newssting
BITING NEWS :
*కార్మికులతో చర్చలు జరపండి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశం * విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు * ఆర్టీసీ జేఏసీ సమావేశం.*ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ.. కోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం*హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం...ప్రియురాలిని భవనం పైనుంచి కిందకు నెట్టి చంపిన ప్రియుడు*కేబినెట్ సమావేశాల నిర్వాహణలో సీఎం జగన్ కీలక నిర్ణయం..ఇకపై నెలలో రెండు సార్లు మంత్రి వర్గ సమావేశం *ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా...మంత్రి పువ్వాడ అజయ్ తో ఫోన్‌ లో మాట్లాడిన గవర్నర్ *హూజూర్‌నగర్‌లో భారీ వర్షం.. మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం.. కేసీఆర్ టూర్ రద్దు

పాకిస్తాన్ తీరుపై ఎఫ్ఏటీఎఫ్ వార్నింగ్

23-06-201923-06-2019 09:42:29 IST
Updated On 24-06-2019 12:11:28 ISTUpdated On 24-06-20192019-06-23T04:12:29.917Z23-06-2019 2019-06-23T03:58:21.305Z - 2019-06-24T06:41:28.317Z - 24-06-2019

పాకిస్తాన్ తీరుపై ఎఫ్ఏటీఎఫ్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మీద ప్ర‌పంచ దేశాలు వ‌త్తిడి మ‌రింత పెంచాయి. మొన్న‌టికి మొన్న జైష్ ఏ మ‌హ్మ‌ద్ ఉగ్ర‌వాది సంస్థ అధ్యక్షుడు అజార్ మ‌సూద్ మీద అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ఐక్య‌రాజ్య స‌మితి గుర్తించిన‌ప్ప‌టి నుంచీ, పాకిస్తాన్ పెద్ద‌ల‌కు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ ఆర్థిక మూలాల మీద అమెరికా, ఫ్రాన్స్ దేశాలు దృష్టి సారించాయి. 

ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ద‌న్నుగా ఉన్న పాకిస్తాన్ పాల‌కుల‌ను ఓవైపు హెచ్చ‌రిస్తూనే, మ‌రోవైపు నిధులు స‌మ‌కూరుస్తున్న దేశాలు, సంస్థ‌ల జాబితా పాక్ పాల‌కుల‌కు అంద‌జేసింది ది ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాక్స్ ఫోర్స్ సంస్థ‌. అంత‌ర్జాతీయంగా ఉగ్ర‌వాదుల‌కు అందుతున్న నిధుల‌ను అడ్డుకోడానికి తాము చేసిన 27 సూచన‌ల‌ను పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స‌రిగ్గా పాటించ‌డం లేద‌ని ఆరోపించింది.

ఉగ్ర‌వాదుల‌కు నిధుల సాయం చేస్తున్న పాకిస్తాన్ మీద మండిప‌డ్డ ఎఫ్ఏటీఎఫ్, గ‌తేడాది ఆ దేశాన్ని గ్రే లిస్ట్ దేశాల జాబితాలో చేర్చింది. ఇంత జ‌రిగినా పాకిస్తాన్ పాల‌కుల్లో ఎలాంటి మార్పు రాలేద‌నీ, ఇప్ప‌టి దాకా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదంటూ ఐర్లాండులో జ‌రిగిన ప్లీన‌రీలో పాకిస్తాన్ పాల‌కుల‌ను మ‌రోసారి హెచ్చ‌రించింది.

ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాక్స్ ఫోర్స్ సంస్థ‌. ఈ ఏడాది అక్టోబ‌ర్ చివ‌రి నాటికి తాము సూచించిన చ‌ర్య‌లు తీసుకుని, ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు వ‌చ్చే నిధులు అడ్డుకోవాల‌ని తేల్చి చెప్పింది. తాము చెప్పింది చేయ‌క‌పోతే, పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో చేర్చ‌డం ఖాయ‌మ‌ని వార్నింగ్ ఇచ్చింది. ఇదే జ‌రిగితే పాకిస్తాన్ ప్ర‌పంచ దేశాల్లో ఏకాకి అవుతుంది. 

అంటే ప్ర‌పంచంలో ఏ దేశం నుంచి పాకిస్తాన్ పాల‌కుల‌కు ఒక్క పైసా కూడా అప్పుపుట్ట‌దు. ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిన పాకిస్తాన్, ఈ గండం నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అన్న‌ది తేల్చుకోలేక పోతున్న త‌రుణంలో, ఇప్పుడు ఎఫ్ఏటీఎఫ్ వార్నింగ్, పాక్ పాల‌కుల‌కు మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది.

ఓవైపు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ను అదుపు చేయ‌డం పాకిస్తాన్ ప్ర‌భుత్వానికి అలివికాని స‌మ‌స్య‌గా మారింది. ఎందుకంటే, పాకిస్తాన్ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌యోధ్య లేద‌న్న‌ది నిజం. ఉగ్ర‌వాదుల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను, ప‌లు రాష్ట్రాల పాల‌కులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. 

మొన్న‌టికి మొన్న రంజాన్ సంద‌ర్భంగా లాహోర్ పురాత‌న మ‌సీదులో ప్రార్థ‌న‌లు చేయ‌డానికి బ‌య‌లు దేరిన అజార్ మ‌సూద్ ను అడ్డుకున్నారు పాకిస్తాన్ పోలీసులు. దీనిపై ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. కొంత మంది ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాన్ని స‌మ‌ర్థిస్తే, మ‌రికొంద‌రు అజార్ మ‌సూల్ వైపే ఉన్నార‌ట‌. ఇక ఐఎస్ఐ సంగ‌తి స‌రేస‌రి. ఉగ్ర‌వాదుల విష‌యంలో ఇమ్రాన్ ఖాన్ ఒంటెద్దు పోక‌డ‌లు పోతున్నారంటూ ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో పాకిస్తాన్ ప్ర‌ధాని ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాల‌ను ఎలా అమ‌లు చేస్తార‌న్న‌ది తేలాల్సి ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle