newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?

22-02-202022-02-2020 08:37:19 IST
2020-02-22T03:07:19.874Z22-02-2020 2020-02-22T03:06:19.370Z - - 03-08-2020

పార్టీల ఆశలు.. లోక్ సభ సీట్లు పెరుగుతాయా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా లోకసభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయా? ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధులు ప్రజల కనీస మౌలిక సౌకర్యాలు తీర్చగలుగుతున్నారా... 1971 జనాభా లెక్కల ప్రకారం లోకసభ నియోజవర్గాలు విభజన జరిగింది.. అంటే 40 ఏళ్లకాలంలో జనాభా దాదాపు రెట్టింపైంది. ఆ దామాషా ప్రకారం పార్లమెంట్ లోనూ 1000 వరకు నియోజవర్గాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న నియోజకవర్గాలు కొన్ని చాలా పెద్దవిగా మరాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్.... భిన్న జాతులు, మతాలు, వర్గాలు, కులాలు కలసి మెలిసి జీవనం సాగిస్తారు. అంతే కాదు ప్రతి ఐదేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుంటారు . ఇక అధికార మార్పిడి ప్రశాంతంగా జరుగుతుంది. అధికార గర్వంతో విర్రవీగిన  నాయకులను ప్రజలు తర్వాత ఎన్నికల్లో శిక్షిస్తున్నారు.  అంతే కాదు  నాయకుల పరిమితులను గుర్తు చేస్తున్నారు. 130 కోట్లకు పైగా ఉన్న జనాభాతో ముందుకు సాగుతోంది. మున్ముందు చైనాను దాటి అత్యధిక జనాభాగల దేశంగా గుర్తింపు పొందనుంది.

ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయా? ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు ప్రజల మౌలిక సౌకర్యాలు తీర్చగలుగుతున్నారా? అనే ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పడనుంది. నియోజకవర్గంలో  10 నుంచి 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.  ఒకే ఒక్క ప్రజాప్రతినిధి లక్షల సంఖ్యలో ఉండే ప్రజల అవసరాలు తీర్చగలరా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే వీటికి సంతృప్తికరమైన సమాధానం దొరకడం కష్టమే. 

నియోజకవర్గాలు ముఖ్యంగా లోక్ సభ నియోజకవర్గాలను పెంచడం ద్వారా ఈ సమస్యకు కొంతవరకూ పరిష్కారం కనుగొనవచ్చని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభ స్థానాల పెంపు గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో నియోజకవర్గాలను కూడా పెంచక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. కనీసం వెయ్యి లోక్ సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. 

రాష్ట్రాలను పక్కన పెడితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన, 1977 లో లోక్ సభ స్థానాలను నిర్ణయించారు. అప్పట్లో దేశ జనాభా కేవలం 54 కోట్లే. ప్రస్తుతం జనాభా 130 కోట్లకు పెరిగింది. 43 ఏళ్లలో జనాభా పట్టపగ్గాలు లేకుండా పెరిగింది. కానీ ఆ స్థాయిలో లోక్ సభ నియోజకవర్గాలు పెరగలేదు. అంటే సగటున ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో ఆయా ప్రాంతాలను బట్టి పది నుంచి 15 లక్షల మంది ఓటర్లున్నారు. ఒక ఎంపీ ఇంతమంది ప్రజల బాగోగులను చూసుకోగలరా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. 

లోక్ సభ నియోజకవర్గాలను పెంచడమే ఇందుకు పరిష్కారమన్న వాదన విన్పిస్తోంది. కనీసం ఆరేడు లక్షలకు ఈ సంఖ్యను కుదించాలి. దీని ద్వారా ఇప్పుడున్న లోక్ సభ స్థానాలు రెట్టింపు అవుతాయి. దీని ద్వారా ఆరేడు అసెంబ్లీ స్థానాలకు లోక్ సభ స్థానం పరిమితం అవుతుంది. జనాభా పరంగా చిన్న దేశాల్లో ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. ఒకప్పుడు మనదేశాన్ని పాలించిన బ్రిటన్ ప్రస్తుత జనాభా ఆరు కోట్లే. కానీ అక్కడి చట్ట సభలో 650 మంది సభ్యులున్నారు.

దేశంలోని ఒక్క ఇంగ్లండ్ ప్రావిన్స్ లోనే 500కు పైగా స్థానాలున్నాయి. 30 కోట్లకు పైగా జనాభా గల అగ్రరాజ్యమైన అమెరికా కాంగ్రెస్ లో సభ్యుల సంఖ్య 535. ఎంతో చిన్న దేశమైన కెనడాలో 443 మంది లోక్ సభ సభ్యులున్నారు. ఈ దేశాల పరిస్థితులను చూసిన తర్వాత భారత్ లోనూ చట్ట సభ సభ్యుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత స్పష్టమవుతోంది. ఆ లెక్కన మనదేశ జనాభాకు అనుగుణంగా 1000 లోక్ సభ స్థానాలుండాలి. దీని ప్రకారం ఇప్పుడున్న రాష్ట్రాల్లోని ఎంపీల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఏపీలో ఇప్పుడు 25 మంది ఎంపీలుంటే వారు రెట్టింపు అవుతారు. 

అయిదు దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్ సభ స్థానాలున్నాయి. తమిళనాడు 39, పుదుచ్చేరి ఒకటి, కర్ణాటక 28, ఏపీ 25, తెలంగాణ 17, కేరళలో 20 ఎంపీ స్థానాలున్నాయి. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఉత్తరాదిలో జనాభా నానాటికీ పెరుగుతోంది. జనాభా తగ్గడం వల్ల నియోజకవర్గాలు తగ్గడం, పెరగడం వల్ల నియోజకవర్గాలు పెరగడం జరగుతోంది. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరముంది. జనాభాను నియంత్రిస్తూనే నియోజకవర్గాల పెంపుపై సమగ్ర కసరత్తు చేయాలని కోరుతున్నారు. లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలు పెరగాలి. దీనిపై వివిధ రాష్ట్రాలు కేంద్రంపై వత్తిడి తెస్తున్నాయి. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle