newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

పరిశ్రమల్లో భయం.. పౌరుల్లో అవిశ్వాసమే కారణం: మన్మోహన్ సింగ్

19-11-201919-11-2019 09:48:32 IST
2019-11-19T04:18:32.352Z19-11-2019 2019-11-19T04:18:30.030Z - - 05-08-2020

 పరిశ్రమల్లో భయం.. పౌరుల్లో అవిశ్వాసమే కారణం: మన్మోహన్ సింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆందోళనకు దారితీస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగిత పెరిగిపోవడం, 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టస్థాయికి జీడీపీ పడిపోవడం, నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్వల్ప స్థాయికి గృహనిర్మాణ రంగం కుదేలైపోవడం, కనీ వినీ ఎరుగని రీతిలో బ్యాంకుల మొండిబకాయిలు పేరుకుపోవడం వంటివి మన ఆర్థిక వ్యవస్థ దుస్థితిని సూచిస్తున్నాయని సింగ్ తెలిపారు.

ఏ ఆర్థిక వ్యవస్థ అయినా పనిచేయాలంటే ప్రజలు, సంస్థల మధ్య పరస్పర మార్పిడిలు, సామాజిక చొరవ అవసరమని, దీనికి పరస్పర విశ్వాసం, ఆత్మవిశ్వాసమే ప్రాతిపదికగా ఉండాలని సింగ్ చెప్పారు. కానీ ప్రస్తుతం ఉభయ పక్షాల మధ్య అలాంటి విశ్వాసం, మద్దతు అడుగంటిపోయాయని సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో ప్రస్తుతం ప్రభుత్వం సృష్టిస్తున్న భీతావహ పరిస్థితులు పారిశ్రామికవేత్తలను వణికిస్తున్నాయని ప్రభుత్వ అధికారుల వేధింపు వల్ల తాము నిత్యం భయంతో జీవిస్తున్నామని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు తనతో చెప్పారని మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఎక్కడ చూసినా అవిశ్వాసం రాజ్యమేలుతోందన్నారు.  బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి భయపడుతున్నాయి. తాజాగా ప్రాజెక్టులు ప్రారంభించడానికి వ్యాపారస్తులు ఇష్టపడటం లేదు. టెక్నాలజీ అంకుర పరిశ్రమలు నిత్యం నిఘా నీడలో కొనసాగుతున్నాయి ఎందుకంటే సమాజం మొత్తంలో భయ వాతావరణం ప్రస్తుతం రాజ్యమేలుతోంది. ఈ భయం, అపనమ్మకం కారణంగానే ఆర్థిక పురోగతి ప్రధాన శక్తులు పూర్తిగా మౌనం పాటిస్తున్నారని మాజీ ప్రధాని వివరించారు. 

వీటన్నింటి ఫలితంగా, ఆర్థిక లావాదేవీలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని, ఇదే ఆర్థిక మందగమనానికీ, స్తబ్దతకు దారి తీస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ పతనానికి ప్రధాన కారణం ఏదంటే అపనమ్మకం, ఆత్మవిశ్వాసం కొరవడటమేనని మాజీ ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్వతంత్ర సంస్థలైన న్యాయవ్యవస్థ, రెగ్యులేటరీ సంస్థలు, నిఘా సంస్థలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని సింగ్ తెలిపారు. చట్టవిరుద్ధమైన పన్ను వేధింపులు లేక అన్యాయపు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇప్పుడు ఒక సహాయ వ్యవస్థ కూడా అందుబాటులో లేకుండా పోయిందని సింగ్ వాపోయారు. దీనివల్లే కొత్తప్రాజెక్టులను చేపట్టే విషయంలో వ్యాపారవేత్తలు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు.

ప్రతి పారిశ్రామికవేత్త, విధాన నిర్ణేత, బ్యాంకర్, పౌరులు ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతున్నారన్న ప్రభుత్వ అనుమానమే మన సమాజం మొత్తంలో పరస్పర విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిందని మన్మోహనం సింగ్ చెప్పారు.

గత ప్రభుత్వాలు చేసిన ప్రతి పనికీ దురుద్దేశాలు అంటగడుతూ మోదీ ప్రభుత్వం అనుమాన్పద దృష్టితో చూడటం వల్లే పరిస్థితి ఇంత ఘోరంగా తయారైందని, ఇలాంటి దురుద్దేశం ప్రాతిపదిక మీద మోదీ తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు విధ్వసం కర ఫలితాలను తీసుకొచ్చిందని సింగ్ ఆరోపించారు.

కునారిల్లిపోయిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాలంటే ద్రవ్యవిధానం ద్వారా డిమాండును పెంచడం, సోషల్ పాలసీ ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడం అనే జంట విధానాన్ని అమలు చేయాలని సింగ్ సూచించారు. సమాజంలోని ఆర్థిక శక్తులలో నమ్మకాన్ని ప్రోత్సహించకుండా ఆర్థిక మాంద్య పరిస్థితులను తొలగించడం అసాధ్యం, అసంభవం అని సింగ్ హెచ్చరించారు

Image result for Fear, distrust among citizens root cause of current economic slowdown Manmohan Singh

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle