newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !

20-09-202020-09-2020 09:35:36 IST
Updated On 20-09-2020 11:13:51 ISTUpdated On 20-09-20202020-09-20T04:05:36.929Z20-09-2020 2020-09-20T04:05:34.542Z - 2020-09-20T05:43:51.748Z - 20-09-2020

పాకిస్తాన్, చైనా.. భారత సహనానికి పరీక్ష.. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక వైపు పాకిస్థాన్, మరో వైపు చైనా భారత్ సహనాన్ని పరీక్షిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దాయాది దేశం పాకిస్థాన్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...దానికి జీవం, జవం కూడా భారత్ వ్యతిరేకతే. దేశంలో పేదరికం, అభివృద్ధి లేమి వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్ లో ప్రభుత్వాలకు ఉన్న ఒకే ఒక తరుణోపాయం...భారత వ్యతిరేకత. ఇక చైనా విషయానికి వస్తే ఆ దేశ దురాక్రమణ దాహానికి పొరుగున ఉన్న దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రెండు దేశాల దుస్సాహసానికీ, దుర్బుద్ధికీ భారత్ ఎప్పటి కప్పుడు దీటుగా బదులిస్తూనే ఉంది.

ఇక పాకిస్థాన్ అయితే కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత్ ను కవ్వించడం పరిపాటే. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో పాకిస్థాన్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ పాకిస్థాన్ 3186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.  పార్లమెంటు వేదికగా ఈ గణాంకాలను కేంద్రమే వెల్లడించింది. ఇక ఇరు దేశాల మధ్యా కాల్పుల విరమణ ఒప్పందం 2003లో జరిగింది. అప్పటి నుంచి పాకిస్థాన్ ఆ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ వస్తున్నది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇంత వరకూ పాకిస్థాన్ అత్యధిక సార్లు ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది.

పాక్ కాల్పులకు ఈ ఏడాది ఇప్పటి వరకూ 8 మంది జవాన్లు అమరులయ్యారు. పలువురు సామాన్య పౌరులూ బలయ్యారు. అసంఖ్యాకంగా గాయపడ్డారు. ఒక వైపు పాకిస్థాన్, మరో వైపు చైనా బారత్ కు సరిహద్దుల్లో కాల్లో ముల్లులా సలుపుతున్నాయి. అయినా శాంతి కాముక దేశమైన భారత్ ఓర్పుతో పొరుగుదేశాల దూకుడును నియంత్రిస్తున్నదే తప్ప దాడికి దిగలేదు. సహనానికీ ఒక హద్దు ఉంటుంది. ఉగ్రమూకలకు ఊతమిస్తున్న దేశంగా పాకిస్థాన్ ప్రపంచ దేశాలలో ఏకాకిగా మారింది. దురాక్రమణ దారుగా చైనా కూడా ప్రపంచ దేశాల దృష్టిలో దోషిగా నిలిచింది. ప్రపంచ శాంతికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్న ఆ దేశాల దూకుడుకు అడ్డు కట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో భారత్ కు ప్రపంచ దేశాలు అండగా నిలవాలి.


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle