newssting
BITING NEWS :
*దిశ ఘటన మరువక ముందే మరో విషాదం... ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి*హైదరాబాద్‌ టీ-20లో టీమిండియా ఘన విజయం.. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన భారత జట్టు *హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. నిందితుల మృతహాలను ఈ నెల 9 వరకు భద్రపరచాలన్న హైకోర్టు... 9న ఉదయం 10.30 గంటలకు విచారణ *కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.*నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది: వైకాపా నేత, ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి*చింతపల్లిలో దారుణం.. కుక్కలకు బలయిన శిశువు *కర్నూలు: ఉల్లి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన*ఇవాళ జార్ఖండ్ లో రెండవ విడత పోలింగ్ *దిశ నిందితులు కరుడుగట్టిన నేరస్తులు : సీపీ సజ్జనార్

పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన

02-12-201902-12-2019 12:54:48 IST
Updated On 02-12-2019 13:42:30 ISTUpdated On 02-12-20192019-12-02T07:24:48.249Z02-12-2019 2019-12-02T07:24:40.352Z - 2019-12-02T08:12:30.799Z - 02-12-2019

పార్లమెంటును కుదిపేసిన దిశా ఘటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్‌ దిశ హత్యోదంతంపై పార్లమెంటులో సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ ఘోరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. కేసు విషయంలో జాప్యం లేకుండా త్వరగా నిర్ణయాలు రావాలన్నారు ఎంపీ కనకమేడల రవీంద్రరావు.

దిశ ఘటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు ఎంపీ సౌగతా రాయ్. ఎంపీ అమీ యాజ్నిక్‌ ప్రభుత్వ వ్యవస్థలన్నీఒకే తాటిపైకి వచ్చినపుడే సామాజిక సంస్కరణలు జరుగుతాయని పేర్కొన్నారు.

ఈ ఘటన దేశాన్ని కలిచివేసిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దిశను హత్యచేసిన వారికి ఈ నెలాఖరులోపు శిక్షించాలని, వారిని మరణించేవరకూ శిక్షాకాలం ఉండాలన్నారు అన్నా డీఎంకె ఎంపీ విజిల సత్యానంద్.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షలు సత్వరం అమలుచేయాలన్నారు. ఈ సంఘటనపై అన్ని పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. చట్టాలు చేయడం వల్లే బాధితులకు న్యాయం జరగదన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మహిళలపై దాడులకు తెగబడుతున్నవారికి కఠిన శిక్షలు అమలు చేయాలని సభ్యులు సూచించారు. 

దిశా ఘటనపై లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో చ‌ర్చించారు. మోదీ, షాలు.. 370 బిల్లుతో భార‌త మాత త‌ల ఎత్తుకునేలా చేశారు, అలాగే క‌ఠిన‌మైన బిల్లుతో నిందితుల‌ను శిక్షించాలని కాకినాడ ఎంపీ గీత కోరారు. మ‌ద్యం, డ్ర‌గ్స్‌ను నియంత్రించాల‌న్నారు.అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత డిమాండ్ చేశారు.  నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. బెంగాల్ ఎంపీ లాకెట్ ఛ‌ట‌ర్జీ దిశా ఘటనను ఖండించారు. 

కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భ‌ద్ర‌త ఉండే హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రగ‌డం శోచ‌నీయం అన్నారు. నియంత్ర‌ణ లేకుండా మ‌ద్యం అమ్మ‌డం కూడా ఈ ఘ‌ట‌న‌కు దారితీసింద‌న్నారు. అత్యాచారానికి పాల్ప‌డిన‌ నిందితుల‌ను ఉరితీయాల‌ని టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు డిమాండ్ చేశారు. దిశా ఘటనలో నిందితులకు కఠినశిక్షలు విధిస్తామని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నిలువరించేందుకు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. చట్టాల్లో మార్పులు చేసే విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్. 

 

 

 

విషాదం.. ఉన్నావ్ బాధితురాలి మృతి

విషాదం.. ఉన్నావ్ బాధితురాలి మృతి

   an hour ago


ఉల్లిపాయలు లేవంటే.. వేలుకొరికేసిన ప్రబుద్ధుడు

ఉల్లిపాయలు లేవంటే.. వేలుకొరికేసిన ప్రబుద్ధుడు

   10 hours ago


30 ఏళ్ల క్రితం అత్యాచారాలపై అమితాబ్ సంచలన వ్యాఖ్యలు..

30 ఏళ్ల క్రితం అత్యాచారాలపై అమితాబ్ సంచలన వ్యాఖ్యలు..

   16 hours ago


దిశకు 8 రోజుల్లోనే న్యాయం.. నా బిడ్డకెప్పుడు న్యాయం చేస్తారు.. నిర్భయ తల్లి ప్రశ్న

దిశకు 8 రోజుల్లోనే న్యాయం.. నా బిడ్డకెప్పుడు న్యాయం చేస్తారు.. నిర్భయ తల్లి ప్రశ్న

   19 hours ago


సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

   05-12-2019


లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

   05-12-2019


రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

   05-12-2019


డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

   04-12-2019


ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

   04-12-2019


రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

   04-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle