్లమెంటు ముందు బ్యానర్ పట్టుకుని కూర్చున్న అను దుబేని తర్వాత ఢిల్లీ మహిళా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. దేశ ప్రజల భద్రతకు బాధ్యత వహించాల్సిన వారు పూర్తిగా గూండాలుగా మారిపోయారని అనూ విలపిస్తూ వ్యాఖ్యానించారు.

కాగా ప్రియాంకారెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. యువ వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడంపై యావత్తు దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రియాంక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. దోషులను ఉరితీయాలంటూ శనివారం పార్లమెంటు స్ట్రీట్‌ వద్ద ఆందోళన బాటపట్టాయి.

 

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

   14 hours ago


లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

   17 hours ago


రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

   18 hours ago


డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

   04-12-2019


ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

   04-12-2019


రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

   04-12-2019


బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

   04-12-2019


స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

   03-12-2019


నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

   03-12-2019


ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

   03-12-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle