newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

పది లక్షల జనాభాకు 727 కేసులు.. రికార్డు స్థాయిలో రికవరీ

18-07-202018-07-2020 11:39:36 IST
2020-07-18T06:09:36.632Z18-07-2020 2020-07-18T06:09:33.381Z - - 27-09-2020

పది లక్షల జనాభాకు 727 కేసులు.. రికార్డు స్థాయిలో రికవరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో కరోనా కేసుల రికవరీ అసాధారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా యావత్ ప్రపంచం ఇప్పటికే గుర్తించింది. దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రజారోగ్య వ్యవస్థ కొడిగట్టుతున్న దీపంలో వెలవెలబోతున్నప్పటికీ వైద్యసిబ్బంది మహా సంకల్పంతో పరిస్థితిని చాలావరకు అదుపులోకి తీసుకొచ్చారనే చెప్పాలి. దాని ఫలితమే లక్షల్లో కేసులు నమోదవుతున్నప్పటికీ 63 శాతం రికవరీ మన దేశంలోనే నమోదైంది. సంపన్న దేశాలకు కూడా సాధ్యం కాని రికార్డు ఇది.

అయిదున్నర నెలల కాలంలో భారత్‌లో కరోనా కేసులు 10 లక్షల సంఖ్యను దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 34,956  కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 10,03,832 కు చేరింది.  

మరోవైపు మరణాల సంఖ్య 25 వేలను దాటింది. గత 24 గంటల్లో 687 మందితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 25,602 కు పెరిగింది. అయితే  రికవరీ రికార్డు స్థాయిలో పెరిగింది. 24 గంటల్లో 22,942 బాధితులు కోలుకున్నారు.

వివరాల్లోకి పోతే దేశంలో తొలి  కోవిడ్‌-19 కేసు జనవరి 30 న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనే బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది. దేశంలో కరోనా కేసుల్లో  మహారాష్ట్ర టాప్‌ లో ఉండగా,  తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక  ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

మహారాష్ట్రలో 2 లక్షల 84,281 మందికి కరోనా వైరస్ సోకగా, ఇప్పటివరకు 11,194మంది ప్రాణాలు విడిచారు. తమిళనాడులో లక్షా 56,369 కరోనా కేసులు 2,236 మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 51,422 మంది కరోనా సోకగా 1,032 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఢిల్లీలో లక్షా 18,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,545మంది మరణించారు. 

ఆంధ్రప్రదేశ్‌ లో 35,159 మందికి కరోనా వైరస్ సోకగా 492 మంది చనిపోయారు. తెలంగాణలో 41,018కి చేరుకోగా 396 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) బృందం వచ్చే నెలన్నర రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేసింది. సెప్టెంబరు 1కి పాజిటివ్‌ కేసులు 35 లక్షలకు చేరతాయని లెక్కగట్టింది. 

ఈ తరుణంలో కేంద్ర వైద్యఆరోగ్య శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. భారత్‌‌లో ప్రస్తుతం ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,756 మాత్రమేనని ప్రకటించింది. దాదాపు 63.33 శాతం రికవరీ రేటు భారత్‌లో నమోదైందని, 6.35 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది.

జనాభాలో 1.35 బిలియన్లతో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని.. అలాంటి మన దేశంలో మిలియన్ జనాభాకు 727.4 కరోనా కేసులు మాత్రమే నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

 

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   34 minutes ago


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   an hour ago


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   2 hours ago


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   2 hours ago


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   4 hours ago


బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

   16 hours ago


ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

   17 hours ago


సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

   18 hours ago


తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

   26-09-2020


ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

   26-09-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle